త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Now | హైద‌రాబాద్ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. అమెజాన్‌లో ఇక నిమిషాల్లోనే వ‌స్తువుల డెలివ‌రీ..

Amazon Now | ఈ-కామ‌ర్ప్ సంస్థ అమెజాన్ హైద‌రాబాద్ స‌హా ప‌లు ఇత‌ర న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది. త‌న అల్ట్రా ఫాస్ట్ డెలివ‌రీ స‌ర్వీస్ అమెజాన్ నౌ ను భారీగా విస్త‌రించిన‌ట్లు తెలిపింది. దీని వ‌ల్ల దేశంలో అమెజాన్ నౌ (Now) సేవ‌లు ల‌భిస్తున్న సిటీల సంఖ్య 100కు చేరింది.

S

Technology | Published On May 2, 2026, 10.01 am IST

Amazon Now | హైద‌రాబాద్ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. అమెజాన్‌లో ఇక నిమిషాల్లోనే వ‌స్తువుల డెలివ‌రీ..
Advertisement

Amazon Now | ఈ-కామ‌ర్ప్ సంస్థ అమెజాన్ హైద‌రాబాద్ స‌హా ప‌లు ఇత‌ర న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది. త‌న అల్ట్రా ఫాస్ట్ డెలివ‌రీ స‌ర్వీస్ అమెజాన్ నౌ ను భారీగా విస్త‌రించిన‌ట్లు తెలిపింది. దీని వ‌ల్ల దేశంలో అమెజాన్ నౌ (Now) సేవ‌లు ల‌భిస్తున్న సిటీల సంఖ్య 100కు చేరింది. అయితే కొత్త సిటీల‌కు సేవ‌లు అందించేందుకు గాను అమెజాన్ దేశ‌వ్యాప్తంగా మ‌రో 1వేయి మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్ల‌ను (ఎంఎఫ్‌సీ) ఏర్పాటు చేయ‌నుంది. దీంతో వినియోగ‌దారుల‌కు అమెజాన్ నౌ సేవ‌లను మ‌రింత వేగంగా అందించేందుకు వీలు క‌లుగుతుంది. అమెజాన్ నౌ త‌న సేవ‌ల‌ను విస్త‌రించ‌డం వ‌ల్ల వ్య‌వసాయ స‌ప్లై చెయిన్‌ల‌ను ఒకే గొడుగుకు కింద‌కు తీసుకురావ‌చ్చు. దీంతో 16వేల మందికి పైగా రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను నేరుగా అమెజాన్ నౌ ద్వారా విక్ర‌యించ‌వ‌చ్చు. దీని వ‌ల్ల రైతుల‌కు కూడా ఎంతో మేలు జ‌రుగుతుంది.

టైర్ 2, 3 సిటీల్లోనూ..

అమెజాన్ నౌ సేవ‌ల‌ను మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌డం ద్వారా ఆ సంస్థ క్విక్‌-కామర్స్ సేవ‌ల్లో ఇత‌ర ప్లాట్‌ఫామ్‌ల‌తో పోటీ ప‌డ‌నుంది. ముక్యంగా మెట్రోపాలిట‌న్ సిటీలతోపాటు నాన్ మెట్రోపాలిట‌న్ ప్రాంతాల‌కు కూడా ఇక‌పై ఈ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగ‌ళూరుల‌లో మాత్ర‌మే ఉన్న అమెజాన్ నౌ సేవ‌లు ఇక టైర్ 2, 3 సిటీల్లోనూ ల‌భ్యం కానున్నాయి. చెన్నై, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, పూణె వంటి మెట్రో న‌గ‌రాల‌తోపాటు అహ్మ‌దాబాద్‌, అమృత‌స‌ర్‌, చండీగ‌ఢ్‌, జైపూర్‌, కాన్పూర్‌, కొచ్చి, ల‌క్నో, మంగ‌ళూరు, మీర‌ట్‌, మైసూర్‌, పానిప‌ట్‌, వైజాగ్ ల‌లో అమెజాన్ నౌ ల‌భ్యం కానుంది.

డెలివ‌రీకి అందుబాటులో ఉండే స‌రుకులు..

అమెజాన్ నౌ ద్వారా వినియోగ‌దారులు ప‌లు ఉత్ప‌త్తుల‌ను కొన్ని గంట‌ల్లోనే డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. ఎంపిక చేసిన రోజువారీ నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను నిమిషాల వ్య‌వ‌ధిలోనే డెలివ‌రీ చేస్తారు. కిరాణా సామ‌గ్రి, తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఘ‌నీభ‌వించిన ఆహారాలు (ఫ్రాజెన్ ఫుడ్స్), వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌ణ‌, ఫ్యాష‌న్‌, సౌంద‌ర్య ఉత్ప‌త్తులు, చిన్న సైజ్ గృహోప‌క‌ర‌ణాలు, శిశు ఉత్ప‌త్తులు, పెంపుడు జంతువుల సామ‌గ్రి, ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌ప్లిమెంట్లు వంటి వ‌స్తువుల‌ను అమెజాన్ నౌ ద్వారా డెలివ‌రీ చేస్తారు. ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్ల ద్వారా ఉత్ప‌త్తుల‌ను వేగంగా డెలివ‌రీ చేయ‌వ‌చ్చు. ఈ సెంట‌ర్లు జ‌నావాసాల‌కు ద‌గ్గ‌ర్లో ఉంటాయి. అందువ‌ల్ల డెలివ‌రీ వేగ‌వంతం అవుతుంది.

ఇత‌ర ప్లాట్‌ఫామ్‌ల‌లో ఇప్ప‌టికే..

అమెజాన్ నౌ సేవ‌ల‌ను మ‌రిన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రించిన కార‌ణంగా ఆ సంస్థ దేశంలో మ‌రో రూ.2,800 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు పెడుతోంది. వినియోగ‌దారులు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో అమెజాన్ నౌ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తే దాన్ని ఓపెన్ చేయాలి. సేవ అందుబాటులో ఉంటే డెలివ‌రీకి స‌రుకులు సిద్ధంగా ఉంటాయి. త‌మకు కావ‌ల్సిన ఐట‌మ్స్‌ను ఎంపిక చేసి కొనుగోలు చేస్తే నిమిషాల్లోనే డెలివ‌రీ ఇస్తారు. అయితే బిగ్ బాస్కెట్‌, బ్లింకిట్‌, ఫ్లిప్‌కార్ట్ మిన‌ట్స్‌, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఇప్ప‌టికే ఈ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అందువ‌ల్ల ఆ మార్కెట్‌లోనూ గట్టి పోటీనివ్వ‌డానికే అమెజాన్ ఈ సేవ‌ల‌ను విస్త‌రిస్తుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Advertisement
Advertisement