త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aitel Postpaid | రూ.699 కే ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌.. ఈ ఓటీటీలు ఉచితం..

Aitel Postpaid | దేశంలో మల్టీ సిమ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ కొత్తగా రూ.699 ఇన్ఫినిటీ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఒకే బిల్లులో రెండు నంబర్లను నిర్వహించాలనుకునే కుటుంబాలు లేదా వ్యక్తిగత పని అవసరాల కోసం బహుళ సిమ్‌లు ఉపయోగించే వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.

S

Technology | Published On Feb 2, 2026, 9.42 am IST

Aitel Postpaid | రూ.699 కే ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌.. ఈ ఓటీటీలు ఉచితం..
Advertisement

Aitel Postpaid | దేశంలో మల్టీ సిమ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ కొత్తగా రూ.699 ఇన్ఫినిటీ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఒకే బిల్లులో రెండు నంబర్లను నిర్వహించాలనుకునే కుటుంబాలు లేదా వ్యక్తిగత పని అవసరాల కోసం బహుళ సిమ్‌లు ఉపయోగించే వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ప్లాన్ ద్వారా డేటా షేరింగ్, బండిల్ చేసిన సిమ్‌లు, అలాగే అనేక OTT, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు ఒకే ప్యాకేజీలో అందుబాటులోకి వస్తాయని ఎయిర్‌టెల్ తెలిపింది. వాయిస్ కాల్స్‌తో పాటు డేటా వినియోగించే వినియోగదారులకు ఇది సరైన విలువైన ఆఫర్‌గా కంపెనీ చెబుతోంది.

నెల‌కు 105జీబీ డేటా.. రోజువారి ప‌రిమితి లేదు..

ఈ ప్లాన్ ప్ర‌కారం ఒకే అకౌంట్‌లో రెండు సిమ్‌లను ఉప‌యోగించుకోవ‌చ్చు. వినియోగదారు తనతో పాటు గరిష్టంగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులను యాడ్ చేయ‌వ‌చ్చు. వేర్వేరు రీచార్జ్‌లు, బిల్లుల గందరగోళం లేకుండా ఒకే బిల్లుతో వ్యవహరించాలనుకునే చిన్న కుటుంబాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగ‌దారులు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ఉచిత నేష‌న‌ల్ రోమింగ్ ల‌భిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. అలాగే నెల‌కు 105జీబీ డేటాను రోజువారి ప‌రిమితి లేకుండా వాడుకోవ‌చ్చు. ఇక ఈ ప్లాన్‌లో ప్రైమ‌రీ సిమ్‌కు 75జీబీ డేటా, సెకండ‌రీ సిమ్‌కు 30జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఫ్రాడ్ డిటెక్ష‌న్‌, స్పామ్ అల‌ర్ట్స్ వంటి ఫీచ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు.

ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లు..

ఈ ప్లాన్‌తో పాటు పలు ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీ సర్వీసులను కూడా ఎయిర్‌టెల్ బండిల్ గా అందిస్తోంది. ఈ ప్లాన్‌ను తీసుకున్న ఎయిర్ టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు 6 నెల‌ల వాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ల‌భిస్తుంది. అలాగే జియో హాట్ స్టార్ మొబైల్ ప్లాన్‌ను 1 ఏడాది పాటు ఫ్రీగా ఇస్తారు. ఎయిర్‌టెల్‌కు చెందిన ఎక్స్ స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ల‌భిస్తుంది. 1 ఏడాది వాలిడిటీ క‌లిగిన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా ఇస్తారు. గూగుల్ వ‌న్‌కు చెందిన 100జీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను సైతం ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఓటీటీ కంటెంట్‌ను తరచుగా వీక్షించే వారు, క్లౌడ్ స్టోరేజ్ లేదా క్రియేటివ్ టూల్స్ అవసరమయ్యే ప్రొఫెషనల్స్‌కు ఇవి ఉపయోగకరంగా ఉంటాయ‌ని ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఒకే బిల్లుపై రెండు నంబ‌ర్ల‌ను వాడాల‌నుకునే క‌పుల్స్ లేదా కుటుంబ స‌భ్యుల‌కు, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు, ఇత‌ర అవ‌స‌రాల‌కు బ‌హుళ సిమ్‌ల‌ను ఉప‌యోగించేవారికి, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లు బండిల్ గా కోరుకునేవారికి ఈ ప్లాన్ ఉప‌యుక్తంగా ఉంటుంది.

Advertisement
Advertisement