Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హై అలర్ట్.. భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక..
Google Chrome | భారత్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా విండోస్, మాక్ ఓఎస్, లైనక్స్ సిస్టమ్‌లలో క్రోమ్ ఉపయోగిస్తున్న వారికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది. తాజా సైబర్ భద్రతా లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
Technology | Published On Jul 18, 2026, 1.56 pm IST
Google Chrome | భారత్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా విండోస్, మాక్ ఓఎస్, లైనక్స్ సిస్టమ్‌లలో క్రోమ్ ఉపయోగిస్తున్న వారికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది. తాజా సైబర్ భద్రతా లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఈ నెలలో విడుదల చేసిన సెక్యూరిటీ బులెటిన్‌లో గూగుల్ క్రోమ్‌లో అనేక తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. వీటికి హై సివియారిటీ రేటింగ్ ఇవ్వడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీఈఆర్టీ-ఇన్ తెలిపిన వివరాల ప్రకారం గూగుల్ క్రోమ్‌లో గుర్తించిన పలు సెక్యూరిటీ లోపాలను సైబర్ దుండగులు ఉపయోగించుకుని బాధితుల కంప్యూటర్‌లలో తమకు నచ్చిన కోడ్‌ను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఓజోన్, వ్యూస్, ఇంటరెస్ట్ గ్రూప్స్, ఎక్స్‌టెన్షన్స్, ఆటోఫిల్, యాక్టర్, పేమెంట్స్, ఇన్‌పుట్, కోర్, వెబ్ఆర్‌టీసీ, ఫార్మ్స్, ఇండెక్స్డ్‌డీబీ, వీ8, యాంగిల్, కోడెక్స్, డీఓఎమ్, నావిగేషన్, పాస్‌వర్డ్స్ వంటి పలు భాగాల్లో ఈ లోపాలను గుర్తించారు.
ప్రమాదం ఏంటి..?
ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు వినియోగదారులను ఒక ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లోకి వెళ్లేలా మోసగిస్తే, వారి సిస్టమ్‌పై నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్స్ వంటి కీలక డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల విండోస్, మాక్ ఓఎస్ లేదా లైనక్స్‌లో క్రోమ్ ఉపయోగిస్తున్న వారు తమ బ్రౌజర్ వెర్షన్‌ను వెంటనే తనిఖీ చేసుకోవాలని సూచించారు. విండోస్, మాక్‌ఓఎస్ కోసం 150.0.7871.114 లేదా 150.0.7871.115 కంటే పాత వెర్షన్లు, అలాగే లైనక్స్ కోసం 150.0.7871.114 కంటే పాత వెర్షన్ ఉపయోగిస్తున్నవారు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. భద్రత కోసం గూగుల్ క్రోమ్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం క్రోమ్‌లో కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెనూకు వెళ్లి సెట్టింగ్స్ → అబౌట్ క్రోమ్ → అప్‌డేట్ క్రోమ్ ను తెరవాలి. కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే ఇన్‌స్టాల్ చేయాలి.
జాగ్రత్తగా ఉండాల్సిందే..
ప్రస్తుతం గూగుల్ క్రోమ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే బ్రౌజర్‌లలో ఒకటి కాగా, ఇటీవల జెమిని ఏఐ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలాంటి సమయంలో భద్రతా లోపాలను నిర్లక్ష్యం చేస్తే డేటా లీక్ మాత్రమే కాకుండా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం కూడా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త మాల్వేర్ అటాక్.. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే అంతే..
జూన్ 29, 2026

Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్‌డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
జూన్ 24, 2026

Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేయకపోతే హ్యాకింగ్ ముప్పు..
మే 28, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది
- ●Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
- ●Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు
- ●Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు
- ●KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..
- ●Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్

Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు

Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు



