త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HP OmniBook 5 | ఓఎల్ఈడీ డిస్‌ప్లేల‌తో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌లు అదిరాయి.. ధ‌ర త‌క్కువ‌, ఫీచ‌ర్లు అధికం..

HP OmniBook 5 | హెచ్‌పీ ఇండియా విద్యార్థులు, వ్యాపార నిపుణులను లక్ష్యంగా చేసుకుని ఓమ్నీబుక్ 5, ప్రోబుక్ 4 జీ2ఐఎస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్లు, ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, ఏఐ సామర్థ్యాలు, తేలికపాటి డిజైన్‌తో వీటిని తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ధరలు రూ.86వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఓమ్నీబుక్ 5లో 14 ఇంచుల 2కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ కవరేజ్, ఐ-ఈజ్ టెక్నాలజీ ఉన్నాయి.

S

Technology | Published On Nov 4, 2026, 5.18 pm IST

HP OmniBook 5 | ఓఎల్ఈడీ డిస్‌ప్లేల‌తో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌లు అదిరాయి.. ధ‌ర త‌క్కువ‌, ఫీచ‌ర్లు అధికం..
Advertisement

HP OmniBook 5 | హెచ్‌పీ ఇండియా విద్యార్థులు, వ్యాపార నిపుణులను లక్ష్యంగా చేసుకుని ఓమ్నీబుక్ 5, ప్రోబుక్ 4 జీ2ఐఎస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్లు, ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, ఏఐ సామర్థ్యాలు, తేలికపాటి డిజైన్‌తో వీటిని తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ధరలు రూ.86వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఓమ్నీబుక్ 5లో 14 ఇంచుల 2కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ కవరేజ్, ఐ-ఈజ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్‌తోపాటు 16 టాప్స్ వరకు సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ ఎన్‌పీయూ అందించారు. 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్, 60వాట్ అవర్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. కేవలం 1.16 కిలోల బరువు, 11.77 మిల్లీమీటర్ల మందంతో రూపొందించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 42 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని హెచ్‌పీ ప్రకటించింది. స్మోక్ సిల్వర్, స్టార్లిట్ బ్లూ, పియోనీ పింక్, సాఫ్ట్ హనీడ్యూ రంగుల్లో ఇది లభిస్తుంది.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్‌..

వ్యాపార సంస్థలు, మొబైల్ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హెచ్‌పీ ప్రోబుక్ 4 జీ2ఐఎస్‌లో 14 ఇంచుల 2.8కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ అందించారు. ఇంటెల్ కోర్ 7 350 ప్రాసెసర్, 17 టాప్స్ వరకు సామర్థ్యం కలిగిన ఎన్‌పీయూ, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ఉన్నాయి. విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 70వాట్ అవర్ బ్యాటరీ, హెచ్‌పీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. కేవలం 1.18 కిలోల బరువుతో, 12 మిల్లీమీటర్ల మందం కలిగిన అల్యూమినియం బాడీతో రూపొందించారు. వీడియో కాల్స్ సమయంలో నేపథ్య శబ్దాలను తగ్గించే ఏఐ నాయిస్ రిడక్షన్, కెమెరా ప్రైవసీ షట‌ర్, హెచ్‌పీ సెక్యూర్ ఎరేజ్, డ్రైవ్‌లాక్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. మిస్ట్ సిల్వర్, అట్మాస్ఫెరిక్ బ్లూ, ఎక్లిప్స్ గ్రే రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చింది.

ధ‌ర ఎంతంటే..

హెచ్‌పీ ఓమ్నీబుక్ 5 14 ల్యాప్‌టాప్ ప్రారంభ ధరను రూ.1,09,999గా నిర్ణయించారు. హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్, హెచ్‌పీ వరల్డ్ స్టోర్లు, అధీకృత విక్రయదారుల వద్ద లభించే ప్రత్యేక ఆఫర్లతో దీని ప్రభావవంతమైన ధర రూ.79,999కు చేరనుంది. నవంబర్ 10 వరకు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అదే రోజు నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. మరోవైపు హెచ్‌పీ ప్రోబుక్ 4 జీ2ఐఎస్ 14 ప్రారంభ ధరను రూ.86వేలుగా నిర్ణయించారు. మిస్ట్ సిల్వర్ వేరియంట్ నవంబర్ 6 నుంచి ఆర్డర్‌కు అందుబాటులోకి రానుండగా, అట్మాస్ఫెరిక్ బ్లూ, ఎక్లిప్స్ గ్రే వేరియంట్లు డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement