Hero MotoCorp | ఏథర్‌లో హీరో మోటోకార్ప్ వాటా పెంపు.. రూ.1,758 కోట్ల పెట్టుబడి..
Hero MotoCorp | ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ సంస్థ తన వాటాను మరింత పెంచుకోనుంది. ఇప్పటికే ఉన్న వాటాదారు నుంచి అదనపు షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.1,758 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఆమోదం తెలిపింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ వాటా ప్రస్తుతం ఉన్న 29.88 నుంచి 32.8 శాతానికి పెరగనుంది.
Hero MotoCorp | ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ సంస్థ తన వాటాను మరింత పెంచుకోనుంది. ఇప్పటికే ఉన్న వాటాదారు నుంచి అదనపు షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.1,758 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఆమోదం తెలిపింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ వాటా ప్రస్తుతం ఉన్న 29.88 నుంచి 32.8 శాతానికి పెరగనుంది. పూర్తిగా డైల్యూటెడ్ ప్రాతిపదికన ఈ వాటా పెరుగుదల ఉండనుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ కీలక సంస్థగా కొనసాగుతున్న నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తాజా పెట్టుబడికి ప్రాధాన్యం ఏర్పడింది. ఏథర్‌లో తన వాటాను పెంచుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఏర్పడింది.
భారీగా పెరిగిన ఏథర్ ఎనర్జీ షేర్ల ధర..
హీరో మోటోకార్ప్ తాజా పెట్టుబడి ప్రకటన ప్రభావం ఏథర్ ఎనర్జీ షేర్లపై వెంటనే కనిపించింది. శుక్రవారం ఏథర్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 5 శాతానికి పైగా పెరిగాయి. సుమారు 1.19 కోట్ల షేర్లు ఒక్కో షేరుకు రూ.1,480 చొప్పున బ్లాక్ డీల్‌లో చేతులు మారగా, ఈ లావాదేవీ విలువ దాదాపు రూ.1,758 కోట్లుగా నమోదైంది. దీంతో ఏథర్ మార్కెట్ విలువ రూ.62వేల కోట్లకు పైగా చేరింది.
పెరిగిన ఆదాయం..
హీరో మోటోకార్ప్ తాజా పెట్టుబడికి కొద్ది రోజుల ముందే ఏథర్ ఎనర్జీ రూ.960 కోట్ల విలువైన కన్వర్టిబుల్ వారెంట్లను హీరోకు కేటాయించింది. జూన్ త్రైమాసికంలో ఏథర్ నికర నష్టం ఏడాది క్రితం ఉన్న రూ.178 కోట్ల నుంచి రూ.51 కోట్లకు తగ్గగా, మొత్తం ఆదాయం 87.2 శాతం పెరిగి రూ.1,260 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఏథర్ 83,173 యూనిట్లను విక్రయించింది. బలమైన డిమాండ్, ముఖ్యంగా రిట్జా స్కూటర్‌కు వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఏథర్ వృద్ధిపై హీరో మోటోకార్ప్ మరింత నమ్మకంతో పెట్టుబడులు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Ather Konarc | రూ.99,999కే ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 200 కి.మీ రేంజ్..
ఆగస్టు 29, 2026

Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
ఆగస్టు 8, 2026

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
జులై 15, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



