Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
Acer Iconia Tab 11 5G | భారత మార్కెట్లో ఏసర్ తన ఐకోనియా ట్యాబ్లెట్ శ్రేణిని విస్తరించింది. తాజాగా ఏసర్ ఐకోనియా ట్యాబ్ 11 5జి, ఏసర్ ఐకోనియా ట్యాబ్ 12 5జి పేర్లతో రెండు కొత్త ట్యాబ్లెట్లను పరిచయం చేసింది. విద్య, కార్యాలయ పనులు, ఆన్‌లైన్ తరగతులు, వినోద అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది.
Technology | Published On Oct 12, 2026, 3.06 pm IST
Acer Iconia Tab 11 5G | భారత మార్కెట్లో ఏసర్ తన ఐకోనియా ట్యాబ్లెట్ శ్రేణిని విస్తరించింది. తాజాగా ఏసర్ ఐకోనియా ట్యాబ్ 11 5జి, ఏసర్ ఐకోనియా ట్యాబ్ 12 5జి పేర్లతో రెండు కొత్త ట్యాబ్లెట్లను పరిచయం చేసింది. విద్య, కార్యాలయ పనులు, ఆన్‌లైన్ తరగతులు, వినోద అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. రెండు మోడళ్లలోనూ 5జి కనెక్టివిటీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, మీడియాటెక్ ప్రాసెసర్లు, స్టోరేజీని పెంచుకునే సదుపాయం ఉన్నాయి. అదనంగా స్టైలస్, కీబోర్డ్ ఫ్లిప్ కవర్ వంటి ఉపకరణాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఏసర్ ఐకోనియా ట్యాబ్ 11 5జిలో 10.95 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1920 * 1200 పిక్సల్స్ రిజల్యూషన్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 450 నిట్స్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.
పెద్ద డిస్‌ప్లే..
పెద్ద స్క్రీన్‌తోపాటు సులభంగా తీసుకెళ్లే వీలును దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. పెద్ద డిస్‌ప్లే కోరుకునే వారి కోసం ఏసర్ ఐకోనియా ట్యాబ్ 12 5జిని తీసుకొచ్చింది. ఇందులో 12.2 ఇంచుల ఫుల్లీ లామినేటెడ్ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఇది 2400 * 1600 పిక్సల్స్ రిజల్యూషన్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డాక్యుమెంట్లపై పనిచేయడం, చదువుకోవడం, వీడియోలు వీక్షించడం వంటి అవసరాలకు పెద్ద స్క్రీన్ ఉపయోగపడుతుంది. రెండు ట్యాబ్లెట్లలోనూ మీడియాటెక్ ఎంటీ8755 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వీటికి 8 జీబీ ర్యామ్‌ను జత చేశారు. 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా రెండు మోడళ్లలోనూ 5జి సెల్యులార్ నెట్‌వర్క్, డ్యుయల్ బ్యాండ్ వైఫై 5, బ్లూటూత్ 5.2 సదుపాయాలు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్ సి పోర్టు, మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకునే అవకాశం కల్పించారు.
భారీ బ్యాటరీ..
హైబ్రిడ్ సిమ్ సెటప్‌తోపాటు బయోమెట్రిక్ గుర్తింపు కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. బ్యాటరీ సామర్థ్యంలో రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసం ఉంది. ఐకోనియా ట్యాబ్ 11 5జిలో 7,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ఐకోనియా ట్యాబ్ 12 5జిలో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. రెండు ట్యాబ్లెట్లూ 18 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. వీడియో కాల్స్, ఆన్‌లైన్ సమావేశాలు, సెల్ఫీల కోసం రెండు ట్యాబ్లెట్లలోనూ 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. వెనుక కెమెరాల విషయంలో మాత్రం మోడళ్లను బట్టి మార్పులున్నాయి. ఐకోనియా ట్యాబ్ 11 5జిలో 13 మెగాపిక్సల్ సింగిల్ రియర్ కెమెరా ఉంది. ఐకోనియా ట్యాబ్ 12 5జిలో 16 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు 2 మెగాపిక్సల్ మాక్రో లెన్స్‌ను అందించారు.
ధర ఎంతంటే..
రెండు మోడళ్లకూ ఐచ్ఛిక ఉపకరణాలుగా స్టైలస్, కీబోర్డ్‌తో కూడిన ఫ్లిప్ కవర్‌ను అందించారు. ఇందులో డాకింగ్ సదుపాయం కూడా ఉండడంతో ట్యాబ్లెట్‌ను నోట్‌బుక్ తరహాలో ఉపయోగించుకోవచ్చు. చదువుకోవడం, టైపింగ్, డాక్యుమెంట్ల తయారీ వంటి పనులకు ఈ ఉపకరణాలు ఉపయోగపడతాయి. ఏసర్ ఐకోనియా ట్యాబ్ 11 5జి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. స్టైలస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. స్టైలస్, కీబోర్డ్ రెండూ కలిపిన వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఇదే ట్యాబ్లెట్‌లో 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 కాగా, స్టైలస్‌తో కలిపి కొనుగోలు చేస్తే రూ.27,999 చెల్లించాలి. స్టైలస్, కీబోర్డ్‌తో కూడిన 256 జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది.
ఏసర్ ఐకోనియా ట్యాబ్ 12 5జి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 ఉండగా, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. 128 జీబీ స్టోరేజీతో స్టైలస్, కీబోర్డ్ కలిపిన వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. 256 జీబీ స్టోరేజీతో ఈ రెండు ఉపకరణాలు కలిగిన వేరియంట్ ధరను రూ.36,999గా నిర్ణయించారు. ఏసర్ ఐకోనియా ట్యాబ్ 11 5జిని ఫ్లిప్‌కార్ట్, ఏసర్ ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఏసర్ ఐకోనియా ట్యాబ్ 12 5జి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఏసర్ ప్రత్యేక స్టోర్లు, ఏసర్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి
- ●Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు
- ●Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు
- ●Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..
- ●Farmers Protest | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి తప్పు చేశాం.. ఇప్పుడు చెప్పులతో కొట్టుకుంటున్నం
- ●Delhi Tour of Congress Leaders | ఎల్‌నినోపై మీటింగన్నారు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు

Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి

Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు

Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు

Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..



