త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కి జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండిస్‌.. ఎవిన్ లూయిస్, అల్జారీ జోసెఫ్ దూరం..

T20 World Cup | టీ20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ తమ 15 మంది ఆటగాళ్లతో జ‌ట్టును ప్ర‌క‌టించింది. కొత్త‌గా 25 ఏళ్ల గ‌యానీస్ బ్యాట్స్‌మెన్ క్వింటిన్ సాంప్స‌న్‌కు జ‌ట్టులో చోటు క‌ల్పించింది. కరేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోకి పిలుపువ‌చ్చింది.

P

Sports | Published On Jan 26, 2026, 9.15 pm IST

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కి జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండిస్‌.. ఎవిన్ లూయిస్, అల్జారీ జోసెఫ్ దూరం..
Advertisement

T20 World Cup | టీ20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ తమ 15 మంది ఆటగాళ్లతో జ‌ట్టును ప్ర‌క‌టించింది. కొత్త‌గా 25 ఏళ్ల గ‌యానీస్ బ్యాట్స్‌మెన్ క్వింటిన్ సాంప్స‌న్‌కు జ‌ట్టులో చోటు క‌ల్పించింది. కరేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోకి పిలుపువ‌చ్చింది. దుబాయిలో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో సాంప్సన్ అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేసిన‌ప్ప‌టికీ.. సీపీఎల్‌లో రాణించ‌డంతో సెలెక్ట‌ర్లు అత‌ని వైపు మొగ్గు చూపారు.

సాంప్సన్ గయానా అమెజాన్ వారియర్స్ త‌ర‌ఫున మూడో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్సాట్స్‌మెన్‌గా నిలిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 241 పరుగులు చేశాడు. అఫ్గానిస్తాన్ సిరీస్‌కు దూర‌మైన రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ తిరిగి జట్టులోకి వచ్చారు. వీరితో పాటు సీనియ‌ర్లు జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్‌కు ప్ర‌పంచ‌క‌ప్ టీమ్‌లో బెర్తు ద‌క్కింది. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచులు ఆడ‌గా.. గాయం కారణంగా భారత పర్యటనకు దూరమయ్యాడు. భుజం నొప్పితో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

అఫ్గానిస్తాన్ సిరీస్‌కు ముందు గయానా అమెజాన్ వారియర్స్ 12 సీపీఎల్ మ్యాచ్‌లలో ఐదింటికి మాత్ర‌మే అందుబాటులో ఉన్నాడు. హోల్డర్, జోసెఫ్, మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్ పేస్ భారం మోయ‌నున్నారు. అకేల్ హోసేన్ స్పిన్ భారం మోయ‌నుండ‌గా.. రోస్టన్ చేజ్, గుడకేష్ మోటీ స‌హ‌కారం అందించ‌నున్నారు. ఎడమచేతి వాటం ఓపెనర్ ఎవిన్ లూయిస్, ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్ గాయాల‌తో జ‌ట్టుకు దూర‌మ‌య్యారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వెస్టిండిస్ ఇంగ్లాండ్‌, స్కాట్లాండ్‌, నేపాల్‌, ఇట‌లీతో గ్రూప్ సీలో ఉంది. ఫిబ్ర‌వ‌రి 7న తొలి మ్యాచ్‌ను స్కాట్లాండ్‌తో ఆడుతుంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది.

వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హిట్‌ హెట్మైర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హో.

Advertisement

తాజావార్తలు

Advertisement