iPhone 15 Pro | ఐఫోన్‌ను కొనాలని చూస్తున్నారా..? భారీ తగ్గింపు ధరకే పొందవచ్చు.. ధర ఎంతంటే..?
Technology | Published On Dec 13, 2025, 5.58 pm IST
iPhone 15 Pro | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తన నూతన ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 17 ఫోన్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఐఫోన్ 17 ఫోన్లు రిలీజ్ అయినప్పటికీ పాత ఐఫోన్లకు ఇంకా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 ఫోన్లను ఇప్పటికీ యూజర్లు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్ల తయారీని ఇప్పటికీ యాపిల్ నిలిపివేసింది. అయినప్పటికీ చాలా మంది ఐఫోన్ ప్రియులకు ఈ ఫోన్ ఫేవరెట్‌గా మారింది. ఈ క్రమంలోనే ఐఫోన్ 15కు చెందిన ప్రొ మోడల్‌ను చాలా మంది కొంటున్నారు. అయితే ఐఫోన్ 15 ప్రొ ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకు జియో మార్ట్ అందిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను కొనాలని చూస్తుంటే ఇది చక్కని ఆఫర్ అని చెప్పవచ్చు.
ఐఫోన్ 15 ప్రొ ఫోన్ కు చెందిన 128జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ.1,34,900గా ఉంది. అయితే ఇప్పుడీ ఫోన్ ఏకంగా రూ.62,953 ధరకే లభిస్తుండడం విశేషం. అంటే లాంచ్ అయినప్పటి కన్నా ఇప్పటికి ఈఫోన్ ధర రూ.71,947 తగ్గిందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌ను ఇంకా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని జియో మార్ట్ అందిస్తోంది. జియో మార్ట్ లో ఐఫోన్ 15 ప్రొ ఫోన్‌ను ఇంకా చాలా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐకి చెందిన కో బ్రాండ్ ప్లాటినం క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇలా దీనిపై రూ.1000 తగ్గుతుంది. ఈ విధంగా ఈ ఫోన్‌ను రూ.61,953 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌లో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 15 ప్రొ ఫోన్‌లో 6.1 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. కనుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌లో యాపిల్‌కు చెందిన ఎ17 ప్రొ చిప్‌సెట్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 12 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా, 12 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు కూడా 12 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫేస్ ఐడీకి ఇందులో సపోర్ట్‌ను ఇచ్చారు. 3274 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ కి కూడా ఇందులో సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నాచురల్ టైటానియం కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

iPhone 17 | మదర్ప్ డే సందర్భంగా యాపిల్ సేల్.. ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింపు..
మే 6, 2026

Apple | యాపిల్ యూజర్లకు బంపర్ ఫీచర్.. ఇకపై డివైస్‌లలో నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



