త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xiaomi YU7 | షియోమీ నుంచి బీస్ట్ త‌ర‌హా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. 2.92 సెకన్లలో 100 కి.మీ. వేగం.. 700 కి.మీ. రేంజ్‌..

Xiaomi YU7 | చైనా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో షియోమీ మరోసారి సంచలనం సృష్టించింది. కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌లో భాగంగా కొత్తగా షియోమీ వైయూ7 స్టాండర్డ్, షియోమీ వైయూ7 జీటీ వేరియంట్లను అధికారికంగా విడుద‌ల చేసింది. లగ్జరీ హై-పర్‌ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా రూపొందించిన వైయూ7 సిరీస్‌కు మార్కెట్లో భారీ స్పందన లభించింది.

S

Technology | Published On May 22, 2026, 5.36 pm IST

Xiaomi YU7 | షియోమీ నుంచి బీస్ట్ త‌ర‌హా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. 2.92 సెకన్లలో 100 కి.మీ. వేగం.. 700 కి.మీ. రేంజ్‌..
Advertisement

Xiaomi YU7 | చైనా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో షియోమీ మరోసారి సంచలనం సృష్టించింది. కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌లో భాగంగా కొత్తగా షియోమీ వైయూ7 స్టాండర్డ్, షియోమీ వైయూ7 జీటీ వేరియంట్లను అధికారికంగా విడుద‌ల చేసింది. లగ్జరీ హై-పర్‌ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా రూపొందించిన వైయూ7 సిరీస్‌కు మార్కెట్లో భారీ స్పందన లభించింది. లాంచ్ అయిన తొలి 18 గంటల్లోనే 2.4 లక్షలకు పైగా లాక్డ్ ఆర్డర్లు నమోదయ్యాయి. 2026 ఏప్రిల్ 30 నాటికి 2.32 లక్షల యూనిట్లు డెలివరీ అయ్యాయని కంపెనీ వెల్లడించింది. దీంతో ఇది చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-టు-లార్జ్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. అత్యంత శక్తివంతమైన ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్‌గా వచ్చిన వైయూ7 జీటీ, 2026 ఏప్రిల్ 2న న్యూర్బ‌ర్‌గ్రింగ్ నోర్డ్ శ్ల‌యిఫే ట్రాక్‌పై 7:22.755 నిమిషాల ల్యాప్ టైమ్ నమోదు చేసింది. ఇది గత ఎస్‌యూవీ రికార్డును 14 సెకన్ల తేడాతో అధిగమించింది.

వైయూ 7 సిరీస్‌లో..

వైయూ7 సిరీస్‌కు క్లాసిక్ లాంగ్-హుడ్ డిజైన్, గ్రౌండ్-హగ్గింగ్ స్టాన్స్, క్రాస్-షేప్ హెడ్‌ల్యాంప్స్, హాలో టెయిల్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కంపెనీ కొత్తగా క్రిమ్సన్ రెడ్, రేడియంట్ పర్పుల్, వోల్కానిక్ గ్రే వంటి మూడు ఎక్స్‌టీరియర్ కలర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. షియోమీ వైయూ7 స్టాండర్డ్ ఫీచర్లలో భాగంగా రోజువారీ వినియోగం, మెరుగైన ఎఫిషియెన్సీ, బ్యాలెన్స్‌డ్ పర్‌ఫార్మెన్స్ కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. ఇందులో 73 కిలోవాట్ అవర్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ, 752 వోల్ట్ సిలికాన్ కార్బైడ్ హై-వోల్టేజ్ ప్లాట్‌ఫామ్ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సీఎల్‌టీసీ ప్రమాణాల ప్రకారం 643 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 385 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. పర్‌ఫార్మెన్స్ పరంగా ఇది 0 నుంచి 100 కిమీ వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 220 కిలోమీటర్లుగా ఉంది.

స్మార్ట్ చాసిస్ 2.0 సిస్టమ్, డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్, ఫైవ్-లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, డ్యూయల్-చాంబర్ ఎయిర్ స్ప్రింగ్స్, వేరియబుల్ డ్యాంపింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మోషన్ సిక్‌నెస్ రిలీఫ్ సిస్టమ్ కారణంగా ప్రయాణ సమయంలో వాంతుల సమస్య 51 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.

బీస్ట్ త‌ర‌హా వైయూ 7 జీటీ..

వైయూ7 జీటీని పూర్తిగా హై-పర్‌ఫార్మెన్స్ డ్రైవింగ్ కోసం అభివృద్ధి చేశారు. ఇందులో 295ఎంఎం రియర్ టైర్లు, యాక్టివ్ రియర్ డిఫ్యూజర్, కార్బన్ ఫైబర్ మిర్రర్లు, 24కే గోల్డ్ కార్బన్ ఫైబర్ బ్యాడ్జ్‌లు అందించారు. అదనంగా 21 ఇంచుల ఫోర్జ్‌డ్‌ వీల్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇంటీరియర్‌లో 2.3 చదరపు మీటర్ల ఆల్కాంటారా సాఫ్ట్ టచ్ మెటీరియల్, 15 కార్బన్ ఫైబర్ ట్రిమ్ పీసులు, ఫైవ్-స్క్రీన్ కాక్‌పిట్, జీటీ థీమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 40వాట్ ఎక్స్‌టర్నల్ జీటీ స్పోర్ట్ సౌండ్ స్పీకర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం 18-వే అడ్జస్టబుల్ సీట్, మసాజ్ సిస్టమ్, హీటింగ్-వెంటిలేషన్ ఫీచర్లు, 132 డిగ్రీల వరకు రీక్లైన్ అయ్యే రియర్ సీట్లు కూడా అందించారు. గరిష్టంగా 1,740 లీటర్ల కార్గో స్పేస్ లభిస్తుంది.

వైయూ7 జీటీలో హైపర్‌ఇంజిన్ వీ8ఎస్ ఈవో మోటార్, డ్యూయల్ మోటార్ సెటప్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 1,003 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 2.92 సెకన్లలో చేరుతుంది. గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లుగా ఉంది. ఈ మోడల్‌లో 101.7 కిలోవాట్ అవర్ టెర్నరీ లిథియం బ్యాటరీ, 897 వోల్ట్ అల్ట్రా హై-వోల్టేజ్ ప్లాట్‌ఫామ్, 5.2సీ ఛార్జింగ్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి. సీఎల్‌టీసీ ప్రమాణాల ప్రకారం 705 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. వైయూ7 సిరీస్‌లో షియోమీ హైపర్‌విజన్ ప్యానోరమిక్ డిస్‌ప్లే, అప్‌గ్రేడ్ చేసిన షియావోఏఐ అసిస్టెంట్, ఏఐ పెట్ కంపానియన్ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ అసిస్టెన్స్ కోసం ఎన్విడియా డ్రైవ్ ఏజీఎక్స్ థోర్ ప్లాట్‌ఫామ్, లైడార్, 4డి మిల్లీమీటర్ వేవ్ రాడార్, హైపర్ అసిస్టెడ్ డ్రైవింగ్ సిస్టమ్ ను అందించారు. హైవే నావిగేషన్, అర్బన్ డ్రైవింగ్, ఆటోమేటెడ్ పార్కింగ్ వంటి ఫీచర్లకు సపోర్ట్ ఉంది. అన్ని ఏడీఏఎస్ ఫీచర్లకు లైఫ్‌టైమ్ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు. సేఫ్టీ పరంగా 2,200 ఎంపీఏ అల్ట్రా హై-స్ట్రెంగ్త్ స్టీల్ రోల్ కేజ్, ట్రిపుల్ రెడండెంట్ డోర్ హ్యాండిల్ సిస్టమ్, ఎమర్జెన్సీ బ్యాకప్ పవర్ అన్‌లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీపై 1,200కు పైగా సేఫ్టీ టెస్టులు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది.

షియోమీ వైయూ7 స్టాండర్డ్ ధరను చైనాలో ఆర్‌ఎంబీ 2,33,500గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.32.9 లక్షలకు స‌మానం. ఇక వైయూ7 జీటీ ధర ఆర్‌ఎంబీ 3,89,900గా ఉంది. భారత కరెన్సీలో సుమారుగా రూ.54.94 లక్షలు అవుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement