UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్
UN | ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ (UN Special Rapporteur Ben Saul) రూపొందించిన నివేదికలో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన సమాచారం వాస్తవ విరుద్ధంగా ఉందని భారత్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పూరి (Raghoo Puri) స్పష్టం చేశారు. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఎక్కడైతే దొరికి హతమయ్యాడో అదే దేశంలో దావూద్ కూడా తలదాచుకుంటున్నాడని పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
UN | త్రినేత్ర న్యూస్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) నేతృత్వంలోని డి కంపెనీని (D Company) భారత్‌కు చెందిన నేర సామ్రాజ్యంగా (India based criminal group) అభివర్ణిస్తూ ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ (UN Special Rapporteur Ben Saul) రూపొందించిన నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. దావూద్ భారత్‌లో ఆశ్రయం పొందుతున్నాడంటూ నివేదికలో పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నివేదికలో తీవ్రమైన తప్పులు ఉన్నాయని, ఇలాంటి అసమర్థత ప్రపంచ స్థాయి సంస్థల ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తుందని భారత్ హెచ్చరించింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన సమాచారం వాస్తవ విరుద్ధంగా ఉందని భారత్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పూరి (Raghoo Puri) స్పష్టం చేశారు.
యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చ సందర్భంగా రఘూ పూరి మాట్లాడుతూ.. దావూద్ ఇబ్రహీం, అతని 'డి-కంపెనీ' 1993 ముంబై పేలుళ్ల నాటి నుంచి భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అని గుర్తుచేశారు. 1267 ఆంక్షల కమిటీ జాబితాలో ఈ విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. అలాంటి కీలకమైన వాస్తవాన్ని నివేదికలో ప్రస్తావించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. 2003లో యూఎన్ ఉగ్ర జాబితాలో చేర్చడానికి చాలా కాలం ముందే దావూద్ భారత్ నుంచి పారిపోయాడని తెలిపారు.
సరిగ్గా అదే సమయంలో విదేశీ గడ్డపై నుంచే అల్-ఖైదా (al-Qaida), ఒసామా బిన్ లాడెన్ (Osama bin Laden)లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతని పేరును ఐరాస బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి లిస్టింగ్ ప్రకారం.. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఎక్కడైతే దొరికి హతమయ్యాడో అదే దేశంలో దావూద్ కూడా తలదాచుకుంటున్నాడని పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్
అదే విధంగా జమ్ము కశ్మీర్, లడఖ్ గురించి పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను రఘూ పూరి తీవ్రంగా ఖండించారు. అవి కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే పనికిమాలిన ప్రచారాలని కొట్టిపారేశారు. జమ్ము కశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకునేందుకు మానవ హక్కులను ఆయుధంగా మలుచుకుంటున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదులకు, రాడికలిజం ప్రచారం చేసేవారికి మానవ హక్కుల చట్టాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం ఇవ్వలేవని స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలకు ఎప్పటికీ సమర్థన ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
Also Read..
నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు.. రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యాఖ్యలు
బ్యాంకు లాకర్‌లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం!
చైనా జనాభా పతనం భారత్‌తో యుద్ధానికి దారితీస్తుందా? తైవాన్ కంటే మన దేశమే ఎందుకు టార్గెట్?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన
అక్టోబర్ 20, 2026

UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం
అక్టోబర్ 17, 2026

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్
- ●RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం
- ●RBI Bank Locker Gold Limits | బ్యాంకు లాకర్‌లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం!
- ●PHP Vulnerability | పీహెచ్పీలో తీవ్ర భద్రతా లోపాలు.. వెబ్సైట్లకు సైబర్ ముప్పు..
- ●Rashmika Mandanna | జాన్వీకపూర్ పెద్ది వివాదంపై రష్మిక రియాక్షన్ - "నో" చెప్పడం తప్పుకాదన్న విజయ్ దేవరకొండ
- ●Mahesh Goud | ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న: మహేశ్ కుమార్ గౌడ్

KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్

RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం

RBI Bank Locker Gold Limits | బ్యాంకు లాకర్‌లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం!

PHP Vulnerability | పీహెచ్పీలో తీవ్ర భద్రతా లోపాలు.. వెబ్సైట్లకు సైబర్ ముప్పు..



