WPL 2026 | డబ్ల్యూపీఎల్ 2026.. థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపు..
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ 2026 టోర్నీలో భాగంగా నిర్వహించిన మహిళల టీ20 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై గుజరాత్ జయాంట్స్ వుమెన్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని సాధించింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది.
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ 2026 టోర్నీలో భాగంగా నిర్వహించిన మహిళల టీ20 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై గుజరాత్ జయాంట్స్ వుమెన్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని సాధించింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. చివర్లో ఒత్తిడి బాగా ఉండడం, చేయాల్సిన పరుగులు కూడా అధికంగానే ఉండడంతో ఢిల్లీ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఢిల్లీపై గుజరాత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో గుజరాత్ తన రెండో విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా గుజరాత్ జయాంట్స్ వుమెన్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో గుజరాత్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో సోఫీ డివైన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుపై విరుచుకు పడింది. అయితే మరో 5 రన్స్ చేసి ఉంటే సెంచరీ పూర్తయ్యేది కానీ మిస్ అయింది. ఇక మరో ప్లేయర్, కెప్టెన్ ఆష్‌లే గార్డెనర్ కూడా రాణించింది. 26 బంతుల్లోనే ఆమె 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేయడం విశేషం. ఇక ఢిల్లీ ప్లేయర్లలో నందని శర్మ 5 వికెట్లు పడగొట్టగా, షినెల్ హెన్రీ, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. షఫాలి వర్మకు 1 వికెట్ లభించింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో ఓపెనర్ లిజెల్ లీ చక్కని శుభారంభం అందించి చాలా సేపు క్రీజులో నిలిచింది. కానీ అవతలి ఎండ్ నుంచి వికెట్లు పడ్డాయి. ఈ క్రమంలో ఆమె లారా వోల్వార్ట్ తో కలిసి గుజరాత్‌ను చాలా సేపు ముప్పు తిప్పలు పెట్టింది. ఇంకాసేపు ఆమె ఆడి ఉంటే ఢిల్లీకి సునాయాసమైన విజయం లభించేది. కానీ లీ ఔట్ అయ్యాక వెంట వెంటనే వికెట్లు పడడం, రన్ రేట్ పెరగడంతో ఆ తరువాత వచ్చిన ప్లేయర్లు ఒత్తిడిని ఫీలయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు స్కోరు ఛేజ్ చేయలేకపోయింది. ఇక లిజెల్ లీ 54 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేయగా, వోల్వార్ట్ 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్ 2 వికెట్లు తీసి ఆల్ రౌండర్‌గా సత్తా చాటగా, మరో బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు సైతం 2 వికెట్లు లభించాయి. అలాగే కశ్వీ గౌతమ్‌కు 1 వికెట్ దక్కింది. ఇక 95 పరుగులు చేయడంతోపాటు 2 వికెట్లు తీసి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆల్ రౌండర్ సోఫీ డివైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






