త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భార‌త్‌లో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ప్రారంభించిన ఎలాన్ మ‌స్క్ స్టార్‌లింక్ సంస్థ‌.. నెల‌కు చార్జి ఎంతంటే..?

S

Technology | Published On Dec 8, 2025, 1.28 pm IST

భార‌త్‌లో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ప్రారంభించిన ఎలాన్ మ‌స్క్ స్టార్‌లింక్ సంస్థ‌.. నెల‌కు చార్జి ఎంతంటే..?
Advertisement

ప్రముఖ బిలియ‌నీర్ ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్టార్ లింక్ సంస్థ ఎట్ట‌కేల‌కు భార‌త్‌లో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ప్రారంభించింది. ఈ మేర‌కు భార‌త్‌లో గృహ వినియోగ‌దారుల‌కు గాను నెల‌వారి స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్‌ను ప్ర‌వేశపెట్టారు. దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాలు, ప‌ల్లెల్లోనూ హై స్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌త్‌లో ప్రారంభించ‌బ‌డిన‌ స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా అందించేందుకు ఆ సంస్థ సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే నెల‌వారి స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. ఇది ప్ర‌స్తుతానికి కేవ‌లం గృహ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చింది. వ్యాపార కేంద్రాల‌కు వాణిజ్య ప‌రంగా కూడా ఈ సేవ‌ల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు.

స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పొందాలంటే భార‌త్‌లోని గృహ వినియోగ‌దారులు నెల‌కు రూ.8600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో వినియోగ‌దారుల‌కు హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు శాటిలైట్ ద్వారా ల‌భిస్తాయి. ఎలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్నా స‌రే ఇంట‌ర్నెట్ 99.9 శాతం వ‌ర‌కు అప్‌టైమ్‌లోనే ఉంటుంద‌ని స్టార్ లింక్ తెలియజేసింది. ఈ సేవ‌ల‌ను పొందేందుకు గాను క‌స్ట‌మ‌ర్లకు రూ.34వేల విలువైన హార్డ్ వేర్‌ను ఇస్తారు. ఇది వారి నెల‌వారి ప్లాన్‌లోనే క‌లిసి ఉంటుంది. ఇందుకు ప్ర‌త్యేకంగా చార్జిల‌ను చెల్లించాల్సిన ప‌నిలేదు. ఇక ఈ సేవ‌ల‌లో భాగంగా వినియోగ‌దారులు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవ‌చ్చు. అయితే నూత‌న క‌స్ట‌మ‌ర్లు ముందుగా ఈ సేవ‌ల‌ను 30 రోజుల పాటు ఉచితంగా వాడుకోవ‌చ్చు.

కాగా స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు గాను ఆ సంస్థ భార‌త్‌లో ప‌లు చోట్ల త‌న కంపెనీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టేందుకు ఉద్యోగుల‌ను కూడా ఇప్ప‌టికే నియ‌మించుకుంది. బెంగ‌ళూరుతోపాటు ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో స్టార్‌లింక్‌కు చెందిన ఉన్న‌త స్థాయి ఉద్యోగులు ప‌నిచేయ‌నున్నారు. ఇక స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌లు నిరంత‌రాయంగా ల‌భించేందుకు, సిగ్న‌ల్ ను శాటిలైట్ల ద్వారా స‌రిగ్గా రిసీవ్ చేసుకునేందుకు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో స్టార్ లింక్ సంస్థ ఎర్త్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తోంది. చండీగ‌ఢ్‌, హైద‌రాబాద్, కోల్‌క‌తా, ల‌క్నో, ముంబై, నోయిడాలలో ఈ స్టేష‌న్లు ప‌నిచేస్తాయి. ఇవి ఇంట‌ర్నెట్ స్పీడ్ త‌గ్గ‌కుండా చూస్తాయి. సిగ్న‌ల్‌ను ఎల్ల‌ప్పుడూ 100 శాతం ఉండేలా చేస్తాయ‌ని స్టార్ లింక్ తెలియ‌జేసింది. కాగా స్టార్ లింక్ అందిస్తున్న ఈ సేవ‌ల‌కు గాను ఆ సంస్థ‌కు చెందిన భార‌త వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement