త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adobe Acrobat | పీడీఎఫ్‌ల క్రియేష‌న్ ఇక ఈజీ.. ఏఐ ఏజెంట్‌ను ప్ర‌వేశపెట్టిన అడోబ్‌..

Adobe Acrobat | సాఫ్ట్ వేర్ దిగ్గ‌జ సంస్థ అడోబ్ త‌న అక్రోబాట్ ప్లాట్‌ఫామ్‌కు గాను కొత్త‌గా ఏఐ ఆధారిత ప్రొడ‌క్టివిటీ ఏజెంట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్‌, క‌న్వ‌ర్సేష‌న‌ల్ పీడీఎఫ్ ఎడిటింగ్‌, కంటెంట్ జ‌న‌రేష‌న్‌, షేరింగ్ టూల్స్‌ను ఒకే ఏజెంటిక్ ఇంట‌ర్ ఫేస్‌లో పొందేలా యూజ‌ర్ల‌కు ఆ సంస్థ ఈ కొత్త ఫీచ‌ర్‌ను అందిస్తోంది.

S

Technology | Published On May 7, 2026, 5.29 pm IST

Adobe Acrobat | పీడీఎఫ్‌ల క్రియేష‌న్ ఇక ఈజీ.. ఏఐ ఏజెంట్‌ను ప్ర‌వేశపెట్టిన అడోబ్‌..
Advertisement

Adobe Acrobat | సాఫ్ట్ వేర్ దిగ్గ‌జ సంస్థ అడోబ్ త‌న అక్రోబాట్ ప్లాట్‌ఫామ్‌కు గాను కొత్త‌గా ఏఐ ఆధారిత ప్రొడ‌క్టివిటీ ఏజెంట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్‌, క‌న్వ‌ర్సేష‌న‌ల్ పీడీఎఫ్ ఎడిటింగ్‌, కంటెంట్ జ‌న‌రేష‌న్‌, షేరింగ్ టూల్స్‌ను ఒకే ఏజెంటిక్ ఇంట‌ర్ ఫేస్‌లో పొందేలా యూజ‌ర్ల‌కు ఆ సంస్థ ఈ కొత్త ఫీచ‌ర్‌ను అందిస్తోంది. దీని వ‌ల్ల యూజర్లు రీసెర్చ్‌, హెల్ప్‌, కంటెంట్‌క్రియేష‌న్ వంటి ప‌నుల‌ను ఒకే చోట పూర్తి చేయ‌వ‌చ్చు. అలాగే ఏఐ ఆధారిత వ‌ర్క్ స్పేస్ పీడీఎఫ్ స్పేసెస్‌ను కూడా ఇందులో ఇచ్చారు. దీని వ‌ల్ల యూజ‌ర్ల‌కు మెరుగైన పబ్లిషింగ్‌, షేరింగ్ స‌దుపాయాలు ల‌భిస్తాయి. డాక్యుమెంట్లు, డేటా, సిస్ట‌మ్స్ ఆధారిత వ‌ర్క్‌ఫ్లోల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించుకునే ల‌క్ష్యంతో అడోబ్ ఈ కొత్త టూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపింది. త‌న ఏజెంటిక్ ఏఐ వ్యూహంలో భాగంగా వీటిని అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

సుల‌భంగా డాక్యుమెంట్ల క్రియేషన్‌, ఎడిటింగ్‌..

అడోబ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అక్రోబాట్ డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఈ కొత్త ప్రొడక్టివిటీ ఏజెంట్ వ‌ల్ల వినియోగదారులు సమాచారాన్ని సృష్టించడం, ఎడిట్ చేయడం, అర్థం చేసుకోవడం, పంచుకోవడం వంటి పనులను మరింత వేగంగా, సులభంగా చేయడానికి వీల‌వుతుంది. ఈ ఏజెంట్ పలు టూల్స్, ఏఐ మోడల్స్‌ను సమన్వయం చేసి కంటెంట్‌ను రూపొందిస్తుంది. ఇమేజ్‌లు, టెక్ట్స్‌, ప్ర‌జంటేష‌న్స్‌, పాడ్ కాస్ట్స్‌, సోష‌ల్ పోస్ట్స్‌, కన్వర్సేషనల్ పీడీఎఫ్ ఎడిట్స్ వంటి వాటికి ఈ ఏజెంట్ సౌక‌ర్య‌వంతంగా సేవ‌ల‌ను అందిస్తుంది. అలాగే పీడీఎఫ్ స్పేసెస్‌లో వినియోగదారులు పీడీఎఫ్‌లు, ఫైళ్లు, లింకులు, నోట్స్‌ను ఒకే వర్క్‌స్పేస్‌లో కలిపి పరిశోధన, విశ్లేషణ, కంటెంట్ క్రియేషన్ వంటి పనుల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు.

థ‌ర్డ్ పార్టీ ఏజెంట్లతో క‌లిసి కూడా..

అడోబ్ తెలిపిన ప్రకారం ఈ ప్రొడక్టివిటీ ఏజెంట్ అడోబ్ క్రియేటివ్ ఏజెంట్‌తో పాటు థర్డ్ పార్టీ ఏజెంట్లతో కూడా కలిసి పనిచేసేలా అందుబాటులోకి వ‌చ్చింది. దీని ద్వారా డాక్యుమెంట్లు, డేటా, సిస్టమ్స్ మధ్య వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయవచ్చు. అప్‌డేట్ చేసిన పీడీఎఫ్ స్పేసెస్ ఎక్స్‌పీరియెన్స్‌ ద్వారా సాధారణ డాక్యుమెంట్లు, ఫైళ్లను ఇంటరాక్టివ్, వ్యక్తిగతీకరించిన అనుభవాలుగా మార్చవచ్చని అడోబ్ తెలిపింది. ప్రతి సంవత్సరం అక్రోబాట్‌లో 400 బిలియన్లకుపైగా పీడీఎఫ్‌లు ఓపెన్ అవుతుండగా, 200 మిలియన్లకుపైగా పీడీఎఫ్‌లు షేర్ అవుతున్నాయని కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారులు ఏఐ ఆధారిత టైటిల్స్, సమ్మరీలు, ఆడియో ఓవర్వ్యూలు రూపొందించవచ్చు. ఫైళ్లను రీఆర్డర్ చేయడం, సందర్భానుసార నోట్స్ జోడించడం, గ్రహీతల కోసం కస్టమైజ్డ్ ఏఐ అసిస్టెంట్లను సృష్టించడం, బ్రాండింగ్ కోసం లోగోలు, కలర్ ప్యాలెట్లు జోడించడం, ఎంగేజ్‌మెంట్ ఇన్‌సైట్స్‌ను పరిశీలించి ఫాలోఅప్ చర్యలు చేపట్టడం వంటి ప‌నులు చేయ‌వ‌చ్చు.

వ్యాపారుల‌కు, వ్య‌క్తిగ‌త యూజ‌ర్ల‌కు..

ఏఐ అసిస్టెంట్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు సూచనలు అందించి, అవసరమైన సమాచారాన్ని త్వరగా కనుగొనడంలో సహాయపడుతుంది. అలాగే సోర్స్ డాక్యుమెంట్లు మారినప్పుడు షేర్ చేసిన ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. ఆడియో ఓవర్వ్యూలలో ఎడిట్ చేయగలిగే స్క్రిప్ట్స్ కూడా ఉంటాయని అడోబ్ తెలిపింది. దీని వల్ల వినియోగదారులు షేర్ చేసే ముందు రూపొందించిన సమ్మరీలను సవరించుకోవచ్చు. కొత్త ఫీచర్లు వ్యాపార అవసరాలతో పాటు వ్యక్తిగత వినియోగాలకు కూడా ఉపయోగపడతాయని అడోబ్ పేర్కొంది. వ్యాపార వినియోగాల్లో సేల్స్ ప్రపోజల్స్ సృష్టించడం, కేస్ స్టడీస్ నిర్మించ‌డం, మార్కెటింగ్ రీసెర్చ్ డాక్యుమెంట్ల‌ను ప్రిపేర్ చేయ‌డం, ప్రొడక్ట్ లాంచ్ మెటీరియల్స్ రూప‌క‌ల్ప‌న‌, హెచ్‌ఆర్ ఆన్‌బోర్డింగ్ ప్యాకేజెస్ ల‌ను నిర్మించ‌డం, పాలసీ అప్‌డేట్స్ చేయ‌డం, ఇన్వెస్టర్ బ్రీఫింగ్స్ అందించ‌డం, ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయ‌డం వంటి ప‌నుల‌కు ఈ టూల్స్ సహాయం చేస్తాయి.

ఈ ప్లాన్ల‌లో ల‌భ్యం..

అలాగే ట్రావెల్ ఇటినరరీలు, కమ్యూనిటీ అప్‌డేట్స్, కలబొరేటివ్ ప్లానింగ్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం కూడా పీడీఎఫ్ స్పేసెస్ ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా సుదీర్ఘ‌మైన ఈ-మెయిల్ థ్రెడ్స్ లేదా గ్రూప్ చాట్స్‌కు బదులుగా ఒకే చోట సమాచారాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. కొత్త ప్రొడక్టివిటీ ఏజెంట్, పీడీఎఫ్ స్పేసెస్ షేరింగ్ ఫీచర్లు ప్రస్తుతం అడోబ్ అక్రోబాట్ ఏఐ ప్లాన్ల ద్వారా అందిస్తున్నారు. ఇందులో అక్రోబాట్ ఎక్స్‌ప్రెస్, అక్రోబాట్ స్టూడియో కూడా ఉన్నాయి. అక్రోబాట్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఏఐ ఆధారిత డాక్యుమెంట్ ఇన్‌సైట్స్, ప్రీమియం కంటెంట్ జనరేషన్, సమాచార షేరింగ్ వంటి సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో లభిస్తాయి. అక్రోబాట్ స్టూడియోలో పూర్తి పీడీఎఫ్ టూల్స్, ఏఐ పీడీఎఫ్ టూల్స్, పీడీఎఫ్ స్పేసెస్, ఏఐ అసిస్టెంట్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. పీడీఎఫ్ స్పేసెస్‌ను వీక్షించడానికి అకౌంట్ అవసరం లేదని అడోబ్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా అడోబ్ క్రియేటివిటీ అండ్ ప్రొడక్టివిటీ బిజినెస్ ప్రెసిడెంట్ డేవిడ్ వాధ్వాని మాట్లాడుతూ అడోబ్ ప్రొడక్టివిటీ ఏజెంట్ ప్రజలు సమాచారంతో పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంద‌ని తెలిపారు. అక్రోబాట్ డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్‌ను ఏజెంట్లతో కలిపి వేగంగా ఇన్‌సైట్స్ అందించడం, విజువల్ కంటెంట్‌ను సులభంగా రూపొందించడం, వ్యక్తిగతీకరించిన ఏజెంట్ల ద్వారా ఇంటరాక్టివ్ అనుభవాలను పంచుకోవడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకువచ్చామ‌ని తెలిపారు.

Advertisement
Advertisement