ASUS ExpertBook | వ్యాపారులు, ప్రొఫెషనల్స్ కోసం అసుస్ అల్ట్రా సిరీస్ ల్యాప్ టాప్‌లు.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..
ASUS ExpertBook | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ బిజినెస్ మోడల్ ల్యాప్‌టాప్‌లను ఎక్స్‌పర్టబుల్ అల్ట్రా సిరీస్‌లో భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్‌పర్ట్‌బుక్ పి సిరీస్‌ను ప్రవేశపెట్టింది. బిల్ట్ ఫర్ బ్రిలియన్స్, వర్రీ ఫ్రీ బిజినెస్ అనే కాన్సెప్టులతో ఈ ప్రొడక్ట్‌లను ఆ సంస్థ లాంచ్ చేసింది.
Technology | Published On Apr 24, 2026, 11.57 am IST
ASUS ExpertBook | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ బిజినెస్ మోడల్ ల్యాప్‌టాప్‌లను ఎక్స్‌పర్టబుల్ అల్ట్రా సిరీస్‌లో భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్‌పర్ట్‌బుక్ పి సిరీస్‌ను ప్రవేశపెట్టింది. బిల్ట్ ఫర్ బ్రిలియన్స్, వర్రీ ఫ్రీ బిజినెస్ అనే కాన్సెప్టులతో ఈ ప్రొడక్ట్‌లను ఆ సంస్థ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎంజర్‌ప్రైజ్ యూజర్లు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, సీఎక్స్‌వోలు వంటి ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌లను అసుస్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా రిలీజ్ అయిన అసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల డిస్‌ప్లే, మెగ్నిషియం-అల్యూమినియం అలాయ్ చాసిస్, 9హెచ్ నానో సెరామిక్ కోటింగ్, స్క్రాచ్ రెసిస్టెంట్ ప్యానెల్, దృఢమైన బిల్డ్ క్వాలిటీ, ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌లు, అసుస్ ఎక్స్‌పర్ట్ కూల్ ప్రొ థర్మల్ డిజైన్ వంటి ఫీచర్లను ఇచ్చారు.
26 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
ఇక ఈ ల్యాప్‌టాప్‌లు కేవలం 0.99 కిలోల బరువుతో అత్యంత స్లీక్‌గా 10.9 మిల్లీమీటర్ల మందంతో డిజైన్ అయ్యాయి. అందువల్ల ప్రయాణాల్లోనూ చాలా సులభంగా వీటిని తీసుకెళ్లవచ్చు. వీటిల్లో ఇంటెల్ ఆర్క్ బి390 గ్రాఫిక్స్‌ను ఇచ్చారు. ఏఐ పనులకు అనుగుణంగా తీర్చిదిద్దినందువల్ల ఏఐ టాస్క్‌లను వీటిల్లో చాలా సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఇక 64జీబీ వరకు ర్యామ్, 2టీబీ వరకు స్టోరేజ్‌ను ఇచ్చారు. 14 ఇంచుల ఓలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 3కె రిజల్యూషన్, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, హెచ్‌డీఆర్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, యాంటీ గ్లేర్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కూడా అందించారు. డాల్బీ ఆట్మోస్‌తో 6 స్పీకర్ సిస్టమ్, ఏఐ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్లు, 70 వాట్ అవర్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్‌లు 26 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. 90 వాట్ యూఎస్‌బీ-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.
దృఢమైన బిల్డ్ క్వాలిటీ..
థండర్‌బోల్ట్ 4, యూఎస్‌బీ-ఎ, హెచ్‌డీఎంఐ 2.1, వై-ఫై 7, బ్లూటూత్ 6.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అసుస్ ఏఐ ఎక్స్‌పర్ట్‌మీట్ ఫీచర్ ద్వారా రియల్‌టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, మీటింగ్ సమ్మరీలు పొందవచ్చు. ఎక్స్‌పర్ట్ గార్డియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌లో ఎన్‌ఐఎస్‌టీ కంప్లయన్స్, మైక్రోసాఫ్ట్ ప్లూటాన్, టీపీఎమ్ 2.0, ఫింగర్‌ప్రింట్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిల్-స్టీడ్-810హెచ్ స్టాండర్డ్స్ ప్రకారం దృఢమైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉన్నాయి. ఈ సిరీస్‌లో 14, 16 ఇంచుల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. పీ5లో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లు, పీ3లో సిరీస్ 2 ప్రాసెసర్లు ఉంటాయి. రెండింటిలోనూ 64జీబి డీడీఆర్5 ర్యామ్, డ్యుయల్ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఓలెడ్, ఐపీఎస్ డిస్‌ప్లేలు, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఏఐ ఎక్స్‌పర్ట్‌మీట్, నాయిస్ క్యాన్సిలేషన్, వెబ్‌క్యామ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి ఫీచర్లను కూడా ఇచ్చారు.
ధర వివరాలు..
దేశంలో 15,500 పైగా పిన్ కోడ్లలో ఆన్‌సైట్ సర్వీస్, 80 దేశాల్లో ఇంటర్నేషనల్ వారంటీ, 5 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి సేవలను అసుస్ అందిస్తోంది. ఇక ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా సిరీస్ ల్యాప్ టాప్‌ల ప్రారంభ ధర రూ.2,39,990 ఉండగా, పీ3 సిరీస్ రూ.94,990 నుంచి, పీ5 సిరీస్ రూ.2,14,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ ఆఫర్లను కూడా ఇస్తున్నారు. ఏప్రిల్ 29 నుంచి మార్కెట్‌లో లభ్యం కానున్నాయి.
సంబంధిత వార్తలు

ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
ఆగస్టు 21, 2026

ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్‌బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
ఆగస్టు 6, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ●Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి
- ●Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..
- ●Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..
- ●Trisha | పొలిటికల్ లీడర్‌గా త్రిష - రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో...

Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి

Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..



