Lionel Messi | మెస్సి భారత పర్యటనలో ఫుట్ బాల్ ఆడకపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..!
Lionel Messi | ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు, సాకర్ మాంత్రికుడు లియోనెల్ మెస్సి భారత పర్యటన విజయవంతంగా ముగిసిన విషయం విదితమే. తొలి రోజు పర్యటనలో కోల్‌కతా, హైదరాబాద్‌ను సందర్శించగా, తరువాత వరుసగా ముంబై, ఢిల్లీలలో పర్యటించాడు. అయితే కోల్‌కతా పర్యటన మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. కానీ మిగిలిన వేదికలపై ఇండియన్ ఫ్యాన్స్‌తో మెస్సి అద్భుతంగా ఎంజాయ్ చేశాడు. అలాగే ఆయా రాష్ట్రాల సీఎంలు, పలువురు సెలబ్రిటీలు సైతం మెస్సితో సందడి చేశారు. ఫుట్‌బాల్ ప్లేయర్స్ అతనితో ఫొటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్‌లు ఇచ్చేందుకు ఉత్సాహం కనబరిచారు. ఈ క్రమంలోనే మెస్సి ఢిల్లీలో చివరిసారిగా భారత అభిమానులతో మాట్లాడుతూ తాను ఇండియాకు మళ్లీ తప్పక వస్తానని, ఈసారి టూర్‌లో కచ్చితంగా మ్యాచ్‌లు ఆడతానని చెప్పాడు. అయితే ప్రస్తుత పర్యటనలో మెస్సి మ్యాచ్‌లు ఆడకపోవడం అతని ఫ్యాన్స్‌ను కాస్త నిరుత్సాహ పరిచిందని చెప్పవచ్చు.
అయితే మెస్సి భారత పర్యటనలో మ్యాచ్‌లు ఆడకపోవడానికి బలమైన కారణమే ఉందని అంటున్నారు. సెక్యూరిటీ కారణాలు కాదు కానీ, అతని ఎడమ కాలిని అతను సుమారుగా 900 మిలియన్ల డాలర్లకు ఇన్సూర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతం మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ.8100 కోట్లు అన్నమాట. ఇక ఇందుకు గాను ఏడాదికి ఒక శాతం ప్రీమియం చెల్లించాలని అనుకున్నా అది ఏడాదికి 9 మిలియన్ డాలర్లు అవుతుంది. అయితే భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్న మెస్సికి ఏడాదికి 9 మిలియన్ డాలర్ల ప్రీమియం అంటే పెద్ద లెక్క కాదని చెప్పవచ్చు. ఏడాదికి అతని సంపాదన సుమారుగా 135 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అందులో చాలా మొత్తాన్ని మెస్సి కేవలం తన ఎడమ కాలి ఇన్సూరెన్స్ ప్రీమియంకే ఖర్చు చేస్తుండడం విశేషం.
ఇక మెస్సి ఎడమకాలికి ఉన్న ఇన్సూరెన్స్ కేవలం అధికారిక మ్యాచ్‌లు లేదా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లీగ్ మ్యాచ్‌లకే వర్తిస్తుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు వర్తించదు. అధికారిక మ్యాచ్‌లలో ఎడమ కాలికి గాయం అయితేనే, అది కూడా అతనికి జీవితాంతం కోలుకోలేని దెబ్బగా మారితేనే అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఎగ్జిబిషన్ లేదా ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో అతను గాయ పడితే దానికి ఇన్సూరెన్స్ ఇవ్వరు. కనుకనే మెస్సి భారత పర్యటనలో మ్యాచ్‌లను ఆడలేదని తెలుస్తోంది. అంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ ఉన్నందున దాన్ని సాధారణ మ్యాచ్‌లకు అనవసరంగా ఎవరూ వదులుకోరు. కనుకనే మెస్సి మన దగ్గర రిస్క్ తీసుకోలేదు. అయితే ఈసారి మెస్సి ఇండియాకు వస్తే మాత్రం అధికారిక మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మెస్సి మళ్లీ భారత్‌కు వస్తాడా, ఇక్కడ మ్యాచ్ ఆడతాడా.. అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lionel Messi Wine and Sprite Drink | వైన్‌లో స్ప్రైట్ కలుపుకొని తాగిన మెస్సీ.. సర్రున ఎగబాకిన కోకకోలా స్టాక్స్
జనవరి 12, 2026

Messi | ఇండియా టూర్‌కు మెస్సికి రూ.89 కోట్లు ఇచ్చారు.. వెల్లడించిన నిర్వాహకుడు..
డిసెంబర్ 21, 2025

Anant Ambani | మెస్సికి రూ.10.91 కోట్లు విలువ చేసే వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..!
డిసెంబర్ 17, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



