త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ఎయిర్‌టెల్ 5జి హాట్‌స్పాట్ ఇంట‌ర్నెట్ షేరింగ్‌పై గందరగోళం.. అసలు నిజం ఇదే..

Airtel | టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 2023లో అన్‌లిమిటెడ్ 5జి డేటా ఆఫర్‌ను ప్రారంభించింది. ఇటీవల మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా 5జి డేటాను షేర్ చేసినప్పుడు అన్‌లిమిటెడ్ డేటా పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్ కొన్ని నిబంధనలు అమలు చేసిందని సోషల్ మీడియాలో అనేక స్క్రీన్‌షాట్‌లు కూడా వైరల్ అయ్యాయి.

S

Technology | Published On Jul 18, 2026, 9.53 am IST

Airtel | ఎయిర్‌టెల్ 5జి హాట్‌స్పాట్ ఇంట‌ర్నెట్ షేరింగ్‌పై గందరగోళం.. అసలు నిజం ఇదే..
Advertisement

Airtel | టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 2023లో అన్‌లిమిటెడ్ 5జి డేటా ఆఫర్‌ను ప్రారంభించింది. ఇటీవల మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా 5జి డేటాను షేర్ చేసినప్పుడు అన్‌లిమిటెడ్ డేటా పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్ కొన్ని నిబంధనలు అమలు చేసిందని సోషల్ మీడియాలో అనేక స్క్రీన్‌షాట్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఈ స్క్రీన్‌షాట్‌లలో ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జి డేటాను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర పరికరాలకు షేర్ చేయడానికి అనుమతించదని, ఈ ఆఫర్ కేవలం వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగం కోసమేనని పేర్కొన్నట్లు కనిపించింది. అయితే ఈ సమాచారం నిజం కాదని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అధికారిక వివ‌రాలు లేవు..

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లుగా ఎలాంటి నిబంధనలు ప్రస్తుతం ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో లేవు. అలాగే ఎయిర్‌టెల్ టర్మ్స్ అండ్ కండీషన్స్ పేజీలో మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జి డేటా షేరింగ్‌పై ఎలాంటి పరిమితుల‌ను ప్రస్తావించలేదు. గతేడాది నవంబర్‌లో ఎయిర్‌టెల్ తన ప్రస్తుత 5జి వినియోగదారులను డ్యూయల్-మోడ్ 5జి నెట్‌వర్క్‌కు మార్చడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నెట్‌వర్క్ నాన్-స్టాండలోన్ (ఎన్‌ఎస్‌ఏ), స్టాండలోన్ (ఎస్‌ఏ) మోడళ్లపై పనిచేస్తుంది. భారత్‌లో 5జి అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలక అడుగుగా కంపెనీ పేర్కొంది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల‌లో మార్పులు..

కాగా ఎయిర్‌టెల్ తన ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. ప్రస్తుతం రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఎంట్రీ-లెవల్ ప్లాన్‌గా చూపిస్తోంది. రూ.549 ప్లాన్ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తోపాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం కొత్త వినియోగదారులు రూ.449 ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లేదా రూ.699 ఫ్యామిలీ ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే మిగతా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

Advertisement
Advertisement