E20 Petrol | వాహనదారులకు ఈ20 పెట్రోల్ షాక్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదట..
E20 Petrol | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ ఐసీఐసీఐ లొంబార్డ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ20 ఇంధనం వల్ల పాత, ఈ20-అనుకూలత లేని వాహనాలకు నష్టం జరిగితే బీమా క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఈ10 లేదా అంతకంటే తక్కువ ప్రమాణాలకు చెందిన వాహనాలను ఉపయోగిస్తున్న కోట్లాది వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.
Technology | Published On Jun 15, 2026, 1.31 pm IST
E20 Petrol | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ ఐసీఐసీఐ లొంబార్డ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ20 ఇంధనం వల్ల పాత, ఈ20-అనుకూలత లేని వాహనాలకు నష్టం జరిగితే బీమా క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఈ10 లేదా అంతకంటే తక్కువ ప్రమాణాలకు చెందిన వాహనాలను ఉపయోగిస్తున్న కోట్లాది వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఐసీఐసీఐ లొంబార్డ్ ఈ వివరాలను తన తాజా బ్లాగ్ పోస్టులో తెలియజేసింది. వాహనం రూపకల్పన చేయని అధిక ఎథనాల్-పెట్రోల్ మిశ్రమాన్ని ఉపయోగించడం అసముచిత వినియోగం లేదా నిర్లక్ష్యంగా పరిగణించే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఈ20 ఇంధనం కారణంగా జరిగిన నష్టాలకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లు పరిశీలనకు గురవడంతోపాటు తిరస్కరణకు కూడా గురయ్యే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
కాలక్రమేణా పేరుకుపోయే నష్టాలకు వర్తించదు..
ఏప్రిల్ 2025 నుంచి ఈ20 పెట్రోల్ దేశవ్యాప్తంగా ప్రామాణిక ఇంధనంగా మారింది. ప్రస్తుతం వినియోగదారులు ఈ10 పెట్రోల్‌ను కొనుగోలు చేసే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా ఉన్న ఎక్స్‌పీ100 స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉన్నా, దాని ధర లీటరుకు సుమారు రూ.160 ఉండటంతోపాటు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. దీంతో వాహనదారులు తప్పనిసరిగా ఈ20నే ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వారిని నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ20 ఇంధనం వాడటం వల్ల బీమా పాలసీ రద్దు కాదని స్పష్టం చేసినప్పటికీ, ఈ20 కారణంగా జరిగిన ప్రతి నష్టానికి క్లెయిమ్ ఆమోదం లభిస్తుందని అర్థం కాదని ఐసీఐసీఐ తెలిపింది. సాధారణ మోటార్ బీమా పాలసీలు కన్సీక్వెన్షియల్ డ్యామేజ్ ను కవర్ చేయవని పేర్కొంది. అంటే ప్రమాదం వంటి ఒక్కసారిగా జరిగే ఘటనల వల్ల కాకుండా, కాలక్రమేణా పేరుకుపోయే నష్టాలకు బీమా వర్తించదని వివరించింది.
ఈ20 అసలు సమస్య ఇదే..
ఈ20లో ఎథనాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల గాలిలోని తేమను ఆకర్షించే లక్షణం ఉంటుంది. దీని కారణంగా ఫ్యూయల్ ట్యాంకులు, పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్ వంటి భాగాల్లో తుప్పు, క్షీణత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక్కసారిగా కాకుండా దీర్ఘకాలంలో జరుగుతుంది. అందువల్ల దీనిని కన్సీక్వెన్షియల్ డ్యామేజ్‌గా పరిగణించే అవకాశం ఉంది. వాహనదారులు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్లు తీసుకుంటే రక్షణ లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఐసీఐసీఐ లొంబార్డ్ తెలిపిన ప్రకారం చాలా ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌లు నీరు ఇంజిన్‌లోకి చేరడం లేదా ఆయిల్ లీకేజీ వంటి సమస్యల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇంధనం వల్ల కలిగే రసాయనిక తుప్పు లేదా క్షీణతను అవి సాధారణంగా కవర్ చేయవు.
ఈ25 వస్తే మరింత ఇబ్బంది..
భారత ప్రభుత్వం బీఎస్6 ఫేజ్-2 ఉద్గార ప్రమాణాలతోపాటు ఏప్రిల్ 2023 నుంచి కొత్త వాహనాలకు ఈ20 అనుకూలతను తప్పనిసరి చేసింది. అయితే ఈ నిబంధన అమల్లోకి వచ్చి కేవలం మూడేళ్లకుపైగా మాత్రమే కావడంతో ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో గణనీయమైన భాగం ఈ20 ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంచనా. దీంతో లక్షలాది కార్లు, బైకులు, ఇతర వాహనాలు ఈ20 వల్ల సంభవించే దీర్ఘకాలిక నష్టాల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాంటి నష్టాలకు బీమా క్లెయిమ్‌లను తిరస్కరిస్తే వాహనదారులకు భవిష్యత్తులో పరిమిత అవకాశాలే మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడితో సమస్య ముగియడం లేదు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎథనాల్ మిశ్రమ స్థాయిని మరింత పెంచే సంకేతాలు పలుమార్లు ఇచ్చింది. తక్కువ కాలంలోనే ఈ25 మిశ్రమాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఈ25 ఇంధనం ఈ20, ఈ10 వాహనాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేయాలని బాధ్యత అప్పగించారు. ఒకవేళ రాబోయే నెలల్లో ఈ25 ప్రామాణిక ఇంధనంగా మారితే, ప్రస్తుతం ఈ20-అనుకూల వాహనాలను ఉపయోగిస్తున్న యజమానులు కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?
ఆగస్టు 18, 2026

E20 Petrol | పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎకనామిస్ట్ నాగేశ్వరన్
ఆగస్టు 17, 2026

E20 Petrol | ఈ20 పెట్రోల్‌తోనే మైలేజీ తగ్గదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



