Amazon Gaming Fest | అమెజాన్‌లో గేమింగ్ ఫెస్ట్ సేల్.. ల్యాప్ టాప్‌లపై భారీ తగ్గింపు ధరలు..
Amazon Gaming Fest | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై గేమింగ్ ఫెస్ట్ పేరిట మరో సేల్‌ను నిర్వహిస్తోంది. బుధవారం ఈ సేల్ ప్రారంభం కాగా మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ సేల్‌లో పలు టాప్ బ్రాండ్లకు చెందిన గేమింగ్ ల్యాప్ టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు తెలియజేసింది.
Technology | Published On Mar 25, 2026, 1.33 pm IST
Amazon Gaming Fest | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై గేమింగ్ ఫెస్ట్ పేరిట మరో సేల్‌ను నిర్వహిస్తోంది. బుధవారం ఈ సేల్ ప్రారంభం కాగా మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ సేల్‌లో పలు టాప్ బ్రాండ్లకు చెందిన గేమింగ్ ల్యాప్ టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు తెలియజేసింది. అసుస్ ఆర్‌వోజీ, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీల గేమింగ్ ల్యాప్ టాప్‌లను డిస్కౌంట్ ధరలకే పొందవచ్చు. పలు ఉత్పత్తులపై 70 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.
గేమింగ్ ల్యాప్ టాప్‌లపై..
ఈ సేల్‌లో లెనోవో ఎల్‌వోక్యూ ల్యాప్‌టాప్‌ను రూ.66,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అసుస్ టీయూఎఫ్ ఎ15 గేమింగ్ ల్యాప్‌టాప్ ధర తగ్గింపు అనంతరం రూ.77,990కి ప్రారంభం అవుతోంది. డెల్ జి15-5530 గేమింగ్ ల్యాప్ టాప్‌ను రూ.78,990 ప్రారంభ ధరకు కొనవచ్చు. హెచ్‌పీ విక్టస్ మోడల్ ప్రారంభ ధర రూ.81,990గా ఉంది. అసుస్ గేమింగ్ వి16 (2025) మోడల్ ప్రారంభ ధరను రూ.99,990గా నిర్ణయించారు. అసుస్ ఆర్‌వోజీ స్ట్రిక్స్ జి16 గేమింగ్ ల్యాప్ టాప్ రూ.1,54,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
ఇతర డివైస్‌లపై కూడా..
సేల్‌లో జీబ్రానిక్స్ గేమింగ్ ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్, లాగిటెక్ గేమింగ్ మౌస్, కాస్మిక్ బైట్స్ ఏరిస్ వైర్ లెస్ కంట్రోలర్, హైపర్ ఎక్స్ క్లౌడ్ లి గేమింగ్ ఓవర్ ఇయర్ హెడ్‌సెట్, సోనీ డ్యుయల్ సెన్స్ వైర్ లెస్ కంట్రోలర్, రేజర్ బ్లాక్ షార్క్ వి2ఎక్స్ వైర్డ్ గేమింగ్ ఆన్ ఇయర్ హెడ్ సెట్, ఎవోఫాక్స్ డెక్ 2 స్మార్ట్ ఫోన్ గేమ్ ప్యాడ్, రేజర్ ఎడ్జ్ ఆండ్రాయిడ్ గేమింగ్ హ్యాండ్ హెల్డ్, సోనీ ప్లే స్టేషన్ 5 గేమింగ్ కన్సోల్ వంటి గ్యాడ్జెట్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. లెనోవో, జీబ్రానిక్స్, ఎల్‌జీ, వ్యూసోనిక్ వంటి బ్రాండ్లకు చెందిన గేమింగ్ మానిటర్లను సైతం డిస్కౌంట్ ధరలకు పొందవచ్చు. అలాగే ఈ సేల్‌లో మదర్ బోర్డులపై 71 శాతం, గేమింగ్ రూటర్లపై 63, గేమింగ్ కీబోర్డులు, మౌస్‌పై 82, గేమింగ్ హెడ్ ఫోన్స్‌పై 67, గ్రాఫిక్ కార్డులపై 80 శాతం మేర తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇక కేసెస్, కూలర్లపై 68 శాతం, స్ట్రీమింగ్ పరికరాలపై 48, రేసింగ్ వీల్స్‌పై 41, ఏఆర్, వీఆర్ డివైస్‌లపై 54 శాతం మేర డిస్కౌంట్లను పొందవచ్చు.
బ్యాంకు ఆఫర్లు సైతం..
ఈ సేల్‌లో పలు బ్యాంకు ఆఫర్లను కూడా ఇస్తున్నారు. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డులతో ఫుల్ పేమెంట్ చేసి ఉత్పత్తులను కొంటే రూ.2500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.3750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.3500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో గేమింగ్ ఫెస్ట్ సేల్ పేజ్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026

Amazon India | అమెజాన్ భారీ బెనిఫిట్స్.. డెలివరీ ఉద్యోగులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్..
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



