Google Chrome | గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్‌లు.. వెబ్ పేజీలను సులభంగా వీక్షించవచ్చు..
Google Chrome | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఇంటర్నెట్ బ్రౌజర్ క్రోమ్‌లో పలు నూతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ట్యాబ్‌లను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు, వెబ్ పేజీలను సులభంగా వీక్షించేందుకు రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వర్టికల్ ట్యాబ్స్, అప్‌డేటెడ్ రీడింగ్ మోడ్ పేరిట ఇవి లభిస్తున్నాయి.
Technology | Published On Apr 10, 2026, 11.56 am IST
Google Chrome | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఇంటర్నెట్ బ్రౌజర్ క్రోమ్‌లో పలు నూతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ట్యాబ్‌లను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు, వెబ్ పేజీలను సులభంగా వీక్షించేందుకు రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వర్టికల్ ట్యాబ్స్, అప్‌డేటెడ్ రీడింగ్ మోడ్ పేరిట ఇవి లభిస్తున్నాయి. ఈ ఫీచర్లు అనేక ట్యాబ్‌లను సులభంగా నిర్వహించడమే కాకుండా, కంటెంట్‌ను సరళమైన రూపంలో చూడడానికి వీలు కల్పిస్తున్నాయి. ట్యాబ్ నిర్వహణ కోసం క్రోమ్ ఇప్పుడు సాంప్రదాయ హారిజాంటల్ ట్యాబ్ బార్‌కు బదులుగా వర్టికల్ ట్యాబ్ లేఅవుట్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే క్రోమ్ విండోపై రైట్-క్లిక్ చేసి Show Tabs Vertically అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
వర్టికల్ ట్యాబ్స్..
వర్టికల్ ట్యాబ్స్ ఉపయోగించినప్పుడు ట్యాబ్‌లు బ్రౌజర్ విండో పక్కవైపున వరుసగా కనిపిస్తాయి. ప్రతి ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి పేజీ టైటిల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ట్యాబ్ గ్రూప్‌లను సైడ్ ప్యానెల్ నుంచే నిర్వహించుకోవచ్చు. అనేక ట్యాబ్‌లు ఓపెన్ చేసినప్పుడు వాటి మధ్య నావిగేషన్ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవుతుంది. ఒకేసారి ఎక్కువ ట్యాబ్‌లు ఉపయోగించే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది.
రీడింగ్ మోడ్..
ఇక రీడింగ్ మోడ్ ను కూడా పూర్తి పేజీ ఇంటర్‌ఫేస్‌తో అప్‌డేట్ చేశారు. ఏదైనా వెబ్‌పేజీపై రైట్-క్లిక్ చేసి Open in reading mode ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. రీడింగ్ మోడ్‌లో ప్రకటనలు, సైడ్‌బార్‌లు, ఇతర అనవసర అంశాలు తొలగిపోయి కేవలం కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. కంటెంట్, టెక్స్ట్‌పై దృష్టి సారించే విధంగా ఇస్తుంది. వెబ్‌పేజీలు క్లీన్‌గా, ఒకే తరహాలో కనిపించేలా మారుస్తుంది. గందరగోళంగా ఉన్న పేజీలను సులభంగా చదవడానికి అనువైన రూపంలోకి మార్చుతుంది. ఈ విధానం కంటెంట్ చదవడాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది.
ఈ రెండు ఫీచర్లు క్రోమ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే క్రోమ్ బ్రౌజర్‌ను డెస్క్‌టాప్‌పై వాడే వారికి ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ మొబైల్ ప్లాట్‌ఫామ్ గురించి గూగుల్ స్పష్టత ఇవ్వలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gemini In Chrome | క్రోమ్‌లో జెమిని.. ఆండ్రాయిడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు ఏఐ ఎక్స్‌పీరియెన్స్..
మే 13, 2026

Chrome Browser | క్రోమ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ గా ఏఐ.. ప్రత్యేకంగా సైట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
ఏప్రిల్ 18, 2026

Samsung Browser | విండోస్ పీసీల కోసం ఇంటర్నెట్ బ్రౌజర్‌ను లాంచ్ చేసిన శాంసంగ్.. ఫీచర్లు అదిరాయ్..!
మార్చి 31, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



