త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HP Festive Offers | ల్యాప్‌టాప్‌ల‌పై హెచ్‌పీ ఫెస్టివ్ ఆఫ‌ర్లు.. రూ.20వేల వ‌ర‌కు డిస్కౌంట్‌..

HP Festive Offers | పండుగల సీజన్‌ను పురస్కరించుకుని హెచ్‌పీ సంస్థ తన ఓమ్నీబుక్ ల్యాప్‌టాప్‌లు, ఓమెన్, విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ట్యాంక్ ప్రింటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, పాత ల్యాప్‌టాప్‌ల మార్పిడిపై ప్రయోజనాలు, తక్కువ ధరకు యాక్సెసరీలు, పొడిగించిన వారంటీ ప్యాకేజీలు, ఏఐ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తోంది.

S

Business | Published On Oct 13, 2026, 4.58 pm IST

HP Festive Offers | ల్యాప్‌టాప్‌ల‌పై హెచ్‌పీ ఫెస్టివ్ ఆఫ‌ర్లు.. రూ.20వేల వ‌ర‌కు డిస్కౌంట్‌..
Advertisement

HP Festive Offers | పండుగల సీజన్‌ను పురస్కరించుకుని హెచ్‌పీ సంస్థ తన ఓమ్నీబుక్ ల్యాప్‌టాప్‌లు, ఓమెన్, విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ట్యాంక్ ప్రింటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, పాత ల్యాప్‌టాప్‌ల మార్పిడిపై ప్రయోజనాలు, తక్కువ ధరకు యాక్సెసరీలు, పొడిగించిన వారంటీ ప్యాకేజీలు, ఏఐ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తోంది. ఓమ్నీబుక్ అల్ట్రా, ఓమ్నీబుక్ ఎక్స్ ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ప్రముఖ బ్యాంకుల ద్వారా రూ.18వేల‌ వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. హెచ్‌పీ స్విచ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను క్యాషిఫై ద్వారా మార్చుకుని ఓమ్నీబుక్ అల్ట్రా కొనుగోలు చేస్తే రూ.20వేల వరకు, ఓమ్నీబుక్ ఎక్స్ కొనుగోలుపై రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.12వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌..

ఈ రెండు మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేసేవారికి రూ.10,999 విలువైన డా మిలానో కాంబోను కేవలం రూ.499కే అందిస్తోంది. అలాగే రెండేళ్ల పొడిగించిన వారంటీ, ప్రమాదవశాత్తూ జరిగే నష్టాలకు రక్షణ, యాంటీవైరస్‌తో కూడిన ప్రొటెక్షన్ ప్యాకేజీని రూ.4,999కు పొందవచ్చు. ఓమ్నీబుక్ 7, ఓమ్నీబుక్ 5, ఓమ్నీబుక్ 3 ల్యాప్‌టాప్‌లపై ప్రముఖ బ్యాంకుల ద్వారా రూ.12వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. పాత హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను క్యాషిఫై ద్వారా ఎక్స్ఛేంజ్ చేసి ఓమ్నీబుక్ 7 కొనుగోలు చేస్తే రూ.10వేల వరకు, ఓమ్నీబుక్ 5పై రూ.7వేల వరకు, ఓమ్నీబుక్ 3పై రూ.5వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మూడు మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేస్తే రూ.10,999 విలువైన డా మిలానో కాంబోను రూ.499కే అందిస్తోంది. రెండేళ్ల పొడిగించిన వారంటీ, ప్రమాదవశాత్తూ నష్టాల రక్షణ, యాంటీవైరస్‌తో కూడిన ప్యాకేజీని ఓమ్నీబుక్ 7పై రూ.3,999కు, ఓమ్నీబుక్ 5, ఓమ్నీబుక్ 3 మోడళ్లపై రూ.2,999కు పొందవచ్చు.

ఓమెన్, విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు..

గేమింగ్ ల్యాప్‌టాప్‌ల విభాగంలో ఓమెన్ సిరీస్ కొనుగోలుపై పాత హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను క్యాషిఫై ద్వారా మార్చుకుంటే రూ.15వేల వరకు, విక్టస్ సిరీస్ కొనుగోలుపై రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రెండు సిరీస్‌లలో ఏదైనా కొనుగోలు చేసేవారికి రూ.10,999 విలువైన డా మిలానో కాంబోను రూ.499కే అందిస్తోంది. రెండేళ్ల పొడిగించిన వారంటీ, ప్రమాదవశాత్తూ జరిగే నష్టాల రక్షణ, యాంటీవైరస్‌తో కూడిన ప్యాకేజీని రూ.4,999కు పొందవచ్చు. ఓమెన్ 5000 సిరీస్ లేదా విక్టస్ 5000 సిరీస్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేవారికి రూ.3,727 విలువైన హైపర్‌ఎక్స్ క్లౌడ్‌ఎక్స్ స్టింగర్ 2 కోర్ వైర్డ్ హెడ్‌సెట్‌ను రూ.499కే అందిస్తోంది. అలాగే రూ.6,397 విలువైన హైపర్‌ఎక్స్ నైట్ బ్యాక్‌ప్యాక్‌ను రూ.999కే కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్ ట్యాంక్ ప్రింటర్లపై ఆఫర్లు..

హెచ్‌పీ స్మార్ట్ ట్యాంక్ ప్రింటర్ కొనుగోలుపై కస్టమర్లు ప్రత్యేక బహుమతుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో టైటాన్‌కు చెందిన ఫాస్ట్‌ట్రాక్ వైబ్స్ 4.0, విఐపీ బిజినెస్ ట్రాలీ లేదా ఇండియా టెర్రైన్ వోచర్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.750 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలు జరిపితే రూ.1వేయి తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఓమ్నీబుక్, ఓమెన్ లేదా విక్టస్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు మరో ప్రత్యేక ఆఫర్‌ను హెచ్‌పీ ప్రకటించింది. రూ.96వేల విలువైన ఏఐ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను కేవలం రూ.999కే పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్‌లో క్లాడ్ 4, డీప్‌సీక్, జీపీటీ 5, పెర్‌ప్లెక్సిటీ ఏఐ, జెమిని 2.5, గ్రోక్ 4 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈ ప్రత్యేక పండుగ ఆఫర్లు నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటాయి. హెచ్‌పీ వరల్డ్ స్టోర్లు, హెచ్‌పీ అధీకృత ఆఫ్‌లైన్ విక్రయ కేంద్రాలు, హెచ్‌పీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.

Advertisement
Advertisement