EHS | ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డుకు సభ్యులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..
EHS | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భద్రత కల్పిస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌ను తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త బోర్డు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొనసాగుతారు.
EHS | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భద్రత కల్పిస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌ను తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త బోర్డు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొనసాగుతారు. ఆర్థిక, వైద్యారోగ్య, విద్య, హోం, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితరశాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అలాగే, వైద్య విద్య సంచాలకులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రతినిధులను సైతం బోర్డులో భాగస్వాములను చేసింది. బోర్డులో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులకు సైతం చోటు కల్పించారు. టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూ, టీఎస్ యూటీఎఫ్ వంటి ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సభ్యులుగా నియాకమయ్యారు. ప్రభుత్వం త్వరలో బోర్డు సమావేశం నిర్వహించి ఈహెచ్ఎస్ అమలు మార్గదర్శకాలను సమీక్షించనుంది. హెల్త్ కార్డుల జారీ విధానం సహా పథకం అమలులోని కీలక ప్రక్రియలపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు. పథకం అమలులో సమన్వయం కోసం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌తో కలిసి పని చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హెల్త్ స్కీమ్ అమలును మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
బోర్డు ఆఫ్ ట్రస్టీస్
చైర్‌పర్సన్, భుత్వ ప్రధాన కార్యదర్శి
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ కార్యదర్శి
వైద్య, ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ కార్యదర్శి
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి / కార్యదర్శి
హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి / కార్యదర్శి
సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి / కార్యదర్శి
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ
పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ
వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ
కార్మిక, ఉపాధి, శిక్షణ-ఫ్యాక్టరీస్ శాఖ కార్యదర్శి
మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి
న్యాయ శాఖ కార్యదర్శి
ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కమిషనర్
వైద్య విద్య సంచాలకులు
సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి
ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ముఖ్య కార్యనిర్వహణ అధికారి-సభ్య కార్యదర్శి
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
మారం జగదీశ్వర్ – అధ్యక్షుడు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టిఎన్‌జీవో)
ఎలూరి శ్రీనివాసరావు – అధ్యక్షుడు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టిజీవో)
దామోదర్ రెడ్డి – అధ్యక్షుడు, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్రం
చావా రవి – తెలంగాణ స్టేట్ యూటీఎఫ్ (టిఎస్ యూటీఎఫ్)
గిరి శ్రీనివాస్ రెడ్డి – తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్
సదానందం గౌడ్ – స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ టీఎస్)
రవీందర్ రెడ్డి – టీచర్స్ ఎంప్లాయీస్ అండ్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఆర్‌ఈఎస్ఏ)
లచ్చి రెడ్డి – డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్
సైదులు – స్టేట్ ఫారెస్ట్ ట్రాన్స్‌ఫర్ (ఎస్‌టీఎఫ్)
దాస్యా నాయక్ – తెలంగాణ క్లాస్–ఫోర్ ఉద్యోగుల సంఘం
పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు
వెంకట్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
కృష్ణమూర్తి – జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్
ఉమా దేవి – చైర్‌పర్సన్, తెలంగాణ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
- ●Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!
- ●Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు
- ●TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!
- ●ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్
- ●Apollo Hospitals FEMA Violation | అపోలో హాస్పిటల్స్‌పై 'ఫెమా' కొరడా.. రూ. 2400 కోట్ల నిబంధనల ఉల్లంఘన, డైరెక్టర్లకు భారీ జరిమానా!

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!

Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు

TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!



