యాపిల్ వాచ్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్.. ఇకపై హైబీపీ ఉంటే మీ వాచ్ చెప్పేస్తుంది..
Technology | Published On Dec 6, 2025, 6.19 am IST
తన యూజర్లకు అద్భుతమైన ఫీచర్లను అందించడంలో టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఎప్పటికప్పుడు వినూత్నమైన ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే మరో బ్రహ్మాండమైన ఫీచర్‌ను యాపిల్ తన వాచ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ను ప్రత్యేకంగా భారతీయ యూజర్ల కోసం లాంచ్ చేసినట్లు యాపిల్ తెలియజేసింది. భారత్‌లోని యాపిల్ వాచ్ యూజర్లకు ప్రస్తుతం కొత్తగా హైపర్ టెన్షన్ నోటిఫికేషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే అమెరికా సహా పలు ఇతర దేశాల యూజర్లకు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఇండియన్ యూజర్లకు కూడా లభిస్తుందని యాపిల్ తెలిపింది. దీని వల్ల యాపిల్ వాచ్ యూజర్లు తమ బీపీని ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. ఒక వేళ హైబీపీ ఉంటే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవచ్చు.
యాపిల్ వాచ్‌లో అందుబాటులో ఉన్న హైపర్ టెన్షన్ నోటిఫికేషన్ ఫీచర్ ను పొందాలంటే యాపిల్ వాచ్‌ను వాచ్ ఓఎస్ 26కు అప్‌డేట్ చేసి ఉండాలి. అలాగే ఐఫోన్ 11 లేదా ఆ తరువాత వచ్చిన ఫోన్‌ను వాడుతుండాలి. అందులో ఐఓఎస్ 26 ఓఎస్ ఉండాలి. ఇక యాపిల్ వాచ్ సిరీస్ 9 లేదా ఆ తరువాత వచ్చిన వాచ్‌లను వాడుతుండాలి. కేవలం ఈ వాచ్‌లలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ డివైస్‌లు ఉన్న యూజర్లు తమ వాచ్ లేదా ఐఫోన్‌లో ఉండే హెల్త్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో సమ్మరీ అనే విభాగంలో కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ హెల్త్ చెక్ లిస్ట్ అనే ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. అనంతరం అందులో కిందకు వెళితే హైపర్ టెన్షన్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి సెటప్ చేయాలి. ఇలా సెటప్ చేసిన తరువాత మొదటి 30 రోజుల వరకు యూజర్‌కు చెందిన హార్ట్ రేట్‌ను బట్టి బీపీ ఎంత ఉందనే విషయాన్ని యాపిల్ వాచ్ నమోదు చేస్తుంది.
ఇక 30 రోజుల అనంతరం మీ బీపీ రికార్డులను పరిశీలించిన అనంతరం మీకు హైబీపీ ఉన్నదీ లేనిదీ నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తారు. ఇలా ఈ హైపర్ టెన్షన్ నోటిఫికేషన్ ఫీచర్ పనిచేస్తుంది. దీని వల్ల యూజర్లకు హైబీపీ ఉందా, లోబీపీ ఉందా అనే విషయం సులభంగా తెలిసిపోతుంది. దీని సహాయంతో యూజర్లు డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవచ్చు. ఈ విధంగా యాపిల్ వాచ్ యూజర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది. ఈ ఫీచర్‌ను అందించేందుకు గాను ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్‌ను రూపొందించినట్లు యాపిల్ తెలియజేసింది. ఇందుకు 2వేల మంది యూజర్లచే ముందుగా అధ్యయనం చేపట్టామని, 1 లక్ష మందికి చెందిన డేటాను విశ్లేషించామని, తరువాతనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని యాపిల్ తెలియజేసింది. దీని వల్ల యూజర్లకు ఎంతో మేలు జరుగుతుందని యాపిల్ భావిస్తోంది.
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026

Google | ఐఫోన్‌కు దగ్గరైన ఆండ్రాయిడ్.. గూగుల్ భారీ అప్డేట్స్..
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



