త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | కోహ్లి ఇచ్చిన బ్యాట్‌ల‌కు భావోద్వేగానికి గురైన‌ ఆఫ్గన్ ప్లేయ‌ర్ గుర్బాజ్

T20 World Cup 2026 | తోటి క్రికెట‌ర్ల ప్ర‌తిభ‌ను గుర్తించి వారిని ప్రోత్స‌హించ‌డంలో టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీ20లు, టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిప్ప‌టికీ వ‌న్డేల్లో మాత్రం కొన‌సాగుతున్నారు.

S

Cricket | Published On Feb 15, 2026, 1.29 pm IST

T20 World Cup 2026 | కోహ్లి ఇచ్చిన బ్యాట్‌ల‌కు భావోద్వేగానికి గురైన‌ ఆఫ్గన్ ప్లేయ‌ర్ గుర్బాజ్
Advertisement

T20 World Cup 2026 | తోటి క్రికెట‌ర్ల ప్ర‌తిభ‌ను గుర్తించి వారిని ప్రోత్స‌హించ‌డంలో టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీ20లు, టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిప్ప‌టికీ వ‌న్డేల్లో మాత్రం కొన‌సాగుతున్నారు. అయితే న్యూజిలాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే సిరీస్ అనంత‌రం లండ‌న్ వెళ్లిన కోహ్లి ఇటీవ‌లే ఇండియాకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయన ఆఫ్గ‌నిస్థాన్ క్రికెట‌ర్ ర‌హ్మానుల్లా గుర్బాజ్‌కు రెండు బ్యాట్‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. అయితే కోహ్లి నుంచి వ‌చ్చిన ఆ బ్యాట్ల‌ను అందుకున్న అనంత‌రం గుర్బాజ్ ఉబ్బి త‌బ్బిబ్బైపోయాడు. కోహ్లి త‌నపై చూపించిన ఆప్యాయ‌త‌కు అత‌ను భావోద్వేగానికి గుర‌య్యాడు. కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా గుర్బాజ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

కోహ్లికి గుర్బాజ్ ధ‌న్య‌వాదాలు..

కోహ్లి నుంచి బ‌హుమ‌తిగా వ‌చ్చిన బ్యాట్ల‌ను అందుకున్న అనంత‌రం గుర్బాజ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఈ అద్భుత‌మైన బ‌హుమ‌తికి ధ‌న్యవాదాలు కోహ్లి భాయ్‌. మీరు ఒక లెజెండ్ మాత్ర‌మే కాదు, అన్ని త‌రాల‌కూ స్ఫూర్తి.. అంటూ గుర్బాజ్ త‌న పోస్టులో భావోద్వేగంగా స్పందించాడు. అయితే కోహ్లికి ఇలా క్రికెట‌ర్ల‌కు గిఫ్టులు ఇవ్వ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలోనూ ఆయ‌న ప‌లువురు ప్లేయ‌ర్ల‌కు ఇలాగే బ‌హుమ‌తుల‌ను ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఐపీఎల్‌లో త‌న స‌హ‌చ‌ర ఆర్‌సీబీ ప్లేయ‌ర్ ర‌జ‌త్ ప‌టిదార్‌తోపాటు బంగ్లాదేశ్ ఆల్ రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్‌, భార‌త యువ ప్లేయ‌ర్ రింకు సింగ్‌ల‌కు గ‌తంలో కోహ్లి బ్యాట్‌ల‌ను గిఫ్టులుగా ఇచ్చారు.

ఆఫ్గ‌నిస్థాన్ సూప‌ర్ 8 చాన్సులు సంక్లిష్టం..

అయితే ఆఫ్గ‌నిస్థాన్ ఇటీవ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో ఓడిపోయినా ఆఫ్గ‌న్ ప్లేయ‌ర్ గుర్బాజ్ మాత్రం త‌న బ్యాటింగ్ మెరుపుల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. మ్యాచ్‌లో గుర్బాజ్ 42 బంతుల్లో 84 ప‌రుగుల చేయ‌డంతోపాటు డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌లో త‌న జ‌ట్ట‌ను చివ‌రి వ‌ర‌కు తీసుకెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. అయితే అత‌ను ఆడిన షాట్లు మాత్రం అద్భుత‌మ‌నే చెప్పాలి. ఆ మ్యాచ్‌లో అత‌ని ఆట‌తీరు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే గుర్బాజ్‌కు కోహ్లి బ్యాట్‌ల‌ను గిఫ్ట్‌గా ఇవ్వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇక కోహ్లి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్‌లో పాల్గొన‌నున్నాడు. మ‌రో వైపు ఆఫ్గ‌నిస్థాన్‌కు ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్ 8 అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల‌ను యూఏఈ, కెన‌డాల‌తో ఆఫ్గ‌నిస్థాన్ ఆడాల్సి ఉంది. వాటిల్లో ర‌న్ రేట్‌ను ఎక్కువ‌గా సాధించాల్సి ఉంటుంది. అలాగే సౌతాఫ్రికా లేదా న్యూజిలాండ్ జట్ల‌లో ఒక జ‌ట్టు త‌డ‌బ‌డ‌డంతోపాటు ర‌న్ రేట్ కూడా త‌గ్గాల్సి ఉంటుంది. అలా జ‌రిగితేనే ఆఫ్గ‌న్‌కు సూప‌ర్ 8 చాన్స్ ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement