Ai Plus PulseTab | అత్యంత చవక ధరకే ఆండ్రాయిడ్ ట్యాబ్.. విడుదల చేసిన ఏఐ ప్లస్..
Ai Plus PulseTab | మొబైల్స్ తయారీ సంస్థ ఏఐ ప్లస్ నూతనంగా పల్స్ ట్యాబ్ పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకు ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ట్యాబ్ చవక ధరకే లభిస్తుండడంతోపాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
Technology | Published On Apr 10, 2026, 1.08 pm IST
Ai Plus PulseTab | మొబైల్స్ తయారీ సంస్థ ఏఐ ప్లస్ నూతనంగా పల్స్ ట్యాబ్ పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకు ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ట్యాబ్ చవక ధరకే లభిస్తుండడంతోపాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇక పల్స్ ట్యాబ్‌లో 10.95 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ ట్యాబ్‌లో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. మైక్రో ఎస్‌డీ కార్డుకు సపోర్ట్ కూడా ఉంది. స్టోరేజ్‌ను ఆ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 8000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉన్నందున బ్యాకప్ ఎక్కువగా ఇస్తుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల ట్యాబ్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఆడియో ఔట్‌పుట్ కోసం క్వాడ్ స్పీకర్లను ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. డ్యుయల్ సిమ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. వైఫై ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఈ ట్యాబ్ డిస్‌ప్లేకు 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. అందువల్ల ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. మీడియాటెక్ హీలియో జి88 ప్రాసెసర్ ఇందులో ఉంది.
ధర వివరాలు, ఇతర ప్రొడక్ట్స్ కూడా..
ఏఐ ప్లస్ పల్స్ ట్యాబ్ ధర రూ.9,999 ఉండగా, దీన్ని మే నెలలో విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు పలు ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో ఇది లభిస్తుంది. కాగా ఈ ట్యాబ్‌తోపాటు ఏఐ ప్లస్ సంస్థ పలు ఇతర ప్రొడక్ట్స్‌ను కూడా లాంచ్ చేసింది. నోవోపాడ్ బీట్స్ పేరిట నూతన ట్రూ వైర్‌లెస్ బడ్స్‌ను ప్రవేశపెట్టింది. వీటిలో 13ఎంఎం డ్రైవర్ యూనిట్ ఉన్నందున సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ) సదుపాయం కూడా ఉంది. ఈ ఇయర్ బడ్స్ సహాయంతో రియల్ టైమ్‌లో హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్‌ను సైతం తెలుసుకోవచ్చు. ఇందులో 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పూర్తిగా చార్జింగ్ అయ్యేందుకు గంటన్నర సమయం పడుతుంది. బ్లూటూత్ 5.4 ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1,599గా ఉంది. అలాగే నోవో పాడ్స్ ఎయిర్ పేరిట మరో వైర్ లెస్ ఇయర్ బడ్స్ మోడల్ ను కూడా ఏఐ ప్లస్ లాంచ్ చేసింది. దీని ధర రూ.899 ఉండగా, కొత్తగా రొటేట్ క్యామ్ 4జి పేరిట ఓ స్మార్ట్ వాచ్‌ను ఈ కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ వాచ్ లో రొటేటింగ్ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.4,999గా ఉంది. అన్ని ప్రొడక్ట్స్‌ను ఆ సంస్థ మే నెల నుంచి మార్కెట్‌లో విక్రయించనుంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



