Airtel | ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు Adobe Express ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ..
Airtel | డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అనేక సంస్థలు పలు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా మరో వినూత్నమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Technology | Published On Jan 30, 2026, 9.25 am IST
Airtel | డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అనేక సంస్థలు పలు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా మరో వినూత్నమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ Adobe తో భాగస్వామ్యం అయిన ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా ఉన్న తన 36 కోట్ల మంది మొబైల్, వైఫై, డీటీహెచ్ వినియోగదారులకు Adobe Express ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే పెర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యం ద్వారా 12 నెలల Perplexity Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించిన ఎయిర్‌టెల్, ఇప్పుడు మరోసారి డిజిటల్ టూల్స్ రంగంలో వినియోగదారులకు ఈ అ్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది.
రూ.4వేల విలువైన సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా..
ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం అర్హులైన ఎయిర్‌టెల్ వినియోగదారులు సుమారుగా రూ.4వేల విలువైన Adobe Express ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పొందవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే ఈ సౌకర్యాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు Airtel Thanks యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 2026 జనవరి 29 నుంచి 2027 జనవరి 28 మధ్య ఎప్పుడైనా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చెల్లుబాటు అవుతుంది.
ఎన్నో ప్రీమియం టూల్స్ ఉచితంగా..
Adobe Express ప్రీమియం ద్వారా సోషల్ మీడియా పోస్టులు, మార్కెటింగ్ మెటీరియల్, షార్ట్ వీడియోలు, పోస్టర్లు వంటి డిజిటల్ కంటెంట్‌ను సులభంగా రూపొందించుకోవచ్చు. ఈ ప్రీమియం వెర్షన్‌లో జనరేటివ్ ఏఐ ఆధారిత టెక్స్ట్ టు ఇమేజ్, జనరేటివ్ ఫిల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, వన్-టాప్ వీడియో ఎడిటింగ్, ఆటో క్యాప్షన్లు, ప్రీమియం Adobe స్టాక్ అసెట్స్, 30వేలకు పైగా ప్రొఫెషనల్ ఫాంట్లు, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి అధునాతన సౌకర్యాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, బెంగాలీ భాషలకు సపోర్ట్ ఉండటం, భారతీయ పండుగలు, వివాహాలు, చిన్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టెంప్లేట్లు అందుబాటులో ఉండటం విశేషం.
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ప్రెజెంటేషన్లు, ప్రాజెక్టులు, డిజిటల్ పోర్ట్‌ఫోలియోలను రూపొందించుకోవచ్చు. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు లోగోలు, ప్రకటన పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచార కంటెంట్‌ను సులభంగా డిజైన్ చేయగలుగుతాయి. కంటెంట్ క్రియేటర్లు రీల్స్, షార్ట్స్, థంబ్‌నెయిల్స్‌ను వేగంగా ఎడిట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. సాధారణ వినియోగదారులు కూడా పండుగ శుభాకాంక్షలు, ఆహ్వాన పత్రాలు వంటి వ్యక్తిగత అవసరాలకు ఈ టూల్‌ను వినియోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్.. ఆ యూజర్లకే మొదటి ప్రాధాన్యత..
మే 19, 2026

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

Adobe Acrobat | పీడీఎఫ్‌ల క్రియేషన్ ఇక ఈజీ.. ఏఐ ఏజెంట్‌ను ప్రవేశపెట్టిన అడోబ్..
మే 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



