Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..
Apple Pay | ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా భారత్‌లో ఉన్న వినియోగదారుల కోసం ప్రత్యేకంగా యాపిల్ పే సేవలను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సేవలను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమవుతుందని రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది.
Technology | Published On Sep 19, 2026, 9.44 am IST
Apple Pay | ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా భారత్‌లో ఉన్న వినియోగదారుల కోసం ప్రత్యేకంగా యాపిల్ పే సేవలను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సేవలను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమవుతుందని రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఐఫోన్ యూజర్లు చెల్లింపులు చేసేందుకు గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లపై ఆధారపడాల్సిన పని ఉండదు. యాపిల్ నేటివ్ చెల్లింపుల యాప్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సెక్యూరిటీ అధిక స్థాయిలో లభిస్తుంది. అయితే ముందుగా క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపు సేవలను యాపిల్ అందుబాటులోకి తేనుంది. ఇందుకు గాను యాక్సిస్ బ్యాంకుతో ఆ సంస్థ ఇప్పటికే భాగస్వామ్యం అయింది. దీంతో త్వరలోనే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉన్న ఐఫోన్ యూజర్లు యాపిల్ పే సేవలను ఉపయోగించుకోవచ్చు.
కార్డు వెంట లేకున్నా చెల్లింపులు..
యాపిల్ పేలో అందించనున్న ఈ చెల్లింపుల సదుపాయం ద్వారా కాంటాక్ట్ లెస్ విధానంలోనూ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ముందుగానే కార్డు వివరాలను భద్ర పరుచుకోవడం ద్వారా కార్డు వెంట లేకున్నా యాప్ ద్వారా తక్షణమే పేమెంట్లు చేయవచ్చు. ఫోన్‌లో ఉండే ఎన్ఎఫ్‌సీ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే యాపిల్ ఈ తరహా సేవలను అందిస్తుండగా, భారత్‌లోనూ ఇకపై ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో యాపిల్ పే ను లాంచ్ చేసేందుకు గాను యాపిల్ సంస్థ యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం అవగా, అతి త్వరలోనే సంయుక్త ప్లాట్‌ఫామ్‌ను ఈ సంస్థలు లాంచ్ చేయనున్నాయి. ఇక ఆర్‌బీఐ తెలిపిన ప్రకారం జూలై చివరి వరకు యాక్సిస్ బ్యాంకు వద్ద సుమారుగా 1.626 కోట్ల యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వినియోగదారుల్లో ఐఫోన్ యూజర్లకు త్వరలో యాపిల్ పే సదుపాయం అందుబాటులోకి రానుంది.
టోకెన్ రూపంలో కార్డుల వివరాలు..
కాగా క్రెడిట్ కార్డులన జారీ చేసే విషయంలో దేశంలో అన్నింటి కన్నా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అగ్ర స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు నాలుగో స్థానంలో ఉంది. భవిష్యత్తులో ఇతర బ్యాంకులతోనూ యాపిల్ ఈ తరహా ఒప్పందాలు చేసుకుని చెల్లింపు సేవలను అందించనున్నట్లు సమాచారం. అలాగే యూపీఐ క్రెడిట్ కార్డులు, యూపీఐ చెల్లింపులకు కూడా త్వరలోనే అనుమతి లభిస్తోందని తెలుస్తోంది. భారత్‌లో యాపిల్ పే అందుబాటులోకి వస్తే ఐఫోన్ వినియోగదారులు తమ అర్హత కలిగిన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్‌లో యాడ్ చేయవచ్చు. కార్డు వివరాలు సురక్షితంగా సేవ్ అవుతాయి. అయితే అవి టోకెన్ల రూపంలో వాలెట్‌లో స్టోర్ అవుతాయి. అందువల్ల డేటా లీక్ అయినప్పటికీ హ్యాకర్లకు కార్డు సమాచారం తెలియదు. కేవలం టోకెన్లు మాత్రమే కనిపిస్తాయి. ఇలా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. వాలెట్‌లో టోకెన్ రూపంలో సేవ్ అయిన కార్డు ద్వారా వినియోగదారులు సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఎన్ఎఫ్‌సీ సదుపాయం లేదా కాంటాక్ట్ లెస్ చెల్లింపు మెషిన్‌ల వద్ద పోన్‌ను ట్యాప్ చేస్తే చాలు, వెంటనే పేమెంట్ పూర్తవుతుంది. దీంతో మరో పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.
యూపీఐకి భిన్నం..
యాపిల్ పే విధానం యూపీఐకి కాస్త భిన్నంగా ఉంటుంది. యూపీఐలో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి వాడుకోవాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్, ట్యాప్ అండ్ పే వంటి విధానాల్లో చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న యాపిల్ పే ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు యూపీఐ మాదిరిగా సాధ్యమవుతాయి. పదే పదే కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సెక్యూరిటీ భారీ స్థాయిలో ఉంటుంది. ఇక భారత్‌లో డిజిటల్ చెల్లింపుల పరిమాణంలో యూపీఐ వాటా 84 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యాపిల్ పేలో మాత్రం బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయకుండా కేవలం బ్యాంకు క్రెడిట్ కార్డులను మాత్రమే వాలెట్‌లో యాడ్ చేసి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాగా టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే భారత్‌లో గూగుల్ పే పేరిట చెల్లింపు సేవలను అందిస్తుండగా, అందులో యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి భిన్న విధానాల్లో చెల్లింపు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ పే అందుబాటులోకి వస్తే క్రెడిట్ కార్డు చెల్లింపు విభాగంలో గూగుల్ పేకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే యూపీఐ చెల్లింపులను కూడా యాపిల్ పేలో ప్రవేశపెడతారా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది.
సంబంధిత వార్తలు

iPhone | సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా..? ఈ 5 విషయాలను తప్పక చెక్ చేయండి..
సెప్టెంబర్ 5, 2026

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?
ఆగస్టు 1, 2026

Banking | మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల పేరిట బ్యాంకుల భారీ వసూళ్లు.. హెచ్‌డీఎఫ్‌సీ టాప్..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత
- ●TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
- ●MMTS | ఖైరతాబాద్ గణేశ్.. భక్తులకు అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
- ●Donald Trump | ట్రంప్ సంచలన ప్రకటన.. వైట్ హౌస్‌లో ఆ వార్తాసంస్థలపై నిషేధం
- ●Shamshabad | కల్వర్టును ఢీకొట్టిన కారు.. స్పాట్లోనే నలుగురు మృతి
- ●TGSRTC Union Elections | పదేండ్ల తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు.. ప్రచారం షురూ

Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత

TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!

MMTS | ఖైరతాబాద్ గణేశ్.. భక్తులకు అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు

Donald Trump | ట్రంప్ సంచలన ప్రకటన.. వైట్ హౌస్‌లో ఆ వార్తాసంస్థలపై నిషేధం



