త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్‌లోనే 4కె వీడియో ఎడిటింగ్..

Adobe Premiere | టెక్ దిగ్గ‌జ సంస్థ అడోబ్ తన ప్రీమియర్ మొబైల్ వీడియో ఎడిటింగ్ యాప్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది ఐఫోన్‌లో విడుదలైన ఈ యాప్, ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో పనిచేసే డివైస్‌లకు అందుబాటులో ఉంది. కనీసం 6 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.

S

Technology | Published On Sep 23, 2026, 2.23 pm IST

Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్‌లోనే 4కె వీడియో ఎడిటింగ్..
Advertisement

Adobe Premiere | టెక్ దిగ్గ‌జ సంస్థ అడోబ్ తన ప్రీమియర్ మొబైల్ వీడియో ఎడిటింగ్ యాప్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది ఐఫోన్‌లో విడుదలైన ఈ యాప్, ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో పనిచేసే డివైస్‌లకు అందుబాటులో ఉంది. కనీసం 6 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్‌లో విడుదలైన తర్వాత ప్రీమియర్ మొబైల్‌ను రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోలు, ట్యుటోరియల్స్, పాడ్‌కాస్ట్ క్లిప్స్, సోషల్ మీడియా కంటెంట్ తదితరాలను రూపొందించడానికి వినియోగిస్తున్నారు. ఇందులో ఫ్రేమ్-స్థాయి క‌చ్చితత్వంతో వీడియోలను ఎడిట్ చేసే అవకాశం ఉంది. అంటే వీడియోలోని వ్యక్తిగత కట్స్‌ను క‌చ్చితంగా నియంత్రించవచ్చు. రియాక్షన్‌కు సరైన సమయాన్ని సెట్ చేయడం, సంగీతానికి అనుగుణంగా కట్స్ చేయడం లేదా వీడియో క్లిప్‌ను నిర్దిష్ట క్షణంలో ట్రిమ్ చేయడం వంటి పనులను సులభంగా చేయవచ్చు.

మ‌ల్టీ-ట్రాక్ టైమ్‌లైన్ స‌దుపాయం..

ప్రీమియర్ మొబైల్‌లో మల్టీ-ట్రాక్ టైమ్‌లైన్ సదుపాయం ఉంది. దీంతో ఒకే స్క్రీన్‌పై వీడియో, సంగీతం, టెక్స్ట్, వాయిస్ ఓవర్లు, ఎఫెక్ట్స్ వంటి వివిధ అంశాలను లేయర్లుగా జోడించవచ్చు. క్రియేటర్లు రూపొందించిన టెంప్లేట్లను కూడా తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాగే ఎన్‌హాన్స్ ఆడియో ఫీచర్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లోని అనవసర శబ్దాన్ని తగ్గించి, ఇంటర్వ్యూలు, వాయిస్ ఓవర్లు, ఇతర రికార్డింగ్స్‌లో వాయిస్ స్పష్టతను ఒక్క ట్యాప్‌తో మెరుగుపరచవచ్చు. వీడియో ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్‌తోపాటు అడోబ్ స్టాక్‌లోని క్రియేటివ్ ఆస్తులు, సంగీతాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. వినియోగదారులు తమ సొంత ఫైళ్లను లేదా ఇప్పటికే ఉన్న వీడియోల నుంచి ఆడియోను కూడా ఉపయోగించవచ్చు. వీడియోలను 4కె రిజల్యూషన్ వరకు ఎడిట్ చేసి ఎగుమతి చేయవచ్చు. ముఖ్యంగా ఎడిటింగ్ కోసం తప్పనిసరిగా లాగిన్ చేయాల్సిన అవసరం లేకపోవడం, పదేపదే అప్‌గ్రేడ్ చేయమని సూచనలు రాకపోవడం వంటి సౌకర్యాలను అడోబ్ అందిస్తోంది. ఎడిటింగ్ సమయంలో ప్రకటనలు లేదా వాటర్‌మార్క్‌లు కూడా ఉండవని సంస్థ తెలిపింది.

జ‌న‌రేటివ్ ఏఐ ఫీచ‌ర్లు సైతం..

ప్రీమియర్ మొబైల్‌లో అడోబ్ ఫైర్‌ఫ్లై ఆధారిత జనరేటివ్ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. జనరేటివ్ ఫిల్, ఇమేజ్-టు-వీడియో, జనరేట్ సౌండ్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లతో అదనపు కంటెంట్‌ను రూపొందించుకోవచ్చు. భవిష్యత్తులో అడోబ్ ఫాంట్స్, మెరుగైన క్యాప్షన్స్, కీఫ్రేమ్స్, క్రాపింగ్, బీట్ డిటెక్షన్, డెస్క్‌టాప్‌లోని ప్రీమియర్‌లో ఎడిట్ చేస్తున్న వీడియోను కొనసాగించే సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను తీసుకురానున్నట్లు అడోబ్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ కోసం అడోబ్ ప్రీమియర్ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే కొత్త వెర్షన్, కనీసం 6 జీబీ ర్యామ్ ఉన్న డివైస్‌లు అవసరం. ఉచిత వెర్షన్‌లో ప్రాథమిక వీడియో ఎడిటింగ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా జనరేటివ్ ఏఐ క్రెడిట్స్, స్టోరేజ్ వంటి సదుపాయాల కోసం చెల్లింపు అప్‌గ్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement