Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
Hero MotoCorp | దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కంపెనీ విడా బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Technology | Published On Aug 8, 2026, 4.54 pm IST
Hero MotoCorp | దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కంపెనీ విడా బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం కంపెనీ యూబెక్స్ (UBEX), వీఎక్స్‌జెడ్ (VXZ) అనే రెండు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తోంది. ఇవి ప్రస్తుతం ఉన్న విడా స్కూటర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడకుండా, పూర్తిగా మోటార్‌సైకిళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఆర్కిటెక్చర్లని హీరో మోటోకార్ప్ స్పష్టం చేసింది. హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసల్య నందకుమార్ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయని తెలిపారు. అలాగే కంపెనీ సీఈఓ హర్షవర్ధన్ చిటాలే కూడా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని, రాబోయే నెలల్లో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
రెండు ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి..
ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లను తొలిసారిగా ఈఐసీఎంఏ 2025 ప్రదర్శనలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. యూబెక్స్ (UBEX) ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీట్-నేకెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు వీఎక్స్‌జెడ్ (VXZ) ప్లాట్‌ఫామ్‌ను అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్ భాగస్వామ్యంతో రూపొందిస్తున్నారు. ఇది అడ్వెంచర్ రైడింగ్‌ను లక్ష్యంగా చేసుకుని అధిక పనితీరు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా రానుంది. ఈ మోడల్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్లను ఇప్పటికే భారత్‌లో దాఖలు చేశారు. విడా స్కూటర్ అభివృద్ధి సమయంలో పొందిన అనుభవాన్ని ఉపయోగించుకున్నప్పటికీ, యూబెక్స్, వీఎక్స్‌జెడ్ ప్లాట్‌ఫామ్‌లు పూర్తిగా కొత్తవేనని కౌసల్య నందకుమార్ స్పష్టం చేశారు. మోటార్‌సైకిల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన పనితీరు, రైడబిలిటీ, గ్రేడబిలిటీ, ఎక్కువ రేంజ్ అందించేలా ఈ ప్లాట్‌ఫామ్‌లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని తెలిపారు.
లాంచింగ్ ఎప్పుడు..
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రాజెక్టుతోపాటు హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారాన్ని కూడా వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ, ఎఫ్‌వై27 నాటికి ప్రతి నెల విడా స్కూటర్ల ఉత్పత్తిని 45వేల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎఫ్‌వై26 చివరినాటికి ఈ సామర్థ్యం నెలకు 15వేల యూనిట్లు మాత్రమే ఉండనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో హీరో మోటోకార్ప్ మరింత దూకుడుగా ముందుకు సాగనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను 2027 జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hero MotoCorp | ఏథర్‌లో హీరో మోటోకార్ప్ వాటా పెంపు.. రూ.1,758 కోట్ల పెట్టుబడి..
ఆగస్టు 28, 2026

Avor EX | మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఏఐ ఫీచర్లతో లాంచ్.. రూ.799కే బుకింగ్..
జులై 29, 2026

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
జులై 15, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



