sl vs Zim | పసికూనే అనుకుంటే – శ్రీలంకను చిత్తు చేసిన జింబాబ్వే
టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మరో సంచలనం సృష్టించింది. ఇటీవలే ఆస్ట్రేలియాకు షాకిచ్చిన ఈ పసికూన గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
sl vs Zim | టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా షాకిచ్చిన జింబాబ్వే మరో సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో 178 పరుగులు చేసింది. మరో మూడు బంతులు మిగిలుండగానే ఈ టార్గెట్‌ను ఛేదించిన జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నిస్సాంక హాఫ్ సెంచరీ...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక 41 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లతో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రత్ననాయకే 35 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులతో ధాటిగా ఆడాడు. మిగిలిన బ్యాట్స్ పూర్తిగా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్, క్రీమర్ , ముజారాబనీ తలో రెండు వికెట్లు తీశారు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్...
లక్ష్య ఛేధనలో జింబాబ్వే బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు బ్రయాన్ బెన్నెట్, మరుమని ధాటిగా ఆడారు. మరుమని 26 బాల్స్‌లో ఐదు ఫోర్లతో ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రయాన్ బర్ల్ 12 బాల్స్‌లోనే రెండు ఫోర్లు ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ బెన్నెట్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బెన్నెట్‌తో కలిసి కెప్టెన్ సికందర్ రజా జింబాబ్వేను విజయం దిశగా నడిపించాడు. సికందర్ రజా 26 బాల్స్‌లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 45 పరుగులతో విజృంభించాడు. విజయం ముగింట రజాతో పాటు ముసేకివాలను హేమంత ఔట్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ మున్యోంగాతో కలిసి బెన్నెట్ జింబాబ్వేను గెలిపించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న బెన్నెట్ 48 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లతో 63 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో హేమంత రెండు వికెట్లతో రాణించాడు.
ఓటమి లేకుండా...
ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ కప్‌లోని అడుగుపెట్టిన జింబాబ్వే....గ్రూప్ స్టేజ్‌లో ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి మేటి జట్లను ఓడించి గ్రూప్ బీలో టాపర్‌గా నిలిచింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






