Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి కొత్త అప్‌డేట్లు.. ధర ఎంతంటే?
Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి గాను అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. స్టైలింగ్, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు చేసిన ఈ బైక్ ధరలు ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల వరకు ఉన్నాయి. రాకర్ రెడ్ వేరియంట్‌లో ప్రస్తుతం బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, ఎగ్జాస్ట్, కాస్ట్-అలాయ్ వీల్స్ అందించారు.
Technology | Published On Aug 15, 2026, 10.40 am IST
Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి గాను అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. స్టైలింగ్, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు చేసిన ఈ బైక్ ధరలు ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల వరకు ఉన్నాయి. రాకర్ రెడ్ వేరియంట్‌లో ప్రస్తుతం బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, ఎగ్జాస్ట్, కాస్ట్-అలాయ్ వీల్స్ అందించారు. అలాగే అన్ని వేరియంట్లలో యూఎస్‌బీ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ ఇండికేటర్లను కొత్తగా ఇచ్చారు. అప్‌డేటెడ్ మోడల్ 4 కలర్ ఆప్షన్లలో, 2 స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. బ్లాక్డ్‌అవుట్, క్రోమ్ అనే రెండు స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఈ రంగులను అందించారు.
648 సీసీ ఇంజిన్..
ఈ అప్‌డేట్లలో బ్లాక్ పెయింట్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ కౌల్, కొత్త ఎల్‌ఈడీ ఇండికేటర్లు, యూఎస్‌బీ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. గతంలో ఏపెక్స్ గ్రే వేరియంట్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న బ్లాక్డ్‌అవుట్ ఇంజిన్, ఎగ్జాస్ట్, కాస్ట్-అలాయ్ వీల్స్‌ను ఇప్పుడు రాకర్ రెడ్ వేరియంట్‌కు కూడా అందించారు. అయితే బైక్‌లోని మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే 648 సీసీ ఎయిర్, ఆయిల్ కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 47 హెచ్‌పీ పవర్, 52.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
వేరియెంట్లు, ధరలు..
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.53 లక్షల నుంచి రూ.3.82 లక్షలుగా ఉంది. ఈ బైక్ క్లెయిమ్ చేసిన మైలేజ్ 27 కిలోమీటర్లు కాగా పెట్రోల్ ఇంధనంతో పనిచేసే ఇందులో 648 సీసీ ఇంజిన్, 2 వాల్వ్‌ట్రెయిన్‌లు ఉన్నాయి. 12 వోల్ట్, 12 ఏహెచ్ వీఆర్‌ఎల్‌ఏ బ్యాటరీ, డ్యుయల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాకర్ రెడ్‌లో బ్లాక్డ్‌అవుట్ ఇంజిన్, కాస్ట్-అలాయ్ వీల్స్‌తో ధర రూ.3.58 లక్షలు ఉండగా, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్‌లో పాలిష్డ్ ఇంజిన్, స్పోక్ వీల్స్‌తో ధర అంతే ఉంది. అయితే ఏపెక్స్ గ్రేలో బ్లాక్డ్‌అవుట్ ఇంజిన్, కాస్ట్-అలాయ్ వీల్స్‌తో ధర రూ.3.81 లక్షలుగా ఉంది. మిస్టర్ క్లీన్‌లో పాలిష్డ్ ఇంజిన్, స్పోక్ వీల్స్‌తో ధర రూ.3.88 లక్షలుగా ఉంది.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ




