Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు – అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ – డైరెక్టర్ ఎవరంటే?
వెంకటేష్ కోడిరామకృష్ణ కాంబినేషన్‌లో దేవిపుత్రుడు కంటే ముందు ఓ భారీ బడ్జెట్ సినిమా రావాల్సింది. ఈ సినిమాకు ఆకలిదేవుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఢిల్లీలో షూటింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ఆగిపోయింది? అసలేమైందంటే?
Entertainment | Published On Aug 13, 2026, 6.58 pm IST
Venkatesh | హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ కోడిరామకృష్ణలది టాలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన శత్రువు, శ్రీనివాస కళ్యాణం సూపర్ హిట్స్‌గా నిలవగా...దేవీపుత్రుడు వెరైటీ మూవీగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూడు సినిమాలే కాకుండా వెంకటేష్, కోడి రామకృష్ణ కలిసి మరో సినిమా చేయాల్సింది. ఈ మూవీ కోసం టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ఆగిపోయింది.
ఆకలి దేవుడు...
శ్రీనివాస కళ్యాణం, శత్రువు తర్వాత వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నారు నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ. ఈ సినిమాకు ఆకలిదేవుడు అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. అప్పట్లో వెంకటేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఆకలిదేవుడు తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించడంతో టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలో షూటింగ్...
కథానుగుణంగా ఆకలిదేవుడు షూటింగ్ చాలా వరకు ఢిల్లీలోనే షూట్ చేయబోతున్నట్లు నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ వెల్లడించారు. కోడిరామకృష్ణ శైలిలోనే సామాజిక ఇతివృత్తానికి హీరోయిజం, కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు చెప్పారు. వెంకటేష్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందంటూ పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరోయిన్...
హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ బ్యూటీ ఆకలిదేవుడుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. షూటింగ్ డేట్స్‌ను కూడా రివీల్ చేశారు. కానీ అనుకున్న టైమ్‌కు సినిమా మాత్రం సెట్స్‌పైకి రాలేదు. ఆ తర్వాత సినిమాపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. బడ్జెట్ పరమైన సమస్యల వల్ల ఈ మూవీని కోడిరామకృష్ణ, వెంకటేష్ ఆపేసినట్లు ప్రచారం జరిగింది. అలా అనౌన్స్‌మెంట్‌తోనే ఆకలిదేవుడుకు ప్యాకప్ పడింది. ఈ సినిమా ఆగిపోయిన చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్‌తో దేవిపుత్రుడు చేశారు కోడి రామకృష్ణ.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
- ●Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..
- ●Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి

Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని






