Tesla Model Y L | ఒక్కసారి చార్జ్ చేస్తే 681 కిలోమీటర్ల మైలేజ్.. టెస్లా నుంచి కొత్త కారు లాంచ్..
Tesla Model Y L | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో తన నూతన వాహనం మోడల్ వైఎల్‌ను బుధవారం విడుదల చేసింది. కొత్త 6 సీటర్ వేరియెంట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారులో పలు ఆకట్టుకునే సదుపాయాలను అందించారు.
Technology | Published On Apr 22, 2026, 1.36 pm IST
Tesla Model Y L | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో తన నూతన వాహనం మోడల్ వైఎల్‌ను బుధవారం విడుదల చేసింది. కొత్త 6 సీటర్ వేరియెంట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారులో పలు ఆకట్టుకునే సదుపాయాలను అందించారు. గతేడాది జూలైలో మార్కెట్‌లో రంగప్రవేశం చేసిన అనంతరం టెస్లా కంపెనీ తన కార్ల శ్రేణిని మరింత విస్తరించే దిశగా ఈ మోడల్ కారును భారత్‌లో ప్రవేశపెట్టింది. మోడల్ వైఎల్ కారు ధర 66,324 డాలర్లు (దాదాపుగా రూ.62 లక్షలు) ఉండగా, గతంలో వచ్చిన వై మోడల్ కార్ల కన్నా వీల్ బేస్ మరింత ఎక్కువగా ఉంటుందని టెస్లా తెలిపింది. అయితే గతంలో టెస్లా భారత్‌లో లాంచ్ చేసిన కార్లకు స్పందన అంతంత మాత్రంగానే లభించగా, ఇప్పుడు మార్కెట్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ కారు మోడల్‌ను ప్రవేశపెట్టింది.
ధర మరీ ఎక్కువ..
టెస్లాకు చెందిన అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ వై కార్లలో మోడల్ వైఎల్ కారును అత్యంత అధునాతన సదుపాయాలతో అందిస్తున్నారు. ఇందులో ఎక్కువ వీల్ బేస్ ఉండడంతోపాటు హైఎండ్ వేరియెంట్‌ను తక్కువ ధరలో అందిస్తోంది. భారత వినియోగదారులు ఎక్కువగా పెద్ద సైజు, ప్రీమియం సదుపాయాలు కలిగిన కార్లపై ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యంలో టెస్లా ఈ కార్‌ను లాంచ్ చేసింది. టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, సన్ రూఫ్ వంటి సదుపాయాలు ఉన్న కార్లకు ప్రస్తుతం భారత్‌లో డిమాండ్ ఉండగా, ఆ విభాగం కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లా ఈ ఆర్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ ఆటోమొబైల్ పరిశ్రమకు 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అయినప్పటికీ టెస్లా ఇక్కడి మార్కెట్‌లోకి అడుగు పెట్టిన సందర్భంగా విడుదల చేసిన వై మోడల్ కార్‌ల ధరలు మరీ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఆసక్తిని చూపించలేదు. దేశంలో 100 శాతం దిగుమతి సుంకం అమలులో ఉండడంతో అమెరికా కార్ల ధరలు భారత్‌లో రెట్టింపు ధర ఉన్నాయి. అందువల్లే ఈ వాహనాల అమ్మకాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి.

టాప్ మోడల్ ధర రూ.68 లక్షలు..
ప్రస్తుతం వై మోడల్ కారు రియర్-వీల్ డ్రైవ్ వేరియెంట్ ధర సుమారుగా రూ.60 లక్షలు ఉండగా, లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియెంట్ ధర రూ.68 లక్షల వరకు ఉంది. ఈ ధరలతో టెస్లా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక ప్రత్యేక విభాగంలో నిలిచింది. సాధారణంగా ఇలాంటి కార్లలో ఉన్న సదుపాయాలతో దేశీయంగా తయారయ్యే కార్ల మోడల్స్ ధరలు 22వేల డాలర్లకు లోపే ఉండగా, టెస్లా కార్ల ధరలు మాత్రం ఏకంగా 66వేల డాలర్లు ఉన్నాయి. అందువల్లే ఈ కార్లకు భారత్‌లో అంతగా ఆదరణ లభించడం లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫీచర్లు ఇవే..
ఇక టెస్లా మోడల్ వైఎల్ కారును ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌ను కూడా ఇచ్చారు. ఇందులో సీట్లు 2+2+2 విధానంలో ఉంటాయి. మధ్యలో ఉన్న సీట్లను ఫోల్డ్ కూడా చేయవచ్చు. అలాగే మూడో వరుసలో ఉండే వారికి ప్రత్యేక ఏసీ వెంట్‌లను ఇచ్చారు. యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, కప్ హోల్డర్లు, 50:50 స్ల్పిట్-ఫోల్డ్ సదుపాయాలను కూడా ఇచ్చారు. ఈ కారు కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 201 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
సంబంధిత వార్తలు

AJA Consulting Services | ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సలిస్టింగ్ సర్వీసెస్
మే 20, 2026

PM Modi Convoy | రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణం.. వాటి ప్రత్యేకతలు తెలుసా..?
మే 14, 2026

PM Modi Convoy | తొలిసారి.. రెండు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రధాని ప్రయాణం.. VIDEO
మే 13, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



