త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భవిష్యత్తులో డబ్బు అవసరం ఉండదన్న మస్క్.. ప్రపంచ కుబేరుడి వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

టెస్లా సంస్థ హ్యూమనాయిడ్ రోబోల తయారీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ రోబోలను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని మస్క్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

J

Science | Published On Dec 16, 2025, 3.19 pm IST

భవిష్యత్తులో డబ్బు అవసరం ఉండదన్న మస్క్.. ప్రపంచ కుబేరుడి వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?
Advertisement

స్పేస్‌ఎక్స్ ఫౌండర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏం చేసినా రికార్డే. ఆయనే ఒక రికార్డు. అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శమే. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా రికార్డు సృష్టించిన మస్క్ తన సంపదను ప్రస్తుతం 600 బిలియన్ డాలర్లకు పెంచుకుని మరో చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు. ఆయన దరిదాపుల్లో కూడా మరే దిగ్గజం లేరు. ఒక్క రోజులోనే ఆయన సంపద 168 బిలియన్ డాలర్లు పెరిగి 600 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసిందని ఫోర్బ్స్ ప్రకటించింది.

సంపద ఒక్కసారిగా పెరగడానికి కారణాలు

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ సంపద ఇంత భారీగా పెరగడానికి కారణం స్పేస్‌ఎక్స్ కంపెనీ. ఆ కంపెనీ త్వరలోనే పబ్లిక్ లిస్టింగ్(ఐపీవో)కి వెళ్లనుంది. దీంతో దాని విలువను 800 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. స్పేస్‌ఎక్స్ సంస్థలో మస్క్‌కి 42 శాతం వాటా ఉంది. కంపెనీ వాల్యూ ఒక్కసారిగా పెరగడంతో మస్క్‌కి అదనంగా 168 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీంతో ఆయన సంపద ఒక్కసారిగా పైకి ఎగబాకింది.

టెస్లాలో మస్క్‌కి 12 శాతం వాటా

టెస్లా కంపెనీలో మస్క్‌కి 12 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 197 బిలియన్ డాలర్లు. టెస్లా కార్ల అమ్మకాలు తగ్గినా, టెస్లా షేర్లు మాత్రం 13 శాతం పెరిగాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ అయిన ఎక్స్ఏఐ కంపెనీలో మస్క్‌కి 53 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ విలువ 60 బిలియన్ డాలర్లుగా ఉంది.

భవిష్యత్తులో ఏఐ, రోబోటిక్స్ వల్ల డబ్బు అవసరం ఉండదు

ఓవైపు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మళ్లీ పదిల పరుచుకున్న మస్క్ డబ్బు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో డబ్బు అవసరం ఉండదని, ఆ కాన్సెప్ట్ కనుమరుగు అవుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఏఐ, రోబోటిక్స్ మనుషుల అన్ని అవసరాలను తీర్చగలిగితే, ఇక డబ్బుతో పని ఉండదు. ఇళ్లు కట్టడం, పంటలు పండించడం, ఉత్పత్తుల తయారీ లాంటి పనులన్నీ రోబోలే చేస్తాయి. దాని వల్ల ఆయా పనుల కోసం వెచ్చించే ఖర్చు ఏం ఉండదు. అప్పుడు డబ్బుతో పనేమీ ఉంటుంది.. అని మస్క్ అభిప్రాయపడ్డారు.

టెస్లా సంస్థ హ్యూమనాయిడ్ రోబోల తయారీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ రోబోలను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని మస్క్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement