Acer Day 2026 | ల్యాప్‌టాప్ కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.20వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్న ఏసర్..
Acer Day 2026 | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఏసర్ తన 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు పలు ఉత్పత్తులపై భారీ రాయితీలను, ఆఫర్లను అందిస్తోంది.
Technology | Published On Aug 1, 2026, 3.42 pm IST
Acer Day 2026 | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఏసర్ తన 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు పలు ఉత్పత్తులపై భారీ రాయితీలను, ఆఫర్లను అందిస్తోంది. ఆగస్టు నెల మొత్తం నిర్వహించనున్న ఈ సేల్‌లో భాగంగా కంప్యూటింగ్ ఉత్పత్తులతోపాటు ఏసర్ ప్యూర్ స్మార్ట్ హోమ్ గృహోపకరణాలపై కూడా ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. ఆగస్టు నెల మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అధికారిక ఏసర్ ఈ-స్టోర్, ఏసర్‌ప్యూర్ ఈ-స్టోర్, అలాగే ఏసర్‌ప్యూర్ అమెజాన్ స్టోర్ ద్వారా వినియోగదారులు ఈ ఆఫర్లను పొందవచ్చు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో కొనుగోలు చేసే వారికి ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్టంగా రూ.20వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 50 శాతం వరకు ధర తగ్గింపు ధర కూడా అందుబాటులో ఉంటుంది.
2 ఏళ్ల వరకు వారంటీ, రూ.20వేల డిస్కౌంట్..
అన్ని ల్యాప్‌టాప్‌లపై ఉచితంగా 2 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తుండగా, ఎంపిక చేసిన మోడళ్లకు 1 సంవత్సరం యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ (ఏడీపీ) కూడా ఉచితంగా లభిస్తుంది. అర్హత కలిగిన ఉత్పత్తులపై ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక రోజులలో ఉచిత యాక్సెసరీలను అందించడంతోపాటు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై విద్యార్థులకు అదనంగా 7 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అధికారిక ఏసర్ ఈ-స్టోర్‌లో ఆగస్టు 1 నుంచి 5 వరకు ప్రత్యేక ఎర్లీ బర్డ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్, 50 శాతం వరకు ధర తగ్గింపు, అన్ని ల్యాప్‌టాప్‌లపై 2 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తాయి. అలాగే రూ.69,990 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసిన వారికి 1 సంవత్సరం ఏడీపీ, ఎంపిక చేసిన మోడళ్లపై 10 శాతం విద్యార్థి డిస్కౌంట్, అర్హత కలిగిన ల్యాప్‌టాప్‌లపై ఉచిత యాక్సెసరీలను కూడా అందిస్తారు.
లక్కీ డ్రాలో పాల్గొనే చాన్స్..
ఆగస్టు 1 నుంచి 5 మధ్య కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రత్యేక లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం పొందుతారు. ఇందులో ముగ్గురు విజేతలకు ల్యాప్‌టాప్‌లు, ఇద్దరికి ఏసర్ ట్యాబ్లెట్లు బహుమతులుగా ఇవ్వనున్నారు. ఏసర్‌ప్యూర్ కూడా ఈ ప్రచారంలో భాగంగా స్మార్ట్ హోమ్ ఉత్పత్తులపై ప్రత్యేక ధరలను ప్రకటించింది. అడ్వాన్స్ జీ సిరీస్ 65 ఇంచుల టీవీ ధరను రూ.45,990గా నిర్ణయించింది. ఏసర్‌ప్యూర్ చిల్ నియో 1.5 టన్నుల 5 స్టార్ ఎయిర్ కండిషనర్ రూ.38,990కు లభిస్తుంది. ఏసర్‌ప్యూర్ కోజీ ఎయిర్ సర్క్యులేటర్ ఎఫ్1 ధర రూ.6,390 కాగా, వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ రూ.13,490, డ్రై వాక్యూమ్ క్లీనర్ రూ.10,350, పెట్ క్లీనర్ రూ.4,521కు అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్ ప్యూరిఫయర్లు సైతం..
ఎయిర్ ప్యూరిఫయర్ విభాగంలో పి2 లైట్ రూ.9,710, సి1 (ఏసీ530డబ్ల్యూజీ) రూ.15,300, ఏపీ551-పి2 రూ.16,260, సి2 యూవీ (ఏసీ553) రూ.21,800, కమర్షియల్ ఎయిర్ ప్యూరిఫయర్ రూ.51,692కు లభ్యమవుతున్నాయి. ఏసర్‌ప్యూర్ ఉత్పత్తులపై ఈ ప్రత్యేక ధరలు ఆగస్టు 1 నుంచి 31 వరకు స్టోర్ ఏసర్‌ప్యూర్ కో, ఏసర్‌ప్యూర్ అమెజాన్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sapta Matrukalu | రాక్షస సంహారంలో జగన్మాతకు అండగా నిలిచిన సప్తమాతృకలు ఎవరు?
- ●KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్
- ●Manne Krishank | సీఎం రేవంత్ కూతురు స్కూల్లో ఫీజెంత తెలుసా?: మన్నె క్రిశాంక్
- ●Nobel Prize Economics 2026 | ఆర్థిక శాస్త్రంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్: రాబర్ట్ ఇ.హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్లను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం
- ●Jantar Mantar Protest Site Denotified | జంతర్ మంతర్ వద్ద ఇక ధర్నాలు బంద్: నిరసనలకు 3 కొత్త వేదికలను ఖరారు చేసిన ఢిల్లీ పోలీసులు
- ●Cyber Crime | 'నో' అంటే.. ఖాతా ఖాళీ! ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!

Sapta Matrukalu | రాక్షస సంహారంలో జగన్మాతకు అండగా నిలిచిన సప్తమాతృకలు ఎవరు?

KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్

Manne Krishank | సీఎం రేవంత్ కూతురు స్కూల్లో ఫీజెంత తెలుసా?: మన్నె క్రిశాంక్

Nobel Prize Economics 2026 | ఆర్థిక శాస్త్రంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్: రాబర్ట్ ఇ.హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్లను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం



