త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ChatGPT For Doctors | ఇక వైద్యుల‌కు అసిస్టెంట్‌గా చాట్‌జీపీటీ.. కొత్త టూల్‌ను లాంచ్ చేసిన ఓపెన్ఏఐ..

ChatGPT For Doctors | ఇప్ప‌టికే అనేక రంగాల్లో ఉన్న నిపుణులు, ఉద్యోగులు, ఇత‌ర కార్మికుల కోసం అనేక ఏఐ ప్లాట్‌ఫామ్‌లు భిన్న ర‌కాల టూల్స్‌ను అభివృద్ధి చేస్తూ అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో అంద‌రి పని గ‌తంలోక‌న్నా చాలా సుల‌భ‌త‌రం అవుతోంది. వేగంగా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నారు.

S

Technology | Published On Apr 25, 2026, 5.04 pm IST

ChatGPT For Doctors | ఇక వైద్యుల‌కు అసిస్టెంట్‌గా చాట్‌జీపీటీ.. కొత్త టూల్‌ను లాంచ్ చేసిన ఓపెన్ఏఐ..
Advertisement

ChatGPT For Doctors | ఇప్ప‌టికే అనేక రంగాల్లో ఉన్న నిపుణులు, ఉద్యోగులు, ఇత‌ర కార్మికుల కోసం అనేక ఏఐ ప్లాట్‌ఫామ్‌లు భిన్న ర‌కాల టూల్స్‌ను అభివృద్ధి చేస్తూ అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో అంద‌రి పని గ‌తంలోక‌న్నా చాలా సుల‌భ‌త‌రం అవుతోంది. వేగంగా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. అయితే సేవ‌ల‌ను అందించ‌డంలో ఒక్కో ఏఐ ప్లాట్‌ఫామ్ భిన్న ర‌కాలుగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఓపెన్ఏఐ వైద్య రంగంలో సంచ‌నాల‌ను సృష్టిస్తూ ఆ రంగంలో నూత‌న ఏఐ టూల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. గ‌తంలో చాట్ జీపీటీ డాక్ట‌ర్ పేరిట ఏఐ డాక్ట‌ర్ సేవ‌ను ఈ సంస్థ అందుబాటులోకి తేగా ఇప్పుడు వైద్యుల కోసం ప్ర‌త్యేక చాట్ జీపీటీ వెర్ష‌న్‌ను లాంచ్ చేసింది. వైద్య రంగంలో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్లు, ఫార్మ‌సిస్టులు, న‌ర్సులు, ఇత‌ర మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్, ప‌రిశోధ‌కులు ఓపెన్ఏఐ లాంచ్ చేసిన ఈ ప్ర‌త్యేక చాట్ జీపీటీ వెర్ష‌న్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇది వారికి ఒక అసిస్టెంట్‌గా సేవ‌ల‌ను అందిస్తుంది.

వైద్య రంగంలోని వారికి అసిస్టెంట్‌గా..

ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ ప్ర‌త్యేక హెల్త్ వెర్ష‌న్ ద్వారా ఆయా రంగాల్లో ప‌నిచేస్తున్న వారు డాక్యుమెంటేష‌న్‌, రీసెర్చ్‌, పేషెంట్ కేర్ వంటి ప‌నుల‌కు ఈ టూల్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో వారి ప‌ని చాలా తేలిక‌వుతుంది. ఓపెన్ఏఐ త‌న అధికారిక బ్లాగ్‌లో తెలిపిన ప్ర‌కారం ఈ టూల్ ప్ర‌స్తుతం అమెరికాలో ధ్రువీక‌రించ‌బ‌డిన వైద్యులు, న‌ర్సులు, ఫిజిషియన్ అసిస్టెంట్లు, ఫార్మ‌సిస్టులు, న‌ర్స్ ప్రాక్టిష‌న‌ర్లు, ఇత‌ర టెక్నిషియ‌న్ల‌కు ఉచితంగానే అందుబాటులో ఉంది. ఈ ఏఐ టూల్ వారికి ఒక అసిస్టెంట్‌గా ప‌నిచేస్తూ కీల‌క సూచ‌న‌లు ఇస్తుంది. అనేక ప‌నుల‌ను సుల‌భంగా నిర్వ‌ర్తిస్తుంది. ఇందులో ఎవిడెన్స్ ఎవిడెన్స్ రివ్యూ, వ్యక్తిగత డయాగ్నోసిస్, ట్రీట్‌మెంట్ సూచనలు, డాక్యుమెంటేషన్ తయారీ, అలాగే పేషెంట్ ఎడ్యుకేషన్ మెటీరియల్ ను రూపొందించడం వంటి ప‌నులు నిర్వ‌హించుకోవ‌చ్చు. సాధారణ వినియోగాల్లో కేర్ పాత్‌వేలను సమీక్షించడం, సిటేషన్లతో కూడిన వైద్య ఆధారాలను సమగ్రంగా అందించడం, వివిధ డయాగ్నోసిస్ అవకాశాలను విశ్లేషించడం, ప్రైయర్ ఆథరైజేషన్ లెటర్లను తయారు చేయడం, పేషెంట్ చార్టుల‌ను సారాంశం చేయడం, పేషెంట్లకు సులభమైన భాషలో వివరణలు ఇవ్వడం వంటి ప‌నుల‌ను చాట్‌జీపీటీ టూల్ నిర్వ‌హిస్తుంది.

వైద్యుల‌దే తుది నిర్ణ‌యం..

అయితే ఈ టూల్ వైద్యుల స్థానాన్ని భర్తీ చేయడానికి కాదని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. ఈ టూల్ ను ఉపయోగిస్తున్నప్పటికీ తుది నిర్ణయాలు, బాధ్యతలు వైద్యులపైనే ఉంటాయని కంపెనీ తెలిపింది. అందువల్ల ఏఐ అందించే సమాచారాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించడం అవసరమని సూచించింది. ఈ ఏఐ టూల్ సమాధానాలు మిలియన్ల నమ్మకమైన మెడికల్ సోర్సెస్ ఆధారంగా అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రతి సమాధానంలో సంబంధిత అధ్యయనాల శీర్షికలు, జర్నల్స్, ప్రచురణ తేదీలతో కూడిన సిటేషన్లు ఉంటాయి, దీని ద్వారా త్వరగా ధ్రువీక‌ర‌ణ పొంద‌వ‌చ్చు. యూజర్ ఇచ్చే ప్రాంప్ట్‌కు అనుగుణంగా సరైన, తాజా సమాచార వనరులను సిస్టమ్ స్వయంచాలకంగా గుర్తిస్తుంది. డేటాబేస్‌లు లేదా ఫిల్టర్లు సెట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఉత్తమమైన, తాజా ఆధారాలను సిస్టమ్ స్వయంగా ఎంపిక చేసి పారదర్శకంగా చూపిస్తుంద‌ని ఓపెన్ఏఐ పేర్కొంది. అలాగే యూజర్లు షేర్ చేసే డేటాను ఇతర ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడానికి ఉపయోగించమని కూడా ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. ఇక ఈ టూల్‌ను అతి త్వ‌ర‌లోనే ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు కూడా విస్త‌రించ‌నున్న‌ట్లు తెలియజేసింది.

Advertisement
Advertisement