Stock Recommendation | స్వల్పకాలంలో లక్ష్యాల కోసం 3 టాప్ షేర్లు.. నిపుణుల సూచన..
Stock Recommendation | భారతీయ స్టాక్ మార్కెట్ల ప్రధాన సూచీ నిఫ్టీ 50 ఈ వారంలో మొదటి మూడు రోజులు పరిమిత శ్రేణిలోనే కదిలింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, పెరిగిన ముడి చమురు ధరలు, అలాగే రూపాయి బలహీనత మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈ కాలంలో నిఫ్టీ 50 ప్రధానంగా 24,100 నుంచి 23,800 స్థాయిల మధ్య ట్రేడైంది.
Stock Recommendation | భారతీయ స్టాక్ మార్కెట్ల ప్రధాన సూచీ నిఫ్టీ 50 ఈ వారంలో మొదటి మూడు రోజులు పరిమిత శ్రేణిలోనే కదిలింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, పెరిగిన ముడి చమురు ధరలు, అలాగే రూపాయి బలహీనత మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈ కాలంలో నిఫ్టీ 50 ప్రధానంగా 24,100 నుంచి 23,800 స్థాయిల మధ్య ట్రేడైంది. వారాంతానికి సూచీ భారీ నష్టాలతో ముగిసింది. సమీప కాలంలో కూడా దేశీయ మార్కెట్లు ఇదే తరహా రేంజ్ బౌండ్ ధోరణిలో కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం, క్రూడ్ ఆయిల్ ధరల దిశ, డాలర్-రూపాయి మారకపు విలువ వంటి అంశాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను నిర్ణయించనున్నాయి. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ జిగర్ ఎస్. పటేల్ తెలిపిన ప్రకారం, నిఫ్టీ ప్రస్తుతం 23,300-23,850 విస్తృత పరిధిలో కన్సాలిడేషన్ దశలో ఉంది. ఇది మార్కెట్లో సమీప కాలంలో అస్థిరత కొనసాగుతుందన్న సంకేతంగా కనిపిస్తోందన్నారు.
నాణ్యమైన స్టాక్స్‌లో మెరుగైన ప్రదర్శన..
అయితే మధ్య మధ్యలో బలహీనత కనిపించినప్పటికీ, నిఫ్టీ కీలకమైన 23,300 సపోర్ట్ జోన్ పైనే నిలబడగలిగిందని ఆయన చెప్పారు. దీంతో మార్కెట్ విస్తృత నిర్మాణం ఇప్పటికీ సానుకూలంగానే ఉందన్నారు. 23,850 స్థాయిని నిఫ్టీ నిర్ణయాత్మకంగా అధిగమించి నిలబడగలిగితే తదుపరి ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పటేల్ అభిప్రాయపడ్డారు. అలా జరిగితే రాబోయే నెలల్లో కొత్త గరిష్ఠ స్థాయిల వైపు ప్రయాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిఫ్టీకి తక్షణ రెసిస్టెన్స్ 24,200 వద్ద ఉండగా, ఆ తర్వాత 24,600 కీలక అవరోధంగా నిలుస్తుందని చెప్పారు. దీర్ఘకాల దృష్టిలో మానసికంగా కీలకమైన 25,000 స్థాయి కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందన్నారు. మరోవైపు 23,100 కీలక సపోర్ట్ స్థాయి కిందకు నిఫ్టీ పడిపోనంత వరకు మార్కెట్ విస్తృత ధోరణి సానుకూలంగానే ఉంటుందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో ట్రేడర్లు జాగ్రత్తతో కూడిన ఆశావహ దృక్పథాన్ని అవలంబించాలని, ముఖ్యంగా స్టాక్-స్పెసిఫిక్ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. ఎంపిక చేసిన రంగాలు, నాణ్యమైన స్టాక్స్ మెరుగైన ప్రదర్శన ఇస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వల్పకాలిక పెట్టుబడులకు పలు స్టాక్స్‌ను పెట్టుబడిదారులకు సూచించారు.
డిక్సన్ టెక్నాలజీస్..
వచ్చే 1 నుంచి 2 వారాలకు ఆయన మొత్తం 3 స్టాక్స్‌ను సూచించారు. వాటిలో ఒకటి డిక్సన్ టెక్నాలజీస్. ఈ షేర్ ముగింపు ధర రూ.11,550 కాగా రూ.11,600 నుంచి రూ.11,800 మధ్య స్థిరంగా ట్రేడ్ అయితే రూ.13వేలకు చేరుకునే అవకాశం ఉంటుందని, దీనికి స్టాప్ లాస్‌గా రూ.11వేల ధరను నిర్ణయించామని తెలిపారు. డిక్సన్ టెక్నాలజీస్ ప్రస్తుతం మార్కెట్ హెచ్చు తగ్గుల కారణంగా కాస్త కిందకు వచ్చినప్పటికీ ఈ షేర్ సమీప భవిష్యత్తులో రూ.12,950 నుంచి రూ.13వేల వరకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ షేర్ ఇటీవల తన గత స్వింగ్ హైని అధిగమించి బలమైన బుల్లిష్ బ్రేకౌట్‌ను నమోదు చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఈ షేర్ బుల్లిష్ ఏబీ=సీడీ ప్యాటర్న్ పూర్తి దశకు చేరుకుంటోందని, మార్కెట్‌లో కాస్త కరెక్షన్ సహజమేనని తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ, డీఎంఐ వంటి మొమెంటమ్ సూచికలు కూడా బలమైన పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే వారాల్లో ఈ షేర్ రూ.13,000 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఆర్తి ఇండస్ట్రీస్..
ఆర్తి ఇండస్ట్రీస్‌కు కూడా ఆయన బై రేటింగ్ ఇచ్చారు. ఈ షేర్ ముగింపు ధర రూ.474 కాగా రూ.460 నుంచి రూ.480 మధ్య స్థిరంగా ఉంటే కొనుగోలు చేయవచ్చని, టార్గెట్ రూ.540 అని తెలిపారు. స్టాప్ లాస్‌ను రూ.435గా నిర్ణయించారు. ఆర్తి ఇండస్ట్రీస్ ఇటీవల నెలవారీ చార్ట్‌లో ప్రధాన వార్షిక కామరిల్లా ఆర్4, ఫ్లోర్ పివట్ రెసిస్టెన్స్ ఆర్1 స్థాయిలను అధిగమించి బలమైన బ్రేకౌట్ నమోదు చేసిందని తెలిపారు. బ్రేకౌట్ అనంతరం అదే స్థాయిని విజయవంతంగా రీటెస్ట్ చేయడంతో అది ఇప్పుడు బలమైన సపోర్ట్ జోన్‌గా మారిందన్నారు. ఎంఏసీడీ, ఆర్‌ఎస్‌ఐ, డీఎంఐ సూచికలు కూడా సానుకూల సంకేతాలు ఇస్తుండటంతో, ఈ షేర్‌ను రూ.480-రూ.460 పరిధిలో సేకరించాలని సూచించారు. లక్ష్య ధరను రూ.540గా నిర్ణయించారు.
రామ్‌కో సిమెంట్స్..
రామ్‌కో సిమెంట్స్ రూ.880-రూ.900 ప్రాంతంలో బలమైన బేస్‌ను నిర్మించిందని పటేల్ తెలిపారు. ఇది దిగువ స్థాయిల వద్ద స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు. 78.6 శాతం ఫిబొనాక్సీ రిట్రేస్‌మెంట్, 61.8 శాతం ఏబీ=సీడీ ఆల్టర్నేట్ ప్రైస్ రిలేషన్‌షిప్, 1.27 శాతం ఎక్స్‌టర్నల్ రిట్రేస్‌మెంట్ వంటి కీలక టెక్నికల్ అంశాలు రూ.900-రూ.890 జోన్‌ను బలమైన డిమాండ్ ప్రాంతంగా మార్చాయని వివరించారు. మొమెంటమ్ సూచికలు కూడా మెరుగుదల సంకేతాలు ఇస్తున్నాయని, అమ్మకాల ఒత్తిడి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రాబోయే వారాల్లో ఈ షేర్ రూ.990 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
సంబంధిత వార్తలు

JP Morgan | భారత స్టాక్ మార్కెట్ల అంచనాలను తగ్గించిన జేపీ మోర్గాన్.. రానున్న రోజుల్లో కష్టమే..?
ఏప్రిల్ 25, 2026

Investments | ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్.. రెండింటిలో పెట్టుబడులకు ఏవి అనుకూలం..?
ఏప్రిల్ 15, 2026

FPIs | భారత్ నుంచి వైదొలగుతున్న విదేశీ పెట్టుబడిదారులు.. ఈ ఏడాదిలో రూ.1 లక్ష కోట్ల విలువైన షేర్ల విక్రయాలు..
మార్చి 22, 2026
తాజావార్తలు
- ●Priya Prakash Varrier | ఒకే ఒక్క కన్నుగీటుతో నేషనల్ క్రష్.. బాలీవుడ్‌నే ఎదిరించిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
- ●Governor | ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధం.. గవర్నర్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- ●Minister Komatireddy | ఫీజు చెల్లించి.. సర్టిఫికెట్లు ఇప్పించి.. గొప్ప మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి
- ●Alia Bhatt | హంతకురాలి పాత్రలో అలియా భట్.. ‘ఆల్ఫా’పై మూవీ భారీ అంచనాలు
- ●American Couple | భారత్‌లో 30 రోజుల పర్యటన.. రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట
- ●SpiceJet | స్పైస్‌జెట్‌కు జీఎస్టీ శాఖ నోటీసులు.. రూ.124 కోట్లకు పైగా పన్ను డిమాండ్

Priya Prakash Varrier | ఒకే ఒక్క కన్నుగీటుతో నేషనల్ క్రష్.. బాలీవుడ్‌నే ఎదిరించిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Governor | ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధం.. గవర్నర్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Minister Komatireddy | ఫీజు చెల్లించి.. సర్టిఫికెట్లు ఇప్పించి.. గొప్ప మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి

Alia Bhatt | హంతకురాలి పాత్రలో అలియా భట్.. ‘ఆల్ఫా’పై మూవీ భారీ అంచనాలు



