Gemini In Chrome | క్రోమ్‌లో జెమిని.. ఆండ్రాయిడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు ఏఐ ఎక్స్‌పీరియెన్స్..
Gemini In Chrome | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌లో జెమిని ఏఐని ఆండ్రాయిడ్ డివైస్‌లకు తీసుకురానుంది. జెమిని 3.1 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త ఏజెంటిక్ బ్రౌజింగ్ అనుభవంతో క్రోమ్ ఇప్పుడు కేవలం బ్రౌజర్‌గా కాకుండా, యూజర్‌కు సహాయపడే ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది.
Technology | Published On May 13, 2026, 5.15 pm IST
Gemini In Chrome | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌లో జెమిని ఏఐని ఆండ్రాయిడ్ డివైస్‌లకు తీసుకురానుంది. జెమిని 3.1 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త ఏజెంటిక్ బ్రౌజింగ్ అనుభవంతో క్రోమ్ ఇప్పుడు కేవలం బ్రౌజర్‌గా కాకుండా, యూజర్‌కు సహాయపడే ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది. వెబ్‌పేజీలను అర్థం చేసుకోవడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, పనులను పూర్తి చేయడం, ఆటోమేటిక్ చర్యలు తీసుకోవడం వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్‌లో క్రోమ్ టూల్‌బార్‌లో కనిపించే జెమిని ఐకాన్‌పై ట్యాప్ చేస్తే, స్క్రీన్ దిగువన ప్రత్యేక ప్యానెల్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచే యూజర్లు ప్రస్తుతం చూస్తున్న వెబ్‌పేజీ గురించి ప్రశ్నలు అడగవచ్చు. పొడవైన ఆర్టికల్స్‌ను సమ్మరైజ్ చేయించుకోవచ్చు. క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా వివరాలు తెలుసుకోవచ్చు. మరో యాప్‌కి మారాల్సిన అవసరం లేకుండా, అదే బ్రౌజర్‌లో ఇంటరాక్టివ్ అనుభవం పొందవచ్చు.
గూగుల్ యాప్స్‌తో కనెక్టివిటీ..
జెమిని ఇన్ క్రోమ్, ఇతర గూగుల్ యాప్స్‌తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. యూజర్ చూస్తున్న వెబ్‌పేజీ ఆధారంగా కొన్ని పనులను నేరుగా పూర్తి చేస్తుంది. ఇందులో భాగంగా ఈవెంట్స్‌ను గూగుల్ క్యాలెండర్ లో యాడ్ చేయడం, రెసిపీ ఇంగ్రిడియెంట్స్ లేదా నోట్స్‌ను గూగుల్ కీప్ లో సేవ్ చేయడం, జీమెయిల్ లో ప్రత్యేక సమాచారం వెతకడం వంటి పనులు చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్‌ను ఎంచుకున్న యూజర్లకు వారి ఆసక్తులు, హాబీలు, కుటుంబం, పెంపుడు జంతువులు వంటి అంశాల ఆధారంగా మరింత వ్యక్తిగతీకరించిన సమాధానాలు అందిస్తామని గూగుల్ తెలిపింది. అయితే యూజర్ ప్రైవసీపై పూర్తి నియంత్రణ యూజర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది.
నానో బనానా.. ఇమేజ్ కస్టమైజేషన్ టూల్..
క్రోమ్‌లో నానో బనానా పేరుతో కొత్త ఇమేజ్ టూల్‌ను కూడా గూగుల్ తీసుకొస్తోంది. దీనితో బ్రౌజింగ్ చేస్తూనే యూజర్లు చిత్రాలను జనరేట్ చేయవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వెబ్‌పేజీలను ఇన్ఫోగ్రాఫిక్స్‌గా మార్చుకోవచ్చు. గదిలో ఫర్నిచర్ ఎలా కనిపిస్తుందో ముందుగానే ప్రివ్యూ చూడవచ్చు. వెబ్‌పేజీ కంటెంట్ ఆధారంగా కొత్త విజువల్స్ రూపొందించుకోవచ్చు. ఇది లెర్నింగ్, ప్లానింగ్, రీసెర్చ్‌కు మరింత విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్‌లో మొదటిసారిగా ఆటో బ్రౌజ్ అనే ఏజెంటిక్ ఫీచర్‌ను కూడా క్రోమ్ అందిస్తోంది. ఇది మల్టీ-స్టెప్ టాస్క్‌లను యూజర్ తరఫున ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ఈవెంట్ టికెట్ వివరాల ఆధారంగా స్పాట్‌హీరో వంటి సర్వీసుల ద్వారా పార్కింగ్ బుక్ చేయడం, చూయీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పెట్ ఫుడ్ సబ్‌స్క్రిప్షన్ అప్‌డేట్ చేయడం, రిపిటేటివ్ ఆన్‌లైన్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడం వంటి పనులు చేయగలుగుతుంది.
భద్రతకు ప్రాధాన్యం..
ఈ కొత్త ఫీచర్లన్నీ డెస్క్‌టాప్ క్రోమ్‌లో ఉన్న భద్రతా ప్రమాణాలతోనే పనిచేస్తాయని గూగుల్ తెలిపింది. ప్రాంప్ట్ ఇంజెక్షన్ వంటి కొత్త రకాల సైబర్ ముప్పుల నుంచి రక్షణ కల్పించే సెక్యూరిటీ లేయర్లు ఇందులో ఉంటాయని వెల్లడించింది. అలాగే పేమెంట్స్ లేదా సోషల్ మీడియా పోస్టుల వంటి సెన్సిటివ్ చర్యల విషయంలో ఆటో బ్రౌజ్ తప్పనిసరిగా యూజర్ కన్ఫర్మేషన్ కోరుతుంది. దీంతో తుది నియంత్రణ యూజర్ చేతుల్లోనే ఉంటుంది. జెమిని ఇన్ క్రోమ్, ఆటో బ్రౌజ్ ఫీచర్లు వచ్చే నెల నుంచి దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పై వెర్షన్ అవసరం అవుతుంది. డివైస్‌లో కనీసం 4జీబీ ర్యామ్ ఉండాలి. మొదట అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. ఇంగ్లిష్ (యూఎస్) భాష సపోర్ట్ తప్పనిసరి. ఆటో బ్రౌజ్ ఫీచర్ ఏఐ ప్రొ, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు మాత్రమే లభిస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






