త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు

MLC Dasoju Sravan | రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టును విధ్వంసం చేశార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధ‌వారం ఆయ‌న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు, రాష్ట్ర పాలన, కేంద్రంతో సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు.

P

Hyderabad | Published On Jun 17, 2026, 6.57 pm IST

MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు
Advertisement

MLC Dasoju Sravan | రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టును విధ్వంసం చేశార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధ‌వారం ఆయ‌న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు, రాష్ట్ర పాలన, కేంద్రంతో సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను 25 శాతం పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మెట్రో సీఎఫ్ఓ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా మలిచారని, ఆ అధికారి అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగిందని విమ‌ర్శించారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును రద్దు చేశారని మండిప‌డ్డారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైల్‌ను రేవంత్‌రెడ్డి ర‌ద్దు చేశార‌న్నారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త మెట్రో ప్రతిపాదనను ప్ర‌స్తావిస్తూ.. ప్రభుత్వం కుటుంబ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లేఖ రాశారా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రభావాలపై వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్రభావంతో రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డికి సలహాదారులు ఎవరు? అంటూ నిల‌దీశారు. ప్రభుత్వ పరిపాలనపై విమర్శలు చేస్తూ “రేవంత్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదు” అని వ్యాఖ్యానించారు. అధికార లేఖల విషయంలో “సీఎం ఓపెన్ లెటర్ రాయడం ఏంటి?, సీఎం అఫీషియల్ లెటర్ రాయాలి” అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడానికి రేవంత్ రెడ్డికి దమ్ము లేదా ప్రశ్నించారు.

అలాగే, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ ఎందుకు రాయడం లేదని నిలదీశారు. ఐఆర్‌ఎఫ్‌సీ ఒప్పందంపై కూడా ఆయన విమర్శలు చేస్తూ ప్రభుత్వం నుంచి సంస్థలకు నిధుల తరలింపుపై ఆరోపణలు చేశారు. “ఐఆర్ఎఫ్‌సీ నుంచి ఒక్క రూపాయి రాలేదని రేవంత్ రెడ్డి రుడాలీ ఏడుపులు ఏడుస్తున్నార‌న్నారు. మెట్రో టేకోవర్ అంశంపై కేబినెట్ నిర్ణయం జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వం 280 ఎకరాల భూమి విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 280 ఎకరాలు మెట్రో రైల్ కోస‌మే ఉంచుతారా? బినామీలకు కట్టబెడతారా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్ల నిర్వహణ, ఫేజ్–2 ప్రాజెక్టుపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా తరహాలో పాలన సాగిస్తోందని విమర్శించారు.

 

Advertisement
Advertisement