త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Galaxy A Series Phones | గెలాక్సీ ఎ37 5జి, ఎ57 5జి ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

Galaxy A Series Phones | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ భార‌త్‌లో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎ57 5జి, ఎ37 5జి ల‌ను విడుద‌ల చేసింది. గ‌త వారం కింద‌టే ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేస్తామ‌ని శాంసంగ్ ప్ర‌క‌టించ‌గా, అనుకున్న తేదీ ప్ర‌కార‌మే ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. వీటిల్లో 6.7 ఇంచుల సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేల‌ను ఇచ్చారు.

S

Technology | Published On Mar 27, 2026, 10.14 am IST

Galaxy A Series Phones | గెలాక్సీ ఎ37 5జి, ఎ57 5జి ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?
Advertisement

Galaxy A Series Phones | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ భార‌త్‌లో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎ57 5జి, ఎ37 5జి ల‌ను విడుద‌ల చేసింది. గ‌త వారం కింద‌టే ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేస్తామ‌ని శాంసంగ్ ప్ర‌క‌టించ‌గా, అనుకున్న తేదీ ప్ర‌కార‌మే ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. వీటిల్లో 6.7 ఇంచుల సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేల‌ను ఇచ్చారు. ఇవి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉన్నాయి. అందువ‌ల్ల డిస్‌ప్లేలు అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటాయి. నాణ్య‌మైన దృశ్యాల‌ను తెర‌ల‌పై వీక్షించ‌వ‌చ్చు. ఎ57 స్మార్ట్ ఫోన్‌లో లేటెస్ట్ ఎగ్జినోస్ 1680 చిప్‌సెట్‌ను అమ‌ర్చ‌గా, ఎ37 ఫోన్‌లో ఎగ్జినోస్ 1480 చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఈ రెండు ఫోన్ల‌లోనూ వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మ‌రో 5 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వ‌న్ యూఐ 8.5ను ఇచ్చారు. ఈ ఫోన్ల‌కు 6 ఏళ్ల వ‌ర‌కు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్ డేట్స్‌ను, 6 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది.

డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌..

ఈ రెండు ఫోన్లకు ఐపీ68 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు. ముందు, వెనుక రెండు వైపులా గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ ప్ల‌స్ ప్రొటెక్ష‌న్ కూడా ఉంది. ఎ57 ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ల‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ ఉంది. అయితే చార్జ‌ర్ల‌ను మాత్రం ఫోన్ల‌తో ఇవ్వ‌డం లేదు. ప్ర‌త్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

గెలాక్సీ ఎ57 5జి ఫోన్‌లో..

శాంసంగ్ గెలాక్సీ ఎ57 5జి స్మార్ట్ ఫోన్‌లో ఇత‌ర ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే డిస్‌ప్లేకు 1200 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చినందున సూర్య‌కాంతిలోనూ ఫోన్ తెర స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. 8జీబీ, 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 50, 12, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉండ‌గా, ముందు వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6ఇ, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాలు ఉన్నాయి.

గెలాక్సీ ఎ37 5జి ఫోన్‌లో..

శాంసంగ్ గెలాక్సీ ఎ37 5జి స్మార్ట్ ఫోన్‌లోనూ 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. 8జీబీ, 12జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 50, 8, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉండగా, ముందు వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్ ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను అందించారు.

ధ‌ర‌, ఆఫ‌ర్ల వివ‌రాలు..

గెలాక్సీ ఎ57 5జి ఫోన్‌ను ఆస‌మ్ నేవీ, ఆస‌మ్ ఐసీ బ్లూ, ఆస‌మ్ లైలాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేయ‌గా, గెలాక్సీ ఎ37 5జి ఫోన్‌ను ఆస‌మ్ లావెండ‌ర్‌, ఆస‌మ్ చార్ కోల్‌, ఆస‌మ్ గ్రేగ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. గెలాక్సీ ఎ37 ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.41,999 ఉండ‌గా, 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.47,999గా ఉంది. 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.52,999గా నిర్ణ‌యించారు. గెలాక్సీ ఎ57 ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.56,999 ఉండ‌గా, 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.62,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్ల‌ను శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్‌, పార్ట్‌న‌ర్ స్టోర్‌లు, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్ ల‌లో ఏప్రిల్ 10 నుంచి విక్ర‌యించ‌నుండ‌గా, ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్‌ల‌ను ప్రారంభించారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్ల‌ను కొంటే రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. 24 నెల‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేకుండా, జీరో డౌన్ పేమెంట్‌తో, నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఈ ఫోన్ల‌ను కొన‌వ‌చ్చు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3వేల అద‌న‌పు డిస్కౌంట్‌ను ఇస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement