త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TeamIndia | 600వ టెస్ట్‌.. టాస్ గెలిచిన భార‌త్‌.. బ్యాటింగ్ ఎంచుకున్న గిల్‌

TeamIndia | రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేధిక‌గా భార‌త్‌, శ్రీలంక (India vs Sri Lanka) మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, టెస్టు చ‌రిత్ర‌లో టీమ్ఇండియాకు (TeamIndia | ) ఇది 600వ మ్యాచ్‌.

G

Sports | Published On Aug 15, 2026, 10.28 am IST

TeamIndia | 600వ టెస్ట్‌.. టాస్ గెలిచిన భార‌త్‌.. బ్యాటింగ్ ఎంచుకున్న గిల్‌
Advertisement

TeamIndia | త్రినేత్ర‌.న్యూస్‌: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేధిక‌గా భార‌త్‌, శ్రీలంక (India vs Sri Lanka) మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, టెస్టు చ‌రిత్ర‌లో టీమ్ఇండియాకు (TeamIndia | ) ఇది 600వ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఆడ‌తాడ‌ని అంతా అనుకున్న‌ప్పటికీ తుది జ‌ట్టులో అత‌నికి చోటు ద‌క్క‌లేదు. ముగ్గురు ఎడ‌మ‌చేతి వాటం స్పిన్న‌ర్లు, ఇద్ద‌రు పేస‌ర్లతో బ‌రిలోకి దిగుతున్న‌ది.

1932లో తొలి టెస్ట్‌

టీమ్ఇండియా త‌న తొలి టెస్టు మ్యాచ్‌ను 1932, జూన్ 25న లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో ఆడింది. మొత్తంగా ఇది 600వ మ్యాచ్‌. దీంతో ఈ ఘ‌న‌త సాధించి తొలి ఆసియా జ‌ట్టుగా భార‌త్ నిలిచింది. ఇక ప్ర‌పంచంలో మూడో దేశం. అంత‌కుముందు ఇంగ్లండ్ (1,097), ఆస్ట్రేలియా (882) మాత్ర‌మే ఈ మైలురాయిని చేరుకున్నాయి. భార‌త్ త‌న 500వ టెస్టు మ్యాచ్‌ను 2016 సెప్టెంబ‌ర్‌లో కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో ఆడింది. కాగా, స‌రిగ్గా ప‌దేండ్ల‌కు 600వ మ్యాచ్ ఆడుతుండ‌టం గ‌మ‌నార్హం. కాగా, ఈ చారిత్ర‌క మ్యాచ్‌లో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాల‌ని కెప్టెన్‌ గిల్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

తుదిజ‌ట్టు..

య‌శ‌స్వి జైస్వాల్‌, కేఎల్ రాహుల్‌, శుభ‌మ‌న్ గిల్ (కెప్టెన్‌), దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, రిష‌బ్ పంత్ (కీప‌ర్‌), ర‌వీంద్ర జ‌డేజా, ధ్రువ్ జురెల్‌, కుల్దీప్ యాద‌వ్‌, మాన‌వ్ సుతార్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌

Advertisement
Advertisement