Chrome | క్రోమ్‌లో జెమినీకి భారీ అప్‌డేట్.. ఫోటోలను ఎడిట్ చేయడం ఇక సులభం..
Chrome | గూగుల్ తన జెమినీ ఇన్ క్రోమ్ సేవలను మరిన్ని భాగాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే క్రోమ్‌కు సంబంధించిన పలు కొత్త ఏఐ ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో కొత్త ఇమేజ్ ఎడిటింగ్ సదుపాయాలు, విస్తరించిన పర్సనలైజేషన్ ఫీచర్లు, గూగుల్ సేవలతో మరింత లోతైన అనుసంధానం, అదనపు భద్రత ఉన్నాయి.
Technology | Published On Jun 11, 2026, 11.25 am IST
Chrome | గూగుల్ తన జెమినీ ఇన్ క్రోమ్ సేవలను మరిన్ని భాగాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే క్రోమ్‌కు సంబంధించిన పలు కొత్త ఏఐ ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో కొత్త ఇమేజ్ ఎడిటింగ్ సదుపాయాలు, విస్తరించిన పర్సనలైజేషన్ ఫీచర్లు, గూగుల్ సేవలతో మరింత లోతైన అనుసంధానం, అదనపు భద్రత ఉన్నాయి. జెమినీ ఇన్ క్రోమ్ ఒక వ్యక్తిగత బ్రౌజింగ్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఇది వెబ్‌పేజీలలోని కంటెంట్‌ను సంక్షిప్తంగా వివరించడం, ఒకేసారి అనేక ట్యాబ్‌లలోని సమాచారాన్ని పోల్చడం, బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో అవసరమైన సమాచారాన్ని అందించడం వంటి పనులు చేస్తుంది. ముఖ్యంగా, వినియోగదారులు ప్రస్తుతం చూస్తున్న వెబ్‌పేజీని వదిలి వెళ్లకుండానే ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు, పనులను పూర్తి చేసుకోవచ్చు.
సైడ్ ప్యానెల్‌లో నానో బనానా 2..
గూగుల్ సేవలతో అనుసంధానం ద్వారా వినియోగదారులు నేరుగా క్రోమ్ నుంచే పలు పనులు చేయవచ్చు. గూగుల్ క్యాలెండర్‌లో మీటింగ్‌లను షెడ్యూల్ చేయడం, గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ వివరాలు తెలుసుకోవడం, జీమెయిల్ ద్వారా ఈమెయిళ్లు డ్రాఫ్ట్ చేసి పంపించడం, యూట్యూబ్ వీడియోలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. గూగుల్ క్రోమ్ సైడ్ ప్యానెల్‌లో కొత్త నానో బనానా 2 ఫీచర్‌ను కూడా అందించింది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉన్న చిత్రాలను కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ద్వారా నేరుగా క్రోమ్‌లోనే మార్చుకోవచ్చు. దీంతో ప్రత్యేకంగా వేరే ఇమేజ్ ఎడిటింగ్ యాప్ అవసరం లేకుండా సృజనాత్మక మార్పులు చేయడం సులభమవుతుంది. జెమినీ ఇన్ క్రోమ్ ఇప్పుడు గత సంభాషణల సందర్భాన్ని కూడా గుర్తుంచుకుంటుంది. దీంతో కాలక్రమేణా వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని మరింత వ్యక్తిగతీకరించిన సమాధానాలు, సూచనలు అందిస్తుంది.
ఎవరెవరికి అందుబాటులో..
గూగుల్ తన పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా విస్తరిస్తోంది. జీమెయిల్, ఫోటోస్, యూట్యూబ్, సెర్చ్ వంటి సేవలను అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మరింత అనుకూలమైన సమాధానాలను అందిస్తుంది. జెమినీ ఇన్ క్రోమ్‌తోపాటు క్రోమ్‌లోని పలు తాజా ఏఐ ఫీచర్లు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని డెస్క్‌టాప్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ మాత్రం డెస్క్‌టాప్‌లో గూగుల్ ఏఐ ప్లస్, గూగుల్ ఏఐ ప్రో, గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్
- ●G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?






