ASUS Pad T3201 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే.. కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసిన అసుస్..
ASUS Pad T3201 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ ట్యాబ్లెట్ మార్కెట్‌లో మళ్లీ అడుగు పెట్టింది. కొత్తగా అసుస్ ప్యాడ్ టి3201 పేరుతో ఓ నూతన ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మల్టీమీడియా ఎంటర్‌టెయిన్‌మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్ ఫ్లోలకు ఈ ట్యాబ్ అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
Technology | Published On Jul 30, 2026, 4.50 pm IST
ASUS Pad T3201 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ ట్యాబ్లెట్ మార్కెట్‌లో మళ్లీ అడుగు పెట్టింది. కొత్తగా అసుస్ ప్యాడ్ టి3201 పేరుతో ఓ నూతన ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మల్టీమీడియా ఎంటర్‌టెయిన్‌మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్ ఫ్లోలకు ఈ ట్యాబ్ అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఇది చాలా తక్కువ బరువు ఉండడమే కాకుండా స్లిమ్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. అలాగే శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఇందులో అందించారు. ఈ ట్యాబ్ డిజైన్ పరంగా కేవలం 6.5 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండి అత్యంత స్లీక్‌గా ఉంటుంది. బరువు 523 గ్రాములు మాత్రమే కావడం వల్ల ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు.
ప్రయాణాల్లో సులభంగా..
ఈ ట్యాబ్‌ను ఫైబర్ గ్లాస్ రియర్ ప్యానెల్‌తో రూపొందించారు. రోజువారీ ప్రయాణాలు, ఆఫీస్, రిమోట్ వర్క్ కోసం సులభంగా వెంట తీసుకెళ్లేలా సౌకర్యాన్ని అందిస్తుంది. బాక్స్‌లోనే ఓ ప్రొటెక్టివ్ ఫోలియో కేస్‌ను ఇచ్చారు. ఇది ట్యాబ్‌పై స్క్రాచ్‌లు, చిన్నపాటి గీతలు పడకుండా అడ్డుకుంటుంది. అలాగే కిందపడి పగలడం నుంచి రక్షణ అందిస్తుంది. ఈ ట్యాబ్ నాలుగు రకాల వ్యూయింగ్ యాంగిల్స్‌ను అందిస్తుంది. అందువల్ల స్టాండ్ రూపంలోనూ ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్‌లో 12.2 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ డిస్‌ప్లేను దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇది 2.8కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండి అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. అలాగే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చినందున ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్నందున వీడియోలు అద్బుతమైన రిజల్యూషన్‌తో కనిపిస్తాయి. అలాగే కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు టీయూవీ లో ఫ్లికర్, లో బ్లూలైట్ వంటి ఫీచర్లను ఇచ్చారు.
9000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్‌లో నాలుగు స్పీకర్లు కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్‌ను అందించారు. ఇది డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను కలిగి ఉంది. అందువల్ల అద్భుతమైన 360 డిగ్రీ సినిమాటిక్ సౌండ్ ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. సినిమాలు, మ్యూజిక్, గేమింగ్ సమయంలో మెరుగైన ఆడియో క్వాలిటీ లభిస్తుంది. ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. మల్టీ టాస్కింగ్ పనులను ఇందులో వేగంగా పూర్తి చేయవచ్చు. దీంట్లో 9000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. బాక్స్‌లో 45 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను ఇస్తున్నారు. దీంతో ట్యాబ్‌ను 30 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు చార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ను ఇవ్వగా, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అందుబాటులో ఉంది. యాప్ నుంచి బయటకు రాకుండానే స్క్రీన్‌పై ఉన్న కంటెంట్‌ను హైలైట్ చేసి వెంటనే సెర్చ్ చేసే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది.
ఇతర డివైస్‌లకు కనెక్టివిటీ..
ఈ ట్యాబ్ కు గ్లైడ్ ఎక్స్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల విండోస్, మాక్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లను దీనికి సులభంగా యూఎస్‌బీ టైప్ సి లేదా వైఫై ద్వారా కనెక్ట్ చేయవచ్చు. దీంతో ఫైల్ షేరింగ్, కో వర్క్ స్పేస్ వంటి పనులను పూర్తి చేయవచ్చు. అసుస్ పెన్ 2.0 స్టైలస్‌ను, బ్లూటూత్ కీబోర్డును ఈ ట్యాబ్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీంతో నోట్స్ రాసుకోవడం, స్కెచ్‌లు వేయడం వంటి పనులు సులభతరం అవుతాయి. ఈ ట్యాబ్‌లను 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. వెనుక వైపు 13, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
ధర ఎంతంటే..
అసుస్ ప్యాడ్ టి3201 ట్యాబ్ కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.45,990 ఉండగా, 8జీబీ, 256జీబీ మోడల్ ధరను రూ.49,990గా నిర్ణయించారు. ఈ ట్యాబ్‌ను ఆగస్టు 6 నుంచి అసుస్ రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. కస్టమర్లకు అసుస్ ఈజీ పే ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను కూడా అందిస్తున్నారు. అలాగే 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నెలకు రూ.3,833 ఈఎంఐకి ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?






