ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
ICC Women's T20 World Cup | త్వరలో జరుగనున్న టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. జూన్ 12 నుంచి జులై 5 వరకు ఇంగ్లండ్, వేల్స్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనుంది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సెలెక్షన్ కమిటీ సమావేశం అనంతరం జట్టు వివరాలను ప్రకటించారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఈ సారి తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌పై కన్నేసింది.
తొలిసారిగా ఛాన్స్..
ఇక జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ యాస్తిక భాటియా తిరిగి జట్టులోకి వచ్చింది. ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ రాధా యాదవ్‌కు మళ్లీ అవకాశం దక్కింది. డబ్ల్యూపీఎల్‌లో ఆకట్టుకున్న యువ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారు. సీమ్ ఆల్‌రౌండర్లు అమన్‌జోత్ కౌర్, కష్వీ గౌతమ్ గాయాల కారణంగా దూరమవడంతో నందినికి అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ చరణి, అరుంధతి రెడ్డి కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.
గ్రూప్ దశలో హోరాహోరీ..
టీ20 ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగనుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. భారత్ గ్రూప్-1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో కలిసి ఉంది. ఈ గ్రూప్‌ను ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా పేర్కొంటున్నారు. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్లతో మ్యాచులు భారత్‌కు సవాల్‌గా మారనున్నాయి. ఈ వరల్డ్ కప్‌కు ముందు భారత్ మే 28 నుంచి జూన్ 2 వరకు ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్ కూడా ఆడనుంది.
భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తిక భాటియా (వికెట్ కీపర్), శ్రీ చరణి, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






