Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ తన తొలి 750 సీసీ మోటార్‌సైకిల్ హిమాలయన్ 750ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.4.89 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 743 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్, ఐదు రైడింగ్ మోడ్లు, కార్నరింగ్ ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.
Technology | Published On Nov 28, 2026, 5.18 pm IST
Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ తన తొలి 750 సీసీ మోటార్‌సైకిల్ హిమాలయన్ 750ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.4.89 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 743 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్, ఐదు రైడింగ్ మోడ్లు, కార్నరింగ్ ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.
బుకింగ్‌లు ఎప్పటి నుంచి..?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త హిమాలయన్ 750 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గోవాలో నిర్వహించిన మోటోవర్స్ 2026 కార్యక్రమంలో ఈ బైక్‌ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూమ్ ధరను రూ.4,89,490గా నిర్ణయించింది. ఇందులో భాగంగా టాప్ ఎండ్ యాంటార్కిటిక్ సిల్వర్ వేరియంట్ ధర రూ.6.29 లక్షలుగా ఉంది. కంపెనీ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్, అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.
మోటోవర్స్ కార్యక్రమానికి హాజరైన వారికి శని, ఆది వారాల్లో గోవాలో ప్రత్యేకంగా ముందస్తు బుకింగ్ అవకాశం కల్పించారు. రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ, ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. గోవిందరాజన్ మాట్లాడుతూ.. హిమాలయన్ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా, విభిన్న భూభాగాల్లో ప్రయాణించాలనుకునే రైడర్ల కోసం ఈ బైక్‌ను రూపొందించినట్లు తెలిపారు.
ధర ఎంత..?
ఈ మోటార్‌సైకిల్ ఐదు కలర్ ఆప్షన్లలో మూడు ధరల శ్రేణుల్లో అందుబాటులో ఉంటుంది. అజ్టెక్ గ్రీన్, టెక్టానిక్ బ్లాక్ రంగుల్లో లభించే కాస్ట్ వీల్ వేరియంట్ల ధర రూ.4,89,490 ఉండగా, వైకింగ్ బ్రాంజ్, సైబీరియా వైట్ రంగుల్లో లభించే స్పోక్ వీల్ వేరియంట్ల ధర రూ.5,14,495గా ఉంది. టాప్ వేరియంట్ యాంటార్కిటిక్ సిల్వర్ ధర రూ.6.29 లక్షలుగా ఉంది. ఇందులో జీఐవీఐ సంస్థతో కలిసి రూపొందించిన టూరింగ్ ప్యాకేజీలో టాప్ బాక్స్, ప్యానియర్‌లు, ఇన్నర్ బ్యాగులు, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్ గార్డ్స్, అల్యూమినియం స్కిడ్ ప్లేట్ అందించారు. ఈ లగేజ్ సిస్టమ్ కోసం ప్రత్యేక మౌంటింగ్ ర్యాక్ అవసరం లేకుండా బైక్‌కు అనుసంధానం చేసేలా రూపొందించారు. ఇందులో 743 సీసీ ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5,000 ఆర్పీఎం వద్ద 63 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3,500 ఆర్పీఎం నుంచే 90 శాతం టార్క్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
రోడ్, రోడ్ స్పోర్ట్, రెయిన్, ట్రయల్, కస్టమ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇంజిన్ మ్యాపింగ్, కార్నరింగ్ ఏబీఎస్, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను నియంత్రించవచ్చు. ఆరు అక్షాల ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) కూడా ఇందులో ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
4 ఇంచుల రౌండ్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్, కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇమ్మొబిలైజర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కొత్త 7 ఇంచుల ఎల్ఈడీ హెడ్‌లైట్ మెరుగైన వెలుతురును అందిస్తుంది. సస్పెన్షన్ కోసం 43 ఎంఎం షోవా అడ్జస్టబుల్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను ఉపయోగించారు. ముందు భాగంలో 190 ఎంఎం, వెనుక భాగంలో 175 ఎంఎం వీల్ ట్రావెల్ అందించారు. 19 ఇంచుల ఫ్రంట్, 17 ఇంచుల రియర్ ట్యూబ్‌లెస్ టైర్లు, డ్యుయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, కార్నరింగ్ ఏబీఎస్ ఉన్నాయి.
బైక్ సీట్ ఎత్తు 815 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 205 ఎంఎం, ఫ్యుయల్ ట్యాంక్ సామర్థ్యం 17 లీటర్లుగా ఉన్నాయి. మొత్తం లోడ్ సామర్థ్యం 195 కిలోలు. ఐదు స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే విండ్స్క్రీన్తోపాటు రైడర్, పిలియన్ కోసం ప్రత్యేక సీట్లు అందించారు. అదనంగా లో రైడ్, టూరింగ్ రైడర్, టూరింగ్ ప్యాసింజర్ సీట్లను ఆప్షనల్‌గా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
నవంబర్ 15, 2026

Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి కొత్త అప్డేట్లు.. ధర ఎంతంటే?
ఆగస్టు 15, 2026

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



