Hisense U7SE | హైసెన్స్ నుంచి భారీ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్ గేమింగ్‌తో యూ7ఎస్ఈ సిరీస్ లాంచ్..
Hisense U7SE | హైసెన్స్ భారత మార్కెట్లో తన కొత్త యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీటీవీ శ్రేణిని యూ7ఎస్ఈ 144 హెడ్జ్ సిరీస్ పేరిట విడుదల చేసింది. ఈ సిరీస్ యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీ టెక్నాలజీతోపాటు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.
Technology | Published On Jun 3, 2026, 12.16 pm IST
Hisense U7SE | హైసెన్స్ భారత మార్కెట్లో తన కొత్త యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీటీవీ శ్రేణిని యూ7ఎస్ఈ 144 హెడ్జ్ సిరీస్ పేరిట విడుదల చేసింది. ఈ సిరీస్ యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీ టెక్నాలజీతోపాటు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా బ్యాక్‌లైట్‌ను జోన్‌ల వారీగా నియంత్రించి మెరుగైన కాంట్రాస్ట్, మరింత లోతైన బ్లాక్స్, ప్రకాశవంతమైన లేదా చీకటి సన్నివేశాల్లో అధిక స్థాయి డీటైల్‌ను అందిస్తుంది. ఈ టీవీలు 55, 65, 75, 85, 100 ఇంచుల స్క్రీన్ సైజుల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో హై-క్యూఎల్ఈడీ కలర్ టెక్నాలజీ, అధిక బ్రైట్‌నెస్ అవుట్‌పుట్‌ను అందించడం ద్వారా మెరుగైన రంగుల ప్రదర్శన, స్పష్టతను అందిస్తాయి. అలాగే ఆధునిక గృహాల ఇంటీరియర్లకు సరిపోయేలా స్లిమ్ యూనిబాడీ డిజైన్‌ను కూడా అందించారు.
అద్భుతమైన వీడియో క్వాలిటీ..
యూ7ఎస్ఈ సిరీస్‌లో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే పలు ఫీచర్లు ఉన్నాయి. నేటివ్ 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 100 ఇంచుల మోడల్‌లో 165 హెడ్జ్ గేమ్ మోడ్, వీఆర్‌ఆర్ (వేరియబుల్ రిఫ్రెష్ రేట్) సపోర్ట్, హెచ్‌డీఎంఐ 2.1 కనెక్టివిటీ, తక్కువ లేటెన్సీ పనితీరు వంటి ఫీచర్లను అందించారు. ఈ టీవీ సిరీస్ పలు హెచ్‌డీఆర్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డీఆర్ 10 ప్లస్ అడాప్టివ్, డాల్బీ విజన్ ఐక్యూ, ఫిలిం మేకర్ మోడ్, ఏఐ పిక్చర్ ప్రాసెసింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఇచ్చినందున దృశ్యాల క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. వీటిల్లో హై-వ్యూ ఏఐ ఇంజిన్ ను ఇచ్చారు. ఇది కంటెంట్ ను రియల్‌టైంలో విశ్లేషిస్తుంది. నాణ్యమైన వీడియో అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీని వల్ల వినియోగదారులకు వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది. 100 ఇంచుల మోడల్‌లో హై-వ్యూ ఏఐ ఇంజిన్ ప్రొను ఇచ్చారు. దీని వల్ల ఈ సిరీస్ టీవీలు అదనపు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరింత మెరుగైన వీడియో క్వాలిటీని అందిస్తాయి.
ఏఐ ఫీచర్లు..
ఈ టీవీ సిరీస్‌లో పలు ఏఐ ఫీచర్లను సైతం ఇచ్చారు. రియల్ టైం కాంట్రాస్ట్, కలర్ కరెక్షన్, సీన్ ఆధారిత ఆప్టిమైజేషన్, చుట్టూ ఉండే వెలుతురు ఆధారంగా పనిచేసే ఏఐ ఆర్‌జీబీ లైట్ సెన్సార్ వంటి సదుపాయాలను ఇచ్చారు. ఆడియో వియానికి వస్తే యూ7ఎస్ఈ సిరీస్ టీవీల్లో డెవియాలెట్ ట్యూనింగ్ సపోర్ట్ కలిగిన బిల్ట్ ఇన్ సబ్ వూఫర్‌ను ఇచ్చారు. ఇది శక్తివంతమైన ఆడియో ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఈ టీవీలు విడా స్మార్ట్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. దీని ద్వారా పలు యాప్ లతోపాటు స్మార్ట్ ఫీచర్లను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు.
ధర వివరాలు..
భారత మార్కెట్లో హైసెన్స్ యూ7ఎస్ఈ యూఎల్ఈడీమినీ-ఎల్ఈడీ టీవీ సిరీస్ ప్రారంభ ధరను రూ.63,990గా నిర్ణయించారు. ఈ టీవీలు సత్య, నందిలాత్, మైజీ, గ్రేట్ ఈస్టర్న్, పాత్రా ఎలక్ట్రానిక్స్, ఖోస్లా తదితర ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా హైసెన్స్ ఇండియా సీఈఓ పంకజ్ రానా మాట్లాడుతూ వినియోగదారులు కేవలం మినీఎల్ఈడీ అనే పేరు కాకుండా నిజమైన మినీఎల్ఈడీ పనితీరును పొందాలని కంపెనీ విశ్వసిస్తోందన్నారు. యూ7ఎస్ఈ యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీ సిరీస్‌లో ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్, ఏఐ ఆధారిత పిక్చర్ ఆప్టిమైజేషన్, ఆకట్టుకునే ఆడియో, తదుపరి తరం గేమింగ్ టెక్నాలజీలను సమన్వయం చేసి మినీఎల్ఈడీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగదారులకు అందించామని తెలిపారు.
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



