ChatGPT Images 2.0 | భారత్‌లో చాట్‌జీపీటీ ఇమేజ్ క్రేజ్.. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా ఇమేజ్‌ల జనరేషన్..
ChatGPT Images 2.0 | ఓపెన్‌ఏఐ రూపొందించిన తాజా ఇమేజ్ జనరేషన్ మోడల్ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్‌లో విశేషమైన రీతిలో ఆదరణ పొందుతోంది. కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం భారతీయ వినియోగదారులు ఇప్పటికే చాట్‌జీపీటీ ద్వారా ఒక బిలియన్ (వంద కోట్లు)కు పైగా ఇమేజ్‌లను జనరేట్ చేశారని చెప్పారు. ఈ మోడల్‌ను ఏప్రిల్ 21న మాత్రమే ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు.
Technology | Published On May 18, 2026, 3.38 pm IST
ChatGPT Images 2.0 | ఓపెన్‌ఏఐ రూపొందించిన తాజా ఇమేజ్ జనరేషన్ మోడల్ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్‌లో విశేషమైన రీతిలో ఆదరణ పొందుతోంది. కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం భారతీయ వినియోగదారులు ఇప్పటికే చాట్‌జీపీటీ ద్వారా ఒక బిలియన్ (వంద కోట్లు)కు పైగా ఇమేజ్‌లను జనరేట్ చేశారని చెప్పారు. ఈ మోడల్‌ను ఏప్రిల్ 21న మాత్రమే ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. అంటే నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ భారీ మైలురాయికి చేరుకుంది. ఈ ఏఐ మోడల్‌కు వచ్చిన ఆదరణ గూగుల్ నానో బనానా మోడళ్ల స్థాయికి చేరినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో ఆల్ట్‌మన్ ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే భారత్‌లో ఒక బిలియన్‌కు పైగా ఇమేజ్‌లు జనరేట్ అయ్యాయని, ఇది చూడటం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఫీచర్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగం ఉన్న మార్కెట్ భారత్ అని వెల్లడించింది.
ఇమేజెస్ 2.0లో కీలక మార్పులు..
చాట్‌జీపీటీ మొదటి ఇమేజ్ మోడల్‌కు వారసత్వంగా వచ్చిన ఇమేజెస్ 2.0లో పలు కీలక అప్‌గ్రేడ్‌లు చేశారు. ముఖ్యంగా ఇమేజ్ క్వాలిటీ, ప్రాంప్ట్ అర్థం చేసుకునే సామర్థ్యం, టెక్స్ట్ రెండరింగ్ వంటి అంశాల్లో గణనీయమైన మెరుగుదల తీసుకొచ్చారు. ఈ భారీ వినియోగానికి కారణమైన ప్రముఖ ట్రెండింగ్ ప్రాంప్ట్‌ల జాబితాను కూడా ఓపెన్‌ఏఐ విడుదల చేసింది. చాట్‌జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని ఇమేజెస్ సెక్షన్‌లో కనిపించే ప్రీసెట్ ప్రాంప్ట్‌లే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. అందులో సినిమాటిక్ పోర్ట్రెయిట్ కొలాజ్ ట్రెండ్‌కు అత్యధిక ఆదరణ లభించింది. ఇందులో వినియోగదారుల ఫోటోలను భారతీయ దుస్తులు, స్టూడియో లైటింగ్, వార్మ్ టోన్‌లతో సినిమాటిక్ స్టైల్‌లో ఏఐ రూపొందించింది. ఇక మినీ మీ వరల్డ్ కూడా మరో పెద్ద ట్రెండ్‌గా నిలిచింది. ఇందులో యూజర్‌ను 3డీ యానిమేటెడ్ క్యారెక్టర్‌లా మార్చి, వారి నిజ జీవిత పరిసరాల్లో చూపించే విధంగా చిత్రాలు జనరేట్ అయ్యాయి.
అనేక రకాల క్రియేటివ్ పనులకు..
భారతీయ వినియోగదారులు చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0ను కేవలం ఫోటోలను సృష్టించడానికే కాకుండా అనేక రకాల క్రియేటివ్ పనులకు ఉపయోగిస్తున్నారు. ఫోటోలలో లైటింగ్ సరిచేయడం, ఫ్యాషన్ స్టూడియో తరహా పోర్ట్రెయిట్‌లు రూపొందించడం, అనిమే స్టైల్ ఫోటోలు తయారు చేయడం, పాత ఫోటోలను రీస్టోర్ చేయడం వంటి పనులు ఎక్కువగా చేశారు. అదే విధంగా చిబి స్టికర్‌లు, ట్రావెల్ కొలాజ్‌లు, మంగా కామిక్ స్ట్రిప్‌లు రూపొందించే ట్రెండ్ కూడా బాగా పెరిగింది. అయితే గూగుల్ నానో బనానా మోడళ్ల మాదిరిగా ఈ భారీ వినియోగం సోషల్ మీడియాలో పెద్ద వైరల్ ట్రెండ్‌లుగా మాత్రం మారలేదు. చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0లో ఓపెన్‌ఏఐ మెరుగైన ప్రాంప్ట్ అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అందించింది. దీని వల్ల వినియోగదారులు ఎక్కువ నిడివి ఉన్న, వివరమైన ప్రాంప్ట్‌లు టైప్ చేసినా కూడా ఏఐ వాటిని కచ్చితంగా అర్థం చేసుకుని సరైన ఫలితాలను ఇస్తోంది.
ఇమేజ్‌లలోని వేర్వేరు లేయర్‌లను మెరుగ్గా హ్యాండిల్ చేయడం, టెక్స్ట్‌ను స్పష్టంగా రెండర్ చేయడం వంటి ఫీచర్‌లను కూడా జోడించారు. ముఖ్యంగా హిందీ, బెంగాలీ, చైనీస్, జపనీస్, కొరియన్ వంటి పలు భాషలకు మల్టీలాంగ్వేజ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆసియా మార్కెట్లలో ఈ ఫీచర్ వేగంగా విస్తరిస్తోంది.
సంబంధిత వార్తలు

ChatGPT Image | చాట్ జీపీటీలో కొత్త ట్రెండ్.. ఫోటోలను వింటేజ్ స్టైల్‌లో మార్చే కొత్త ఇమేజ్ ప్రాంప్ట్‌లు ఇవే..
మే 19, 2026

Token 26 AI Hackathon | సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కార్స్24 బంపర్ ఆఫర్.. రూ.20 లక్షలు గెలుచుకునే అవకాశం..
మే 18, 2026

Daybreak | ఆంథ్రోపిక్ కు పోటీగా ఓపెన్‌ఏఐ డే బ్రేక్.. సైబర్ సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఏఐ మోడల్..
మే 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



