ASUS VM670KA AiO | తొలి ఏఐ ఆలిన్ వన్ పీసీని లాంచ్ చేసిన అసుస్.. జీరో డౌన్ పేమెంట్‌తో కొనవచ్చు..
ASUS VM670KA AiO | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ నూతనంగా ఓ ఆలిన్ వన్ పీసీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఏఐవో వీఎం670కేఏ పేరిట ఈ పీసీని మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Dec 23, 2025, 9.18 pm IST
ASUS VM670KA AiO | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ నూతనంగా ఓ ఆలిన్ వన్ పీసీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఏఐవో వీఎం670కేఏ పేరిట ఈ పీసీని మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే అనేక ఏఐ సదుపాయాలు కూడా ఉన్నాయి. దేశంలోనే తొలి ఏఐ ఆలిన్ వన్ పీసీ ఇదని అసుస్ సంస్థ తెలియజేసింది. ఇందులో కో పైలట్ ప్లస్ ఏఐ సదుపాయాలను అందిస్తున్నారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ డెస్క్‌టాప్‌ను ఆఫీస్, ఇల్లు ఎక్కడైనా వాడుకోవచ్చు. సీపీయూ ఉండదు. మానిటర్ వెనుకే మొత్తం సెటప్ ఉంటుంది. ఆలిన్ వన్ పీసీ కనుక చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇల్లు లేదా ప్రొఫెషనల్ అవసరాల కోసం ఈ డెస్క్‌టాప్ పీసీ ఎంతో ఉపయోగపడుతుందని అసుస్ తెలియజేసింది. ఇందులో అనేక ఏఐ ఫీచర్లను వాడుకోవచ్చని తెలిపింది.
27 ఇంచుల డిస్‌ప్లే..
ఈ పీసీలో ఏఎండీ రైజెన్ ఏఐ 7350 ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే ఏఐ కోసం డెడికేటెడ్ ఎన్‌పీయూ కూడా ఉంది. దీని సహాయంతో ఏఐలో అద్భుతమైన ప్రదర్శన పొందవచ్చు. మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఈ పీసీని తీర్చిదిద్దారు. ఇందులో 27 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లే లభిస్తుంది. దీనికి ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే దీనికి టచ్ ఇన్‌పుట్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో 5వాట్ల డ్యుయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఇచ్చారు. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ కూడా ఉంది. కనుక ఆడియో క్వాలిటీగా ఉంటుంది.
16జీబీ ర్యామ్..
వీఎం670కేఏ ఆలిన్ వన్ పీసీలో 16జీబీ డీడీఆర్5 ర్యామ్‌ను అందిస్తున్నారు. ర్యామ్‌కు రెండు స్లాట్లను ఇచ్చారు. కనుక కావాలనుకుంటే పెంచుకోవచ్చు. 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఎస్ఎస్‌డీ ద్వారా ఈ సదుపాయం ఉంది. అలాగే యూఎస్‌బీ టైప్ ఎ, టైప్ సి పోర్టులతోపాటు హెచ్‌డీఎంఐ పోర్టును కూడా ఇచ్చారు. వైఫై 7 సదుపాయం ఉంది. కనుక వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్‌ను కూడా ఇచ్చారు. 5 మెగాపిక్సల్ వెబ్ కెమెరా ఉంది. ప్రైవసీ షటర్ సదుపాయం కూడా ఉంది. విండోస్ హలోకు సపోర్ట్ లభిస్తుంది. బ్లూటూత్ 5.4 ను ఇచ్చారు. వైట్ కలర్ ఆప్షన్‌లో ఈ పీసీని లాంచ్ చేశారు. దీనికి 1 ఏడాది వరకు ఆన్‌సైట్ సర్వీస్ వారంటీ లభిస్తుంది.
ధర ఎంతంటే..?
అసుస్ వీఎం670కేఏ ఆలిన్ వన్ పీసీని రూ.1,09,990 ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ పీసీని అసుస్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్‌తోపాటు అసుస్ ఇ-షాప్, అసుస్ హైబ్రిడ్ స్టోర్స్, ఆర్‌వోజీ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ పీసీపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తుంది. అలాగే జీరో డౌన్ పేమెంట్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.4583 ఈఎంఐకి ఈ పీసీని కొనవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

Ambrane Reneo | టైప్-సి ఛార్జింగ్‌తో ఆంబ్రేన్ కొత్త బ్యాటరీలు.. ఒక్కటి 100 సాధారణ బ్యాటరీలకు సమానం!
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



