త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Year End Sale 2025 | గూగుల్ ఇయ‌ర్ ఎండ్ సేల్ ఆఫ‌ర్‌.. పిక్స‌ల్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..

S

Technology | Published On Dec 15, 2025, 9.59 pm IST

Google Year End Sale 2025 | గూగుల్ ఇయ‌ర్ ఎండ్ సేల్ ఆఫ‌ర్‌.. పిక్స‌ల్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..
Advertisement

Google Year End Sale 2025 | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఇయ‌ర్ ఎండింగ్ సేల్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ కేవ‌లం భార‌త్‌లోనే కొన‌సాగుతుంద‌ని గూగుల్ తెలియ‌జేసింది. సోమ‌వారం ఈ సేల్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. జ‌న‌వ‌రి 2వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప‌లు పిక్స‌ల్ ఫోన్ల‌తోపాటు గూగుల్ యాక్స‌స‌రీల‌పై కూడా భారీ ఎత్తున డిస్కౌంట్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సేల్‌లో భాగంగా పిక్స‌ల్ 10, 9 సిరీస్ ఫోన్ల‌పై వినియోగ‌దారులు త‌గ్గింపు ధ‌ర‌లు, ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే పిక్స‌ల్ బ‌డ్స్‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో క్యాష్ బ్యాక్‌లు, ఈజీ ఈఎంఐ స‌దుపాయాన్ని సైతం పొంద‌వ‌చ్చు.

గూగుల్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పిక్స‌ల్ 10 ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్ష‌న్‌తో రూ.7వేల క్యాష్ బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఇదే కార్డుతో పిక్స‌ల్ 10 ప్రొ, పిక్స‌ల్ 10 ప్రొ ఎక్స్ఎల్‌, పిక్స‌ల్ 10 ప్రొ ఫోల్డ్ ఫోన్ల‌పై ఏకంగా రూ.10వేల క్యాష్ బ్యాక్‌ను తీసుకోవ‌చ్చు. వినియోగ‌దారులు ఈ ఫోన్ల‌ను ఎలాంటి వ‌డ్డీ లేకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ప్లాన్ ద్వారా కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను గ‌రిష్టంగా 24 నెల‌ల వ‌ర‌కు స‌దుపాయాన్ని అందిస్తున్నారు.

ఇక ఈ సేల్‌లో పిక్స‌ల్ 9 సిరీస్ ఫోన్ల‌పై కూడా ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను పొంద‌వ‌చ్చు. పిక్స‌ల్ 9, పిక్సల్ 9 ప్రొ ఫోల్డ్‌, పిక్స‌ల్ 9ఎ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. పిక్స‌ల్ 9 ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.79,999 ఉండ‌గా ప్ర‌స్తుతం దీన్ని రూ.58,399 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే పిక్స‌ల్.9 ప్రొ ఫోల్డ్‌, పిక్స‌ల్ 9ఎ లాంచింగ్ ధ‌ర‌లు రూ.1,72,999, రూ.49,999 ఉండ‌గా, ఈ ఫోన్ల‌ను ప్ర‌స్తుతం రూ.1,62,999, రూ.44,999 ధర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఈ సేల్‌లో ప‌లు పిక్స‌ల్ వాచ్‌లు, పిక్స‌ల్ బ‌డ్‌ల‌పై కూడా డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్స‌ల్ వాచ్ 3 ని రూ.5వేల త‌గ్గింపు ధ‌ర అనంత‌రం రూ.22,915కు కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అలాగే పిక్స‌ల్ ప్రొ 2 ట్రూవైర్‌లెస్ బ‌డ్స్‌ను రూ.3వేల త‌గ్గింపు ధ‌ర అనంత‌రం రూ.19,900 ధ‌ర‌కు కొనుగోలు చేసే అవ‌కాశాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ డివైస్‌ల‌పై ప‌లు ఆఫ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా గూగుల్ త‌న పిక్స‌ల్ 10 సిరీస్ ఫోన్ల‌ను ఈ ఏడాది ఆగ‌స్టు 20న లాంచ్ చేసింది. పిక్స‌ల్ 10 ప్రారంభ ధ‌ర రూ.79,999గా ఉండేది. పిక్సల్ 10ప్రొ, పిక్స‌ల్ 10 ప్రొ ఎక్స్ఎల్‌, పిక్స‌ల్ 10 ప్రొ ఫోల్డ్ లాంచింగ్ ధ‌ర‌లు రూ.1,09,999, రూ.1,24,999, రూ.1,72,999గా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తుండ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement