Virat Kohli | కోహ్లీ రికార్డుల వేట.. సచిన్‌ను వెనక్కి నెట్టిన రన్ మిషన్..
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 51 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) పద్ధతిలో 32 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 51 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) పద్ధతిలో 32 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో కోహ్లీ తన ఖాతాలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి అగ్రస్థానానికి చేరాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
పాంటింగ్ రికార్డు సమం..
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానానికి చేరాడు. ఈ జట్టుపై ఇప్పటివరకు 1,971 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా న్యూజిలాండ్‌పై 1,971 పరుగులే చేశాడు. దీంతో కోహ్లీ అతడి రికార్డును సమం చేశాడు. పాంటింగ్‌తో పోలిస్తే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 1,750 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (1,568), సనత్ జయసూర్య (1,519) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఛేజింగ్‌లో సచిన్‌ను దాటేసి..
వన్డేల్లో లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. ఛేజింగ్‌లో కోహ్లీ ఇప్పటివరకు 169 ఇన్నింగ్స్‌ల్లో 8,741 పరుగులు సాధించాడు. సచిన్ 232 ఇన్నింగ్స్‌ల్లో 8,720 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు 66.21 కాగా.. స్ట్రైక్‌రేట్ 95.03గా ఉంది. సచిన్ సగటు 42.33, స్ట్రైక్‌రేట్ 88.44. ఒత్తిడిలోనూ లక్ష్య ఛేదనను విజయవంతంగా ముగించడంలో కోహ్లీకి ఉన్న ప్రత్యేకతను ఈ గణాంకాలు మరోసారి చాటుతున్నాయి.
విదేశీ గడ్డపై రెండో ఫాస్టెస్ట్ అర్ధశతకం
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో కోహ్లీ కేవలం 35 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. వన్డేల్లో విదేశీ గడ్డపై అతడికి ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. 2016లో ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో 34 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం కోహ్లీ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన రికార్డు. 2018లో సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌లో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో విదేశీ గడ్డపై తన వేగాన్ని మరోసారి నిరూపించాడు.
గిల్‌తో ఆరో శతక భాగస్వామ్యం
విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ జోడీ కూడా ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించింది. వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి ఆడిన 27 ఇన్నింగ్స్‌ల్లో ఆరోసారి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. గిల్ 56 బంతుల్లో 37 పరుగులు చేయగా.. కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. గిల్ నిలకడ, కోహ్లీ అనుభవం తోడవడంతో ఈ జోడీ భారత బ్యాటింగ్‌కు కీలక బలంగా మారింది.
ఐదు వికెట్లతో భారత్ విజయం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశారు. రెండు వికెట్లు తీసి 22 పరుగులే ఇచ్చిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. కోహ్లీ (74), గిల్ (37) కీలక ఇన్నింగ్స్‌లతో భారత్ 22.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagtial | జగిత్యాల బాలుడి దత్తత వివాదంలో మరో ట్విస్ట్
- ●Cabinet Decisions | 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్
- ●US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?
- ●King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
- ●IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం

Jagtial | జగిత్యాల బాలుడి దత్తత వివాదంలో మరో ట్విస్ట్

Cabinet Decisions | 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?





