త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కూక‌ట్‌ప‌ల్లి ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | న‌న్ను మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించిన కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల రుణం తీర్చుకునే అవ‌కాశం త‌న‌కు ఇవాళ వ‌చ్చింద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 13, 2026, 7.00 pm IST

CM Revanth Reddy | కూక‌ట్‌ప‌ల్లి ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : న‌న్ను మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించిన కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల రుణం తీర్చుకునే అవ‌కాశం త‌న‌కు ఇవాళ వ‌చ్చింద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నా రాజ‌కీయ సుదీర్ఘ ప్ర‌యాణంలో జ‌డ్పీ మెంబ‌ర్‌గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించానంటే ఆడ‌ప‌డుచుల ఆశీర్వాదంతోనే ఈ గొప్ప అవ‌కాశం వ‌చ్చింది అని సీఎం తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న అనంత‌రం ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించారు.

ఆనాడు కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. పార్టీ ఆదేశాల మేర‌కు మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేయ‌మ‌న్న‌ప్పుడు.. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం సంపూర్ణంగా అండ‌గా నిల‌బ‌డి ఆశీర్వ‌దిస్తే.. గ‌ల్లీ నుంచి ఢిల్లీకి రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించాను. ఇప్పుడు సీఎంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా. కూక‌ట్‌ప‌ల్లి కాల‌నీల్లో మీతో క‌లిసి న‌డిచి, మీ స‌మ‌స్య‌ల‌పై కొట్లాడి.. ఆనాటి ప్ర‌భుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాను. కానీ ఆశించిన మేర‌కు అభివృద్ధి చేయ‌లేదు. నిధులు మంజూరు కాలేదు అధికారం లేదు కాబ‌ట్టి. అయినా మీరు అక్కున చేర్చుకున్నారు కాబ‌ట్టే రాష్ట్ర సీఎంగా కూక‌ట్‌ప‌ల్లిని అభివృద్ధి చేయ‌డానికి స‌ర్వాధికారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి. మీకు కావాల్సిన ప‌నులు చేయించుకోండి.. మంత్రుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నా. మీ రుణం తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చింది. రోడ్లు, ఫ్లై ఓవ‌ర్లు, చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌, విద్యాసంస్థ‌లు, ఉద్యోగ ఉపాధికి సంబంధించి ప‌రిశ్ర‌మ‌లు ఇవ్వాల‌ని మంత్రుల‌ను కోరుతున్నానని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement